నెహ్రూనికేతన్లో జాతీయ సైన్స్ దినోత్సవం


నెహ్రూనికేతన్లో జాతీయ సైన్స్ దినోత్సవం
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెనాలి: 28-02-2024: స్థానిక బోస్ రోడ్డులోని నెహ్రూనికేతన్ ఇంగ్లీషు మీడియం స్కూల్లో పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి పర్యవేక్షణలో బుధవారం ఉదయం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా చిన్నారులు సైన్స్ పట్ల అందరికీ ఆసక్తి పెరిగేలా పలు నమూనాలు తయారుచేసి ప్రదర్శించారు. కొందరు బాలబాలికలు సర్ సి.వి. రామన్ తో పాటు అనేకమంది శాస్త్రవేత్తల చిత్రపటాలను ప్రదర్శించి, వారు కనుగొన్న వస్తువుల వివరాలు, అవి నేడు మనకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయనే విషయాలను సవివరంగా తెలియజేశారు. కొందరు విద్యార్థులు సి.వి. రామన్ వేషధారణలో ఆయన జీవిత విశేషాలను తెలియజేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ తరువాత చిన్నారులు పాఠశాల నుండి ర్యాలీగా బయలుదేరి సైన్స్కు సంబంధించిన నినాదాల చార్టులను ప్రదర్శిస్తూ, వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాలి, ధరిత్రిని కాపాడాలి, నీటిని పరిరక్షించాలి, సైన్స్పట్ల అవగాహన పెంచుకోవాలి అంటూ నినాదాలు చేస్తూ చినరావూరు పార్కు వరకు వెళ్ళి తిరిగి పాఠశాలకు చేరారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.