మార్తా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో ఫేర్ వెల్ అండ్ ఫ్రెషర్స్ డే వేడుకలు

మార్తా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో ఫేర్ వెల్ అండ్   ఫ్రెషర్స్ డే వేడుకలు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
స్థానిక సుల్తానాబాద్ సుందరయ్య నగర్లో  మార్త గ్రూప్ ఆఫ్ నర్సింగ్ విద్యాసంస్థల్లో ఫేర్ వెల్ & ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల ఆటపాటలతో కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగింది. తెల్లవారుఝాము వరకూ విద్యార్థులు తమ ఆనందాన్ని నూతన విద్యార్థులతో పంచుకున్నారు. ఈ వేడుకల్లో విశాఖ జిల్లా అరకు విద్యార్థులు చేసిన దింశా నృత్యం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. మార్త గ్రూప్ నర్సింగ్ విద్యా సంస్థలో విద్యనభ్యసించిన పలువురు పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను వేదికపై పంచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. మార్త విద్యా సంస్థల ద్వారా నర్సింగ్ విద్యను అభ్యసించి ప్రభుత్వ కొలువులో ఉద్యోగాలు  పొందటానికి  కారణమైన విద్యాసంస్థల చైర్మన్ యనమల ఈశ్వరరావు, చందన ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షురాలు యనమల గీత లను పలువురు కొనియాడారు. పేద విద్యార్థులపై వారు చూపించిన ప్రేమ, వాత్సల్యత వెలకట్టలేనిదని మల్లేపాడు పూర్వ విద్యార్దిని 23వ వార్డు హెల్త్ సెక్రటరీ కె రాజ్యం కన్నీటి పర్యంతమయ్యారు. అధ్యాపకులుగా తమ బాధ్యతలను కళాశాలలో వదిలేయకుండా నర్సులుగా పరిణితి పొందినంతవరకు అనేక ఆసుపత్రులు ద్వారా శిక్షణ పొందే అవకాశం కల్పించారని తెనాలి జిల్లా జనరల్ ఆసుపత్రి హెల్త్ అసిస్టెంట్ కె సౌమ్యశ్రి  అన్నారు. ఉద్యోగకల్పనలో పేద విద్యార్థులను ఈశ్వర్ దంపతులు ఆర్దికంగా ఆదుకున్న తీరు ప్రశంసనీయమని పూర్వ విద్యార్ధి బాపట్ల మండలం వెడుల్లపల్లి హెల్త్ సెక్రటరీ జి శేషు కుమారి అన్నారు. తల్లితండ్రుల సంరక్షణలో తమ బిడ్డలు ఎలా ఎదుగుతారో మార్త విద్యాసంస్థల విద్యార్థులు కూడా వారిని అదేభావంతో చూస్తారని తెనాలి 14వ వార్డు సచివాలయం ఎ ఎన్ ఎం కె ఝాన్సి రాణి అన్నారు.  తలల్లో నాలుకలా అందరి మన్ననలు పొందుతున్నారు. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా, నర్సింగ్ విద్యా విధానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా బొదనలను మలచుకుని విద్యనందిస్తున్న విధానాన్ని పూర్వ విద్యార్దిని తెనాలి 32వ వార్డు సచివాలయం ఎ ఎన్ ఎం పి సునీత అభినందించారు. ప్రస్తుత విద్యా వ్యవస్థతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించి పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు దశాబ్దాల కాలం నుంచి బాసటగా ఈశ్వర్ దంపతులు నిలిచారని వక్తలు డిజిటల్ క్రియేటర్ దాసరి ప్రభాకరరావు, వై సందీప్ చంద్ర కొనియాడారు. భవిష్యత్తులో పేద విద్యార్థులకు బాసటగా నిలవాలని, వారి భవిష్యత్తు తీర్చిదిద్దే విషయంలో చొరవ తీసుకోవాలని జీవన జ్యోతి బిఎస్సీ నర్సింగ్ కళాశాల కరస్పాండెంట్ కాకి సుమన్  కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తు పొందే దిశగా కృషి చేయాలనీ, లక్ష్యాలను నిర్దేశించుకుంటూ వాటికి అనుగుణంగా కష్టపడాలని మా గ్రూప్ విద్యా సంస్థల చైర్మన్ యనమల ఈశ్వరరావు సూచించారు. ప్రకాశం, ఎం పి హెచ్ డబ్ల్యు  శిక్షణ సంస్థ, ఎస్ఆర్బి స్కూల్ ఆఫ్ నర్సింగ్(జి ఎన్ ఎం) మార్త కాలేజ్ ఆఫ్ బిఎస్సీ నర్సింగ్ కళాశాలల్లో   విద్యనభ్యసించిన విద్యార్థులు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 6 వందలకు పైగా విద్యార్థుల  ప్రభుత్వ ఉద్యోగాల్లో కొలువయ్యారని అన్నారు. తొలుత పై విద్యాసంస్థల్లో విద్యనభ్యసించి ఉద్యోగాలు పొందిన పూర్వ విద్యార్థులు ఐన కె సౌమ్య శ్రీ కె రాజ్యం, జె శేషు కుమారి, కె ఝాన్సి రాణి, పి సునీత లను విద్యా సంస్థలు చైర్మన్ యనమల ఈశ్వరరావు, చందన ఎడ్యుకేషనల్ అధ్యక్షురాలు యనమల గీత సన్మానించారు. కళాశాల స్టాఫ్ తరపున అకౌంటెంట్ దేవర్దనరావు అభినందన జ్ఞాపికతో పాటు,  చిత్రపటాన్ని ఈశ్వర్ దంపతులకు అందజేశారు. కార్యక్రమంలో విద్యా సంస్థల మేనేజర్ పి గిద్యోను, అడ్మినిస్ట్రేటర్ సిహెచ్ కమలాకర్, పి ఆర్ ఓ సిహెచ్ హనుమంతరావు, ఎస్ రాజేష్,  అకౌంట్స్ మేనేజర్  దార చంద్రకాంత్, టిబి సూపర్వైజర్ రవికుమార్,  అధ్యాపకులు పెరిసిస్ గోల్డ్, నవ్య, పి నళిణి, పి సౌజన్య, పి ఆదిలక్ష్మి, డి లలిత తదితరులు పాల్గున్నారు.