సినీ సామాజిక వేత్త విజయ్ వర్మ కు అమెరికా తెలుగు అసోసియేషన్ ఆటా ఆహ్వానం

సినీ సామాజిక వేత్త విజయ్ వర్మ కు అమెరికా తెలుగు అసోసియేషన్  ఆటా ఆహ్వానం 
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
సినిమా రంగంలో నటునిగా , దర్శక నిర్మాతగా వుంటూ పలు గ్రామీణ ప్రాంతాలలో గ్రామ స్వరాజ్య ఫౌండేషన్ వ్యవస్థాపిక అధ్యక్షునిగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతున్న వీస్ విజయ్ వర్మ పాకలపాటి ని ప్రతిష్టాత్మిక అమెరికా తెలుగు అసోసియేషన్ ఆటా అమెరికా లో నిర్వహిస్తున్న ఆటా సభలకి విచ్చేయాలని ఆహ్వానించింది.
భారత తెలుగు ఔనత్యాన్ని వ్యక్తీకరించపరిచే ఈ అవకాశం రావడం పట్ల వీస్ విజయ్ వర్మ పాకలపాటి ఆనందం వ్యక్తం చేస్తూ ప్రపంచ దేశాలను పర్యటించడం ద్వారా ఆయా దేశాలలో నెలకొన్న అవకాశాలను నేటి యువతకు మార్గదర్శకం చేయగలుగుతున్నాని వీస్ విజయ్ వర్మ  పేర్కొన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన ఆటా అనిల్ రెడ్డి గారికి , తన పేరుని సిఫార్స్ చేసిన ప్రముఖ మిమిక్రి కళాకారులు మిమిక్రి రమేష్ మరియు నటులు సాల్మోన్ షానీ కి విజయ వర్మ కృతఙ్ఞతలు తెలిపారు.