టాలెంట్ ఎక్స్ ప్రెస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన డాక్టర్ కనపర్తి అబ్రహాం లింకన్

టాలెంట్ ఎక్స్ ప్రెస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన డాక్టర్ కనపర్తి అబ్రహాం లింకన్
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెనాలి: సీనియర్ జర్నలిస్ట్, దర్శకుడు కనపర్తి రత్నాకర్ ఎడిటర్ గా నిర్వహిస్తున్న టాలెంట్ ఎక్స్ ప్రెస్ నూతన సంత్సర కలెందర్ ను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంబేడ్కర్ చైర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కనపర్తి అబ్రహాం లింకన్ బుధవారం ఆవిష్కరించారు.  స్థానిక బస్టాండ్ సమీపంలో లోని అంబేడ్కర్ సేవా ట్రస్ట్ కార్యాలయం లో కాలెండర్ ఆవిష్కరణ సభ జరిగింది. ఈ సందర్భంగా గా అబ్రహాం లింకన్ మాట్లాడుతూ టాలెంట్ ఎక్స్ ప్రెస్ ద్వారా సమాజం లోని పలు విషయాలను, సమస్యలను తెలియజేస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్న రత్నాకర్ అభినందనీయులు అని అన్నారు. పత్రికా రంగం లో మరింత రాణించాలని సూచించారు. కార్యక్రమం లో టాలెంట్ ఎక్స్ ప్రెస్ సహ సంపాదకులు మేకల సుబ్బారావు, ప్రతినిధి అత్తోట సంజయ్ కుమార్, జర్నలిస్ట్ లు  గుమ్మడి ప్రకాశరావు, అంబటి శ్యామ్ సాగర్, పి. పున్నయ్య, సి.హెచ్ చంద్రశేఖర్, హకీమ్ జాని, ట్రస్ట్ కార్యదర్శి డి. సందీప్ తదితరులు పాల్గొన్నారు.