Skip to main content

Posts

Showing posts from February, 2024

నెహ్రూనికేతన్లో జాతీయ సైన్స్ దినోత్సవం

నెహ్రూనికేతన్లో జాతీయ సైన్స్ దినోత్సవం టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: తెనాలి: 28-02-2024: స్థానిక బోస్ రోడ్డులోని నెహ్రూనికేతన్ ఇంగ్లీషు మీడియం స్కూల్లో పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి పర్యవేక్షణలో బుధవారం ఉదయం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా చిన్నారులు సైన్స్ పట్ల అందరికీ ఆసక్తి పెరిగేలా పలు నమూనాలు తయారుచేసి ప్రదర్శించారు. కొందరు బాలబాలికలు సర్ సి.వి. రామన్ తో పాటు అనేకమంది శాస్త్రవేత్తల చిత్రపటాలను ప్రదర్శించి, వారు కనుగొన్న వస్తువుల వివరాలు, అవి నేడు మనకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయనే విషయాలను సవివరంగా తెలియజేశారు. కొందరు విద్యార్థులు సి.వి. రామన్ వేషధారణలో ఆయన జీవిత విశేషాలను తెలియజేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ తరువాత చిన్నారులు పాఠశాల నుండి ర్యాలీగా బయలుదేరి సైన్స్కు సంబంధించిన నినాదాల చార్టులను ప్రదర్శిస్తూ, వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాలి, ధరిత్రిని కాపాడాలి, నీటిని పరిరక్షించాలి, సైన్స్పట్ల అవగాహన పెంచుకోవాలి అంటూ నినాదాలు చేస్తూ చినరావూరు పార్కు వరకు వెళ్ళి తిరిగి పాఠశాలకు చేరారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, ఉపాధ్యాయులు పాల్గొన...

తెనాలి టాంక్ బండ్ పై తొలి విగ్రహావిష్కరణ

విగ్రహావిష్కరణలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, ఎమ్మెల్యే తెనాలి బండపై తొలి విగ్రహావిష్కరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: పట్టణ సుందరీకరణలో భాగంగా తెనాలి టాంక్ బండ్ ముస్తాబ వుతోంది. తెనాలి-విజయవాడ రోడ్డులో ఏర్పాటు అవుతున్న బండ్ పై తెనాలి ప్రాంతానికి పేరు గాంచిన  కవులు, కళాకారులు, రాజకీయ, శాస్త్ర, సాంకేతిక రంగ ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. దానిలో భాగంగా తొలిగా ఏర్పాటు చేసిన జాతీయ  వాది, అర్చకోద్యమ పితామహులు తమిరిశ రామా చార్యులు కాంస్య విగ్రహాన్ని త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డి, శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ తెనాలి బండ్ పట్టణ ప్రాంతా నికి వన్నె తేవడమే కాకుండా, భావితరాలకు ఈ ప్రాంత ప్రముఖుల విశేషాలను తెలియజేసేందుకు దోహద పడుతుందన్నారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి, డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి, ఎడ్లపాటి రఘునాధ బాబు, పి రామకృష్ణ, శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు, కౌన్సిలర్ పేరం సంజీవరెడ్డి, అనంతాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

American Telugu Association ATA invited Film producer Vijay Varma

American Telugu Association ATA invited Film producer Vijay Varma Talent Express News : ATA The Most Renowned Telugu community organization in USA has invited film producer director and social worker Vijay varma Pakalapati to participate in  18th ATA Convention & Youth Conference, Atlanta GA. On behalf of the American Telugu Association (ATA), it is our immense pleasure to invite Mr. Vijay varma as a Guest to  biennial ATA Convention and Youth Conference at The Georgia World Congress Center (GWCC), Atlanta, GA, from June 7th -9 th, 2024 ' president Madhu Bommineni and Convener Kiran Reddy Pasha mentioned in an invitation. It's a great honour from Renowned organization ATA, i will utilize this opportunity to bridge a strong bond between Telugu NRI's and film industry' Vijay Varma Pakalapati said.

సినీ సామాజిక వేత్త విజయ్ వర్మ కు అమెరికా తెలుగు అసోసియేషన్ ఆటా ఆహ్వానం

సినీ సామాజిక వేత్త విజయ్ వర్మ కు అమెరికా తెలుగు అసోసియేషన్  ఆటా ఆహ్వానం   టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: సినిమా రంగంలో నటునిగా , దర్శక నిర్మాతగా వుంటూ పలు గ్రామీణ ప్రాంతాలలో గ్రామ స్వరాజ్య ఫౌండేషన్ వ్యవస్థాపిక అధ్యక్షునిగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతున్న వీస్ విజయ్ వర్మ పాకలపాటి ని ప్రతిష్టాత్మిక అమెరికా తెలుగు అసోసియేషన్ ఆటా అమెరికా లో నిర్వహిస్తున్న ఆటా సభలకి విచ్చేయాలని ఆహ్వానించింది. భారత తెలుగు ఔనత్యాన్ని వ్యక్తీకరించపరిచే ఈ అవకాశం రావడం పట్ల వీస్ విజయ్ వర్మ పాకలపాటి ఆనందం వ్యక్తం చేస్తూ ప్రపంచ దేశాలను పర్యటించడం ద్వారా ఆయా దేశాలలో నెలకొన్న అవకాశాలను నేటి యువతకు మార్గదర్శకం చేయగలుగుతున్నాని వీస్ విజయ్ వర్మ  పేర్కొన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన ఆటా అనిల్ రెడ్డి గారికి , తన పేరుని సిఫార్స్ చేసిన ప్రముఖ మిమిక్రి కళాకారులు మిమిక్రి రమేష్ మరియు నటులు సాల్మోన్ షానీ కి విజయ వర్మ కృతఙ్ఞతలు తెలిపారు.

ఆంధ్రలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి నావంతు కృషి చేస్తా _ఎ. యమ్.రత్నం

ఆంధ్రలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి నావంతు కృషి చేస్తా -ఎ. యమ్.రత్నం టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్, డూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన ఎ.యమ్.రత్నం ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా.. ఆయన నెల్లూరు జిల్లా వాసి కావడంతో ఆ జిల్లాకు చెందిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, కళాకారులు నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ లో ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ కమిటీ సభ్యులకు, ఆయనకు ఘన సన్మానం చేసి చిత్ర పరిశ్రమలో ఆయన గొప్పతనాన్ని కొనియాడారు. ఎ. యమ్.రత్నం మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో నేను జన్మించినందుకు అదృష్టంగా భావిస్తున్నానని , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా చిత్ర పరిశ్రమను బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు..  ఛాంబర్ కార్యదర్శి జె.వి.మోహన్ గౌడ్ మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమలో నెల్లూరు జిల్లాకు ఎంతో ప్రాముఖ్యత ఉందని , నెల్లూరు జిల్లా నుంచి పేరు మోసిన కళాకారులు, నిర్మాతలు, దర్శకులు ఎందరో ఉన్నారని , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అందరం కలిసి కట్టుగా పని చేయాలని పిలుపు నిచ్చారు.. ఛా...

కామోత్సవ దహనం పుస్తకావిష్కరణ

కామోత్సవ దహనం పుస్తకావిష్కరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ఏ రూపంలో అశ్లీలత ఉన్నా దాన్ని తీవ్రంగా ప్రతిఘటించవలసిన అవసరం ఉందని అశ్లీలతా ప్రతిఘటన వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, ప్రజాసాహితి పత్రిక సంపాదకుడు కొత్తపల్లి రవిబాబు అన్నారు. అభ్యుదయ రచయితల సంఘం, అశ్లీలతా ప్రతిఘటన వేదిక ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేటలోని సి.పి.ఐ. కార్యాలయంలో సోమవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో అశ్లీలతా ప్రతిఘటన వేదిక వ్యవస్థాపకుడు ఈదర గోపీచంద్ సంపాదకత్వంలో వెలువడిన కామోత్సవ దహనం పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించి అనంతరం జరిగిన సభకు అధ్యక్షత వహించి ప్రసంగించారు. రవిబాబు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ 1987 ప్రాంతంలో ప్రముఖ కవి గుంటూరు శేషేంద్ర శర్మ రచించగా ఒక వారపత్రికలో ధారావాహికగా వచ్చిన కామోత్సవ్ అనే అశ్లీల రచనను ప్రతిఘటిస్తూ వ్యాసాలు రాసినందుకు తమపై కేసులు నమోదు చేసినప్పటికీ అవి వీగిపోయాయని రవిబాబు అన్నారు. ఈదర గోపీచంద్ మాట్లాడుతూ అప్పట్లో ధారావాహికగా వచ్చిన ఈ రచనను గుంటూరు శేషేంద్రశర్మ తనయుడు ప్రస్తుతం నవల రూపంలో అందుబాటులో తెచ్చారని ఆ కారణంగా అందులో ఉన్న అశ్లీలతను నేటి తరం వారికి తెలియజెప్పాలని అప్పట్లో ఈ రచనను వ్యత...

సందడిగా ఆత్మీయ వీడ్కోలు వేడుకలు

సందడిగా ఆత్మీయ వీడ్కోలు వేడుకలు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: తెనాలి: 25-02-2024: స్థానిక బోస్ రోడ్ లోని  నెహ్రూనికేతన్ జూనియర్ కళాశాలలో ఆదివారం రాత్రి నెహ్రూనికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి పర్యవేక్షణలో ద్వితీయ ఇంటర్ ఆత్మీయ వీడ్కోలు వేడుకలు సందడిగా జరిగాయి. ద్వితీయ ఇంటర్ వీడ్కోలును పురస్కరించుకుని విద్యార్థినీ విద్యార్థులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆడారు, పాడారు, అదరహో అనిపించారు. పలు పాత పాటలను ఆధునిక సంగీతాన్ని జోడించి విద్యార్థినులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ విద్యాసంవత్సరం ఇంటర్ విద్యార్థులకు నిర్వహించిన క్రీడలు, నృత్యాలు, పాటల పోటీలలో విజేతలకు జ్ఞాపికలు, బహుమతులు అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో నెహ్రూనికేతన్ వ్యవస్థాపకులు దాసరి ప్రకాశరావు, కళాశాల ప్రిన్సిపల్ వీరంకి శేషగిరిరావు, వైస్ ప్రిన్సిపల్ పి. నాగశంకర్, అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

Film and social worker Vijay varma awarded with Vishwaguru seva puraskaar

*Film and social worker Vijay varma awarded with Vishwaguru seva puraskaar* - Highcourt judge Venugopal presented the award Talent Express News: Vs. Vijay varma Pakalapati Film Producer, Director and social worker who is working for Rural Empowerment is awarded with most prestigious Vishwaguru Seva Puraskaar from the hands of Highcourt judge EV Venugopal.  Founder Satyavolu Rambabu has opted Mr. Vama by acknowledging his services rendered for Grama Swarajya Concept. In a response to receiving a prestigious award' This prestigious award giving me an more responsibility and my future activities including making movies will be in related with Rural empowerment'Varma said

సినీ సామాజికవేత్త విజయ్ వర్మ పాకలపాటి కి విశ్వగురు సేవా పురస్కారం

సినీ సామాజికవేత్త విజయ్ వర్మ పాకలపాటి కి విశ్వగురు సేవా పురస్కారం టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: సినీ నిర్మాత గా దర్శకుని గా మరియు వివిధ సామాజిక కార్యక్రమాలతో రాష్ట్ర దేశ స్థాయిలో ఎన్నో ప్రశంసలు పొందిన విజయ్ వర్మ పాకలపాటి కి మరో అత్యున్నత పురస్కారం లభించింది. ప్రతిష్టాత్మక విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ గ్రామ స్థాయినుండి ఉభయ తెలుగు రాష్ట్రాలలో తనవంతు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న విజయ్ వర్మ పాకలపాటి ని విశ్వగురు సేవా పురస్కారంతో సత్కరించింది.హైకోర్టు జడ్జి వేణుగోపాల్  ఈ పురస్కారాన్ని అందించి విజయ్ వర్మ ను అభినందించారు .సంస్థ వ్యవస్థాపకులు సత్యవోలు రాంబాబు గారు, రిటైర్డ్ ఐ ఏ ఎస్ లక్ష్మికాంత్ లు విజయ్ వర్మ అందిస్తున్న తనవంతు సేవలు ఎందరికో ఆదర్శమని కొనియాడారు. అవార్డు గ్రహీత విజయ్ వర్మ పాకలపాటి మాట్లాడుతూ సినీ నటులు బ్రహ్మానందం ,  సినీ నటులు ఆదిత్య ఓం ,  నారీసేన వ్యవస్థాపకురాలు లతా  బోట్ల , రోటరీ సంస్థ, షిర్డీ సాయి సంస్థాన్ యూ ఎస్ ఏ, రోటేరియన్ సురేన్ వంటి ఎందరో ప్రముఖుల సహకారంతోనే కొన్ని కార్యక్రమాలు చెయ్యగలిగానని , భవిష్యత్ లో దేశ అంతర్జాతీయ సేవా సంస్థ...

విజ్ఞాన్స్‌ విద్యార్థికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ విద్యార్థికి పీహెచ్‌డీ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ – కోర్‌ ఇంజినీరింగ్‌ విభాగంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మెకానికల్‌ విభాగానికి చెందిన గరిగిపాటి  ఫృథ్వి రాజు అనే విద్యార్థికి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ శుక్రవారం పీహెచ్‌డీ పట్టా అందజేసిందని వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ ప్రిపరేషన్, క్యారక్టరైజేషన్‌ అండ్‌ కంపుటేషనల్‌ మెషినింగ్‌ స్టడీస్‌ ఆన్‌ అల్యూమినియం సిలికాన్‌ 7– సిలికాన్‌ కార్భైడ్‌ కాంపోసైట్‌’’ అనే అంశంపై ఆయన పరిశోధన చేశారని తెలియజేశారు. ఈయనకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ మెకానికల్‌ విభాగానికి చెందిన మాజీ ప్రొఫెసర్‌ కే.బాలమురుగన్‌ గైడ్‌గా వ్యవహరించారని పేర్కొన్నారు. పీహెచ్‌డీ పట్టా పొందిన గరిగిపాటి ఫృథ్వి రాజును ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపకులు అభినందించారు.
నాటకరంగంలో మహానటి సావిత్రి అవార్డు ప్రకటిస్తే తొలిగా శ్రీజ కి ఇవ్వమని చెప్తాను -  సినీ దర్శకులు వి.యన్. ఆదిత్య టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ఈరోజుల్లో నిజాలు మాట్లాడడం చాలా డేంజర్, అలాంటిది సమాజంలో చూసిన వ్యక్తులు, ఎదుర్కొన్న పరిస్థితుల ఆధారంగా కవితల బాణాలు సంధించడానికి చాలా ధైర్యం కావాలి,  డా. శ్రీజ సాదినేని చేసిన అలాంటి సాహసం విజయం సాధించాలని ప్రముఖ సినీ దర్శకులు వి.యన్.ఆదిత్య అన్నారు. సినీ నటి, రచయిత్రి డా.శ్రీజ సాదినేని రచించిన "శ్రీజ కోట్స్" నిప్పు లాంటి నిజాలు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్ చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభ, గుండవరపు హనుమంతరావు కళా వేదికలో ఘనంగా జరిగింది.  ఈ కార్యక్రమానికి సినీ దర్శకులు వి. యన్. ఆదిత్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పుస్తకాన్ని ఆవిష్కరించి మొదటి కాపీని వర్ధమాన సినీ దర్శకులు గౌరీ నాయుడుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆదిత్య మాట్లాడుతూ ...  డా.శ్రీజ నటించిన నేషనల్ హైవే అనే నాటికలో స్వతంత్ర అనే పాత్రను పోషించారు. ఆమె నటనకు థియేటర్ మొత్తం స్టాండింగ్ ఓవేషన్ చేశారు. క్లైమాక్స్ లో అందరినీ ఏడిపించేసింది.నాటిక మర...

Malaysian audience praising Telugu movies

*Malaysian audience praising Telugu movies* - FTPC INDIA President Janga chaitanya, secretary Vijay varma Talent express news: Film and television promotion council of India has organized an event titling INDO - MALAYSIA FILM AND TOURISM EXCHANGE - 2024 in Koulalampur, Malaysia. To exchange the Technology, promotion and finding new locations, these kind of Events help a lot ' president FTPC INDIA Chaitanya janga said.  We have met  many production houses during this trip,Malaysian production houses keen in exchanging technology and promotional support between the countries, interestingly Malaysian public admiring indian films, in particular Telugu movies' secretary FTPC INDIA, Vs. Varma Pakalapati said.

*తెలుగు చిత్రాల పట్ల అమితాసక్తిని కనబరుస్తున్న మలేషియా వాసులు**ఇండో మలేషియా ఫిల్మ్ ఎక్స్ చేంజ్ నిర్వహించిన ఎఫ్ టి పీ సి ఇండియా**ఈ కార్యక్రమం తో నిర్మాతలకు ఎంతో ప్రయోజనం అంటున్న అధ్యక్ష, కార్యదర్శులు చైతన్య జంగా, వీస్ విజయ్ వర్మ పాకలపాటి*బాహుబలి, పుష్ప, సలార్ వంటి చిత్రాలతో ఇండియన్ సినిమా ముఖ్యంగా తెలుగు సినిమా అంటే మలేషియన్ వాసులు అమితాసక్తిని కనబరుస్తున్నారని, ముఖ్యంగా మన పాటలు వారు స్పష్టంగా పడుతుండటం చూసి ఎంతో ఆనందం కలిగిందని ఫిలిం అండ్ టెలివిజన్ ప్రొమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్ష, కార్యదర్శులు జంగా చైతన్య, విజయ్ వర్మ పాకలపాటి హర్షం వ్యక్తం చేశారు. సినీ సాంకేతికత, నైపుణ్యం మరియు టూరిజం వంటివి ఇరు దేశాల మధ్య సంబంధాలు పెంపొందించుటయే లక్యంగా ఇప్పటికే నేపాల్, శ్రీలంక దేశాలలో కార్యక్రమాలు నిర్వహించిన ఎఫ్ టి పి సి ఈ వారంలో మలేషియా లోని కౌలాలంపూర్ లో ఇండో - మలేషియా ఫిలిం అండ్ టూరిజం ఎక్స్చేంజి పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించి ఇండియా లో వున్న సినీ సాంకేతిక నిపుణత మరియు లొకేషన్స్ పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ నిర్వహించింది. అలాగే మలేషియా లో వున్న లొకేషన్స్ మరియు సాంకేతిక నిపుణులతో అవగాహన కుదుర్చుకొంది. తద్వారా మన చిత్రాలు సులభంగా అక్కడ షూటింగ్ చేసుకొనే వీలుందని ఎఫ్ టి పీ సి సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

తెలుగు చిత్రాల పట్ల అమితాసక్తిని కనబరుస్తున్న మలేషియా వాసులు *ఇండో మలేషియా ఫిల్మ్ ఎక్స్ చేంజ్ నిర్వహించిన ఎఫ్ టి పీ సి ఇండియా* *ఈ కార్యక్రమం తో నిర్మాతలకు ఎంతో ప్రయోజనం అంటున్న అధ్యక్ష, కార్యదర్శులు చైతన్య జంగా, వీస్ విజయ్ వర్మ పాకలపాటి* టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: బాహుబలి, పుష్ప, సలార్ వంటి చిత్రాలతో ఇండియన్ సినిమా ముఖ్యంగా తెలుగు సినిమా అంటే మలేషియన్ వాసులు అమితాసక్తిని కనబరుస్తున్నారని, ముఖ్యంగా మన పాటలు వారు స్పష్టంగా పడుతుండటం చూసి ఎంతో ఆనందం కలిగిందని ఫిలిం అండ్ టెలివిజన్ ప్రొమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్ష, కార్యదర్శులు జంగా చైతన్య, విజయ్ వర్మ పాకలపాటి హర్షం వ్యక్తం చేశారు. సినీ సాంకేతికత, నైపుణ్యం మరియు టూరిజం వంటివి ఇరు దేశాల మధ్య సంబంధాలు పెంపొందించుటయే లక్యంగా ఇప్పటికే నేపాల్, శ్రీలంక దేశాలలో కార్యక్రమాలు నిర్వహించిన ఎఫ్ టి పి సి ఈ వారంలో మలేషియా లోని కౌలాలంపూర్ లో ఇండో - మలేషియా  ఫిలిం అండ్ టూరిజం ఎక్స్చేంజి పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించి ఇండియా లో వున్న సినీ సాంకేతిక నిపుణత మరియు లొకేషన్స్ పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ నిర్వహించింద...

ఘనంగా జరిగిన తెలుగు సినిమా పుట్టిన రోజు వేడుక..

ఘనంగా జరిగిన తెలుగు సినిమా పుట్టిన రోజు వేడుక టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:  06-02-24వ తేదీ ప్రసాద్ ల్యాబ్స్ లో నేస్తం ఫౌండేషన్, తెలుగు సినిమా వేదిక అధ్వర్యంలో  తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.. కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన తెలంగాణ మాజీ కార్మిక శాఖామంత్రి, సినీ నటులు బాబు మోహన్, సీనియర్ నిర్మాత, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు ఎ.యమ్.రత్నం, తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి అధ్యక్షులు కె.యల్.దామోదర ప్రసాద్, డిజిక్వెస్ట్ అధినేత బసిరెడ్డి, తెలంగాణ ఛాంబర్  కార్యదర్శి అనుపమ్ రెడ్డి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ EC మెంబర్ నాగులపల్లి పద్మిని ఇలాంటి వేడుక జరగడం తెలుగు చిత్ర పరిశ్రమకే గర్వకారణమని, ఈ కార్యక్రమం నిర్వహించిన జె.వి.మోహన్ గౌడ్, విజయవర్మలకు అభినందనలు తెలుపతున్నామని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ హీరోయిన్ కవిత, క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివ పార్వతి, హాస్యనటుడు చిట్టిబాబు, నిర్మాత కైకాల నాగేశ్వరరావు, దర్శకులు లక్షమరేఖ గోపాలకృష్ణ, సీనియర్ పాత్రికేయులు జగన్, నటులు రవీంద్ర గోపాల, డిస్ట్రిబ్యూటర్ పేపర్ సత్యనారాయణ, 24 క్రాఫ్ట్స్ స...

యువత నాటకరంగం లో రాణించాలని

యువత నాటకరంగం లో రాణించాలని   - సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: అనేక రంగాలు అభివృద్ధి చెందుతున్నాయి కానీ నాటకరంగం అభివృద్ధి చెందడం లేదని, అందుకే నాటక కుటుంబం నుండి వచ్చిన తాను నాటక రంగంపై అభిమానంతో తనకు చేతనైనంత వరకు నాటకరంగానికి తోడ్పడుతున్నానని ప్రముఖ సినీ రచయిత  బుర్రా సాయి మాధవ్ అన్నారు. ప్రముఖ నాటక,సినీ నటి, రచయిత్రి, దర్శకురాలు డా. శ్రీజ సాదినేని రచించిన " త్రినయని " మూడు విభిన్న నాటికలు పుస్తక ఆవిష్కరణ మంగళవారం ఫిల్మ్ నగర్ లో జరిగింది.  సాయి మాధవ్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి ప్రతిని డా.శ్రీజకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత నాటక రంగం లోకి రావాలి, రాణించాలని కోరారు. ఎప్పటికప్పుడు నూతన ప్రయోగాలు చేస్తూ ఈ సంవత్సరం సాంఘిక పద్య నాటకాలను పరిచయం చేయబోతున్నామని చెప్పారు. శ్రీజ సాదినేని లాగే మరెందరో నటులు, రచయితలు తమ ప్రతిభకు సాన పెట్టుకున్నట్లు అవుతుంది, అందుకు ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం కూడా మంచి సందర్భం అని డా.శ్రీజ సాదినేనికి అభినందనలు తెలిపారు.ఎంతో ప్రతిభ కలిగిన డా.శ్రీజ కేవలం నాటక రంగంలో మాత్రమే కాకుండా సినీ ...

అంతర్జాతీయ పత్రికలో ప్రజ్ఞాచారి కవిత్వం

అంతర్జాతీయ పత్రికలో ప్రజ్ఞాచారి కవిత్వం టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ప్రపంచ దేశాలలో అగ్రరాజ్యముగా పేరు ందిన అమెరికా దేశం న్యూజెర్సీ పట్టణమందు ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగు వారిచే నడుపబడుతున్న తెలుగు జ్యోతి పత్రిక లో సంక్రాంతి పండుగను పురస్క రించుకుని తెలుగు జ్యోతి సంస్థ యాజమాన్యం నిర్వహించిన కవితల పోటీలలో తెనాలి మం డలం కొలకలూరు గ్రామానికి చెందిన సాహితీ రత్న నూతక్కి పూర్ణ ప్రజ్ఞాచారి తెలుగు సౌరభం అను శీర్షిక పేరున రాసిన పద్యాలు న్యూజెర్సీ నందలి తెలుగు జ్యోతి పత్రికలో ప్రచురణకు ఎంపిక కాబడ్డాయి. ఈ సందర్భంగా ప్రజ్ఞాచారి మాట్లాడుతూ సాహితీ ప్రక్రియలో వస్తువు శిల్పము సమాన స్థాయిలో ఉన్నప్పుడు ఆ కవిత్వం ఒక అమెరికాకే కాదు ఖండాలు కూడా దాటిపోయే శక్తి కలిగి వుంటుందని నా పద్యాలు అమెరికా న్యూజెర్సీ వారి తెలుగు జ్యోతి పత్రికలో ప్రచురణకు ఎంపిక కావటం గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రజ్ఞాచారికి టాలెంట్ ఎక్స్ ప్రెస్ ఎడిటర్ కనపర్తి రత్నాకర్ శుభాకాంక్షలు తెలిపారు 

ఈ నెల 6 నుంచి విజ‌య‌వాడ‌లో భార‌త్ రంగస్థల మ‌హోత్స‌వ్‌

ఈ నెల 6 నుంచి విజ‌య‌వాడ‌లో భార‌త్ రంగస్థల మ‌హోత్స‌వ్‌ - 11వ తేదీ వ‌ర‌కు తుమ్మ‌ల‌ప‌ల్లి క‌ళాక్షేత్రంలో నాట‌కాల ప్ర‌ద‌ర్శ‌న‌ - నాట‌క‌రంగ ప్రేక్ష‌కులు, క‌ళాకారులు స‌ద్వినియోగం చేసుకోవాలి - ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ఈ నెల 6వ తేదీ నుంచి 11వ తేదీ వ‌ర‌కు విజ‌య‌వాడ‌లో 23వ‌ భార‌త్ రంగస్థల మ‌హోత్స‌వ్‌-ఇంటర్నేష‌న‌ల్ థియేట‌ర్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా-2024 కింద నాట‌కాల ప్ర‌ద‌ర్శ‌న జ‌ర‌గ‌నుంద‌ని.. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వ‌ర్యంలో కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్న‌ట్లు క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. శుక్ర‌వారం క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు.. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాల‌కులు రేగుళ్ల మ‌ల్లికార్జున‌రావు, జాయింట్ క‌లెక్ట‌ర్ డా. పి.సంప‌త్ కుమార్‌, విజ‌య‌వాడ మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ పుండ్క‌ర్‌, విజ‌య‌వాడ ఆర్‌డీవో బీహెచ్ భ‌వానీ శంక‌ర్‌, డీఆర్‌వో వి.శ్రీనివాస‌రావు, డిప్యూటీ క‌లెక్ట‌ర్ కిర‌ణ్మ‌యి త‌దిత‌రుల‌తో క‌లిసి భార‌త్ రంగ‌స్థ‌ల మ‌హోత్స‌వ్‌ పోస్ట‌ర్‌ను...

బతికుండగ పిడికెడు పిండంపెట్టక..

బతికుండగ పిడికెడు పిండంపెట్టక  !!!  చచ్చినంక గజదండెందుకు దండగ??  గొంతెండిన చుక్క నీళ్ళియ్యక  ఒలుకుల్లో బక్కావు దానం!!  ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టక మాతాతలు నేతులు తాగారనే కోతలు కొయ్యక!!!  పాత చిరుగు పాత దానమీయని నైజం  పట్టు వస్త్రధారణ ఇజం!  ఇళ్ల మొజాయిక్ ఫ్లోర్ పై పడ్డ దుమ్ము ధూళి దులిపే కార్మికులు  ఈ దేశంలో పేదవాడు!?  భూమి ని నమ్మేవాడూ, భూమిని అమ్ముకుని బిక్షాటనా భోగి  భరత మాత ముద్దు జీవి!  నదులెన్నో ఉన్నా  ఆవేదనలు అంతకు మిన్న!  రాయలేలిన రాజ్యం నాడు  కుఠిల రాజకీయ పూజ్యం నేడు!  అన్నార్తులు, అనాధలు లేని  కోరిక శ్రీ శ్రీ గారిది అక్షరాలు అమ్ముడు పోవడం నేటి దిక్కిది!!  ప్రతి దినం శాంతోదయ తర్పణం.  సగటు మనిషి అర్పణం.  తియ్యని, తియ్యని మాటలు.  తేనె పూసిన కత్తులు!!  సూర్య శక్తి, వాయ్వుక్తి వ్యర్ధమవుతున్న జనశక్తి!?  స్వర్గానికి నిచ్చెనలేసే యువత  అధః పాతాళ ఘనత!  బిగవని పిడికిళ్ళు, ఇంకి పోయిన కన్నీళ్లు!!!!  దేవిశెట్టి కృష్ణా రావు  తెనాలి.  చరవాణి:...

మీలో ఒకడిగా వస్తున్నా... మీరే నా భరోసా

మీలో ఒకడిగా వస్తున్నా... మీరే నా భరోసా   * సినీ యాక్టర్‌ హర్ష చెముడు ( వైవా హర్ష)   *విజ్ఞాన్‌ మహోత్సవ్‌లో ‘‘ సుందరం మాస్టర్‌’’ యూనిట్‌        సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: విజ్ఞాన్స్‌ విద్యాసంస్థలో ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన నేను... సినీ హీరోగా మీ ముందుకు మీలో ఒకడిగా వస్తున్నాని, మీరే నా భరోసానని సినీ యాక్టర్‌ హర్ష చెముడు (వైవా హర్ష) అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో జరుగుతున్న జాతీయస్థాయి విజ్ఞాన్స్‌ మహోత్సవ్‌–2కే24లో భాగంగా రెండో రోజు ‘‘ సుందరం మాస్టర్‌ ’’ సినిమా యూనిట్‌ సందడి చేసింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో హర్ష చెముడు, డైరక్టర్‌ కల్యాణ్‌ సంతోష్, మ్యూజిక్‌ డైరక్టర్‌ చరణ్‌ పాకాల, ప్రొడ్యూసర్‌ సుధీర్‌లు విజ్ఞాన్స్‌ మహోత్సవ్‌కు విచ్చేసారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినిమా హీరో హర్ష చెముడు మాట్లాడుతూ విద్యార్థులు ఏదైనా కొత్తగా ప్రయత్నించాలంటే గ్రాడ్యుయేషన్‌ సమయయే సరైనదన్నారు. తాను ఇంజినీరింగ్‌ చదివేటప్పడు ఏదో ఒకరోజు ...

సందడి సందడిగా విజ్ఞానోత్సవ్‌

సందడి సందడిగా విజ్ఞానోత్సవ్‌ - కృషి చేసిన వారికే ఉన్నత స్థానం  వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ - రెండోరోజు వైభవంగా కొనసాగిన విజ్ఞాన్‌ మహోత్సవ్‌–2కే24 విద్యార్థులతో ముచ్చటించి.. సందడి చేసిన సినీ తారలు  పోటాపోటీగా కొనసాగుతున్న పోటీలు  అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన విద్యార్థులు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: నేటి ముగింపు కార్యక్రమానికి గౌరవ అతిథులుగా ఇండియన్‌ నేషనల్‌ క్రికెట్‌ టీమ్‌ మాజీ సెలక్టర్, క్రికెటర్‌ ఎమ్మెస్కే ప్రసాద్, ఇండియన్‌ ఫిల్మ్‌ యాక్టర్‌ కిరణ్‌ అబ్బవరం, ఇండియన్‌ స్క్రీన్‌ రైటర్‌ బుర్రా సాయి మాధవ్‌ ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా 75 ఈవెంట్లు. కనుచూపు మేర ఎటువైపు చూసినా విద్యార్థులు క్రీడా సంబరాల్లో మునిగిపోయారు. బాస్కెట్‌బాల్, ఖోఖో, ఫుట్‌బాల్, టేబుల్‌ టెన్నిస్, చెస్, టెన్నికాయిట్, అథ్లెటిక్స్‌... ఇలా ఒకటేమిటి అనేక విభాగాల్లో విద్యార్థులు అద్భుత ప్రదర్శనలతో ఉర్రూతలూగించారు. ఒకరితో ఒకరు నువ్వా నేనా అన్నట్లు పోటీపడి విజయాలు సాధిస్తున్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో జర...

హాస్యబ్రహ్మ బ్రహ్మానందం..

‘‘ఖాన్‌తో గేమ్స్ ఆడకు.. శాల్తీలు లేచిపోతాయ్.. నన్ను ఇన్వాల్వ్ చెయ్యకండి రావుగారు.. నెల్లూరు పెద్దా రెడ్డి ఎవరో తెలీదా.. ఏంటి.. ఇరుకుపాలెం వాళ్లంటే ఎకసెక్కాలుగా ఉందా.. రకరకాలుగా ఉంది మాష్టారు.. అబ్బా మీరు సిగ్గుపడకండి.. చచ్చిపోవాలనిపిస్తుంది.. నా పర్ఫార్మెన్స్ నచ్చితే ఎస్ఎమ్ఎస్ చేయండి..’’ ఈ డైలాగ్స్ వింటే కింగ్ ఆఫ్ కామెడీ, హాస్యబ్రహ్మ, పద్మశ్రీ, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్.. డా. #బ్రహ్మానందం గుర్తొస్తారు.. ఆయన పేరు చెబితే చాలు.. ముఖాల్లో చిరునవ్వు వెల్లి విరుస్తుంది. గత మూడు దశాబ్దాలుగా తన మార్క్ కామెడీతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న బ్రహ్మానందం గారి పుట్టినరోజు ఫిబ్రవరి 1...ఈ ఏడాదితో 65వ వసంతంలోకి అడుగుపెడుతున్నారాయన. ఆయన గురించి ఆయన నటించిన సినిమాల గురించి పోషించిన పాత్రల గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినిమా కామెడీలో బ్రహ్మానందానిది ఓ డిఫరెంట్ స్టైల్, ఆయన మార్క్ హాస్యం, హావభావాలు, డ్యాన్స్ మరెవరికీ సాధ్యం కావు అన్నంతగా తెలుగు సినిమా హాస్యంపై చెరగని ముద్ర వేశారాయన. నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం’ అనే తన గురువు జంధ్యాల మాటలను...

కన్నుల పండువగా విజ్ఞాన్ మహోత్సవం

కన్నుల పండువగా విజ్ఞాన్ మహోత్సవం *కళతో ప్రజలను చైతన్యపరిచా : చిందు యక్షగానం ఆర్టిస్ట్‌ *గడ్డం సమ్మయ్య (పద్మశ్రీ అవార్డు గ్రహీత–2024) *సహజ శక్తులను ఉపయోగించాలి : ఇండియన్‌ మ్యూజిక్‌ కంపోజర్‌ రఘు కుంచె *వారే త్వరగా స్థిరపడుతారు : విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య ఘనంగా ప్రారంభమైన విజ్ఞాన్స్‌ మహోత్సవ్‌ అద్భుత ప్రదర్శనలతో అలరించిన విద్యార్థులు వివిధ రాష్ట్రాల నుంచి 50 వేల మందికి పైగా హాజరైన విద్యార్థులు *చూసేందుకు రెండు కళ్లు చాలనంత... రికార్డులు హోరెత్తంత.. గుండెల్లో స్ఫూర్తి నింపేంత.. మది పులకించేంత.. ఆటల మందారాలను చూసి మురిసిపోయేంత.. తుళ్లింతలు.. కేరింతలతో మూడురోజుల పాటు విద్యార్థుల సందడితో కళకళలాడే   జాతీయ స్థాయి విజ్ఞాన్స్‌ మహోత్సవ్‌–2కే24 పండుగను చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభించారు. విజ్ఞాన్స్‌ మహోత్సవాన్ని ఈ ఏడాది వినూత్నంగా నిర్వహించడంతో జాతీయస్థాయిలో క్రికెట్‌ చాంపియన్‌షిప్‌ పోటీలను ప్రారంభించారు. టాలెం...