తాలూకా హైస్కూల్ ప్రాంగణం విశేష ఆధ్యాత్మిక సేవకు వేదికకానుంది

తాలూకా హైస్కూల్ ప్రాంగణం విశేష ఆధ్యాత్మిక సేవకు వేదికకానుంది
శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తిరుమలలో శ్రీవారికి నిత్యం నిర్వహించే ఆర్జిత సేవలను ఈనెల 29నుండి ఫిబ్రవరి 4వరకు తాలూకా హైస్కూల్ ప్రాంగణంలో వేదికగా శ్రీ గోవింద నామ జప యజ్ఞ పూర్ణాహుతి శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభ వోత్సవములు విశేషంగా నిర్వహించనున్నట్లు శ్రీ విద్యాపీఠం ,శ్రీ.సాలిగ్రామ మఠం     మఠాధిపతి   శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాల స్వామీజీ వెల్లడించారు. గురువారం సాయంత్రం తాలూకా హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన ప్రచార బ్రో చర్లనుఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాల స్వామీజీ మాట్లాడుతూ తిరుమలలో శ్రీవారికి సుప్రభాత సేవ నుండి ఏకాంత సేవ వరకు ఏ విధమై నటువంటి ఆర్జిత సేవలు నిర్వహిస్తారో, అదేవిధంగా తెనాలిలో ఏడు రోజులు శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభోత్సవములు ఉంటాయన్నారు 9 అడుగుల శ్రీవారి మూల విరాట్ కు ఆర్జిత సేవలను తిరుమలలో నిర్వహించే తీరుగా నిర్వహించడం జరుగుతుందన్నారు అదేవిధంగా ఏడు కోట్ల గోవింద నామ జప పూర్ణాహుతి కార్యక్రమం ప్రాధాన్యతను సంతరించుకున్న అంశమని భక్తులు ఈ విశేష కార్యక్రమాలలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కావలసినదిగా కోరారు .ఈవారం రోజులు అనేక మంది  సాదు పుంగవులు, ఆధ్యాత్మిక  సంపన్నులు ,ఆత్మీయ అతిథులుగా వేంచేయనున్న తెలిపారు. శ్రీ విద్యాపీఠం శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ చైర్మన్ నంబూరువెంకట కృష్ణమూర్తి మాట్లాడుతూ ఈ విశేష కార్యక్రమంలో లక్షల లడ్డూల తో స్వామివారికి అర్చన నివేదన కార్యక్రమం,తొలిసారి గా,నిర్వహిస్తున్నట్లు తెలిపారు.లక్ష లడ్డూల తో అర్చన నివేదన ఇంతవరకు ఎక్కడా జరగలేదన్నారు. ప్రతిరోజు సాయంత్రం సామూహికముగ భక్తులచే సహస్ర గళార్చన కార్యక్రమం వీటితో పాటుగా ప్రతిరోజు సాయంత్రం శృంగేరి శారదా పీఠ ఆస్థాన పండితులు డాక్టర్ బాచం పల్లి సంతోష్ కుమార్ శాస్త్రి చే, శ్రీ వెంకటేశ్వర వైభవ సప్తాహ ప్రవచన కార్యక్రమం ఉంటుందన్నారు. ఆధ్యాత్మిక చింతనా పరులు, ప్రముఖ పారిశ్రామికవేత్త కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తెనాలి పట్టణంలో ఓ చక్కని కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచే విధంగా ఏర్పాటు చేయడం, ముదా వహమని భక్తులు ఈ విశేష కార్యక్రమాలలో వారం రోజులపాటు పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహమునకు పాత్రులు కావలసినదిగా కోరారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల 30 నిమిషాలకు సుప్రభాత సేవతో మొదలై, రాత్రి 9 గంటలకు ఏకాంత సేవా కార్యక్రమం వరకు,తిరుమలలో నిర్వహించే తీరుగానెవైఖానస ఆగమ శాస్త్రానుసారముగ శ్రీవారి నిత్య పూజలు కొన సాగుతాయన్నారు. తెనాలి ప్రాంత భక్తులకు ఇదో చక్కని అవకాశంగా భావించి కార్యక్రమాలను తిలకించి స్వామి అనుగ్రహానికి పాత్రులు అయ్యే అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అనంతరం ప్రచార బ్రోచర్లను ఆవిష్కరించారు కార్యక్రమంలో కోన నాగేశ్వరరావు ,గోపు రామకృష్ణ ,ముద్దాబత్తుని రమణయ్య ,గొడవర్తి సాయి హరే రామ్ ,రావూరి సుబ్బారావు తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు