తెనాలి పట్టణ బిజెపి అధ్యక్షులుగా సంపత్ రాయుడు

తెనాలి పట్టణ బిజెపి అధ్యక్షులుగా సంపత్ రాయుడు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
 భారతీయ జనతా పార్టీ తెనాలి పట్టణ అధ్యక్షులుగా సీనియర్ నాయకులు అడపా వెంకట లక్ష్మీ సంపత్ రాయుడు కు, మరోసారి అవకాశం.గురువారం గుంటూరు జిల్లా భారతీయ జనతాపార్టీ కార్యాలయంలో, జిల్లా పార్టీ అధ్యక్షులు వనమా నరేంద్రకుమార్ నుండి నియామక పత్రం అందుకున్న సంపత్ రాయుడు.ఈక్రమంలో పలువురు బిజెపి నాయకులు సంపత్ రాయుడు కు అభినందనలు తెలిపారు.కాగా తనకు తెనాలి పట్టణ బిజెపి అధ్యక్షులు గా అవకాశం కల్పించిన, రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి, రాష్ట్ర పార్టీ ప్రధానకార్యదర్శి దయాకర్ రెడ్డి, జిల్లా ఇంఛార్జి శ్రీనివాసరాజు, జిల్లా పార్టీ అధ్యక్షులు వనమా నరేంద్రకుమార్ లకు సంపత్ రాయుడు ధన్యవాదాలు తెలిపారు.పట్టణంలో పార్టీ అభివృధ్ధికి ,కమల వికాసం కోసం ,అందరిని కలుపుకుంటూ  ముందుకు వెళతామన్నారు