మన చదువుల తల్లి సావిత్రి బాయ్ పూలే జయంతి నేడు.

నాకు తెలిసిన సావిత్రి బాయ్ పూలే..
ఆమెకు 9 యేళ్ళు నిరక్షరాస్యురాలు 12 ఏళ్ళ జ్యోతిరావు పూలే ను పెళ్ళిచేసుకున్నారు...
జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో ఇంట్లోనే చదువుకుని విద్యావంతురాలు అయ్యారు...
కొంతకాలానికి భర్త తో కలిసి పాఠశాల స్థాపించారు...
ఈ పాఠశాల ఆర్థీకలావాదేవీలకో , సమాజం లో పలుకుబడికోసమో కాదు...
కులమత భేదాలకు అతీతంగా సమాజం మార్పు కోసం...
ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించారు...
కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా అనుకున్నారు...
ఆమె ఆడవాళ్ళు చదవాలని పోరాడుతూ ఉపాధ్యాయురాలిగా బాలికలను ప్రోత్సాహిస్తున్న సమయంలో ఆమె పై వేధింపులకు, భౌతికదాడులకు పూనుకున్నారు... పాఠశాలకు నడిచే దారిలో ఆమెపై బురద చల్లడం, రాళ్లు విసరడం, అసభ్య పదజాలాన్ని వాడటం వంటివి చేశారు...
అయినా ఆమె తన వృత్తిని నిర్వహించేవారు...
పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి మన సావిత్రి బాయ్ పూలే.
మన చదువుల తల్లి సావిత్రి బాయ్ పూలే జయంతి నేడు..
సేకరణ