ప్రభుత్వ నిర్ణయం పై ఏపీడబ్లూజేఎఫ్ హర్షం

ప్రభుత్వ నిర్ణయం పై ఏపీడబ్లూజేఎఫ్ హర్షం

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
రాష్ట్రం లో పనిచేస్తున్న జర్నలిస్టులకు మూడు సెంట్ల ఇంటి స్థలం కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఏపీడబ్ల్యూజేఎఫ్ హర్షం వ్యక్తం చేసింది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుకు సంబంధించి ప్రభుత్వం తొమ్మిది వేలకు పైగా దరఖాస్తులను సమాచార శాఖ ధ్రువీకరించింది. జిల్లాల్లో కమిటీల ఏర్పాటు కూడా జరిగి కమిటీలు సమావేశమై జిల్లాల్లో ఎంత స్థలం అవసరమని అంశంపై ఒక నిర్ధారణకు రావలసి ఉన్నది. అన్ని జిల్లాల్లో కమిటీల సమావేశాలు ఇంకా పూర్తి కాలేదు. ఎన్నికల నోటిఫికేషన్ అతి తక్కువ కాలంలో వెలువడ బోతున్నదనే సమాచారంతో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు వ్యవహారంలో జాప్యం జరుగుతుందని
ఆందోళన పెరుగుతున్నది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చి త్వరితగతిన ఇంటి స్థలం కేటాయించేందుకు వీలైన నిర్ణయం తీసు కోవాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్ర ప్రదేశ్ బాడ్కస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్లు సంయుక్తంగా ప్రభుత్వానికి ప్రకటనలో విజ్ఞప్తి
 చేశాయి. ప్రకటన చేసిన వారిరో
 అధ్యక్షులు ఎస్ వెంకట్రావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు అధ్యక్షులు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మల్లికార్జున రెడ్డి, వి శ్రీనివాసరావు, మునిరాజు లు ఉన్నారు.