తెనాలి పట్టణ వన్ టౌన్ సిఐగా దశరథ రామయ్య

వన్ టౌన్ సిఐగా దశరథ రామయ్య 
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెనాలి పట్టణ వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా
 జి. దశరధరామయ్య మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన సి.ఐ. కె.చంద్రశేఖర్ వి.ఆర్. కు బదిలీ అయ్యారు. నూతన సీఐ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించి, పనిచేస్తానని,శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.