సందడిగా ఆత్మీయ వీడ్కోలు వేడుకలు

సందడిగా ఆత్మీయ వీడ్కోలు వేడుకలు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెనాలి: 25-02-2024: స్థానిక బోస్ రోడ్ లోని
 నెహ్రూనికేతన్ జూనియర్ కళాశాలలో ఆదివారం రాత్రి నెహ్రూనికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి పర్యవేక్షణలో ద్వితీయ ఇంటర్ ఆత్మీయ వీడ్కోలు వేడుకలు సందడిగా జరిగాయి. ద్వితీయ ఇంటర్ వీడ్కోలును పురస్కరించుకుని విద్యార్థినీ విద్యార్థులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆడారు, పాడారు, అదరహో అనిపించారు. పలు పాత పాటలను ఆధునిక సంగీతాన్ని జోడించి విద్యార్థినులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ విద్యాసంవత్సరం ఇంటర్ విద్యార్థులకు నిర్వహించిన క్రీడలు, నృత్యాలు, పాటల పోటీలలో విజేతలకు జ్ఞాపికలు, బహుమతులు అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో నెహ్రూనికేతన్ వ్యవస్థాపకులు దాసరి ప్రకాశరావు, కళాశాల ప్రిన్సిపల్ వీరంకి శేషగిరిరావు, వైస్ ప్రిన్సిపల్ పి. నాగశంకర్, అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.