తెనాలి టాంక్ బండ్ పై తొలి విగ్రహావిష్కరణ

విగ్రహావిష్కరణలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, ఎమ్మెల్యే
తెనాలి బండపై తొలి విగ్రహావిష్కరణ
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
పట్టణ సుందరీకరణలో భాగంగా తెనాలి టాంక్ బండ్ ముస్తాబ వుతోంది. తెనాలి-విజయవాడ రోడ్డులో ఏర్పాటు అవుతున్న బండ్ పై తెనాలి ప్రాంతానికి పేరు గాంచిన
 కవులు, కళాకారులు, రాజకీయ, శాస్త్ర, సాంకేతిక రంగ ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. దానిలో భాగంగా తొలిగా ఏర్పాటు చేసిన జాతీయ  వాది, అర్చకోద్యమ పితామహులు తమిరిశ రామా చార్యులు కాంస్య విగ్రహాన్ని త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డి, శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ తెనాలి బండ్ పట్టణ ప్రాంతా నికి వన్నె తేవడమే కాకుండా, భావితరాలకు ఈ ప్రాంత ప్రముఖుల విశేషాలను తెలియజేసేందుకు దోహద పడుతుందన్నారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి, డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి, ఎడ్లపాటి రఘునాధ బాబు, పి రామకృష్ణ, శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు, కౌన్సిలర్ పేరం సంజీవరెడ్డి, అనంతాచార్యులు తదితరులు పాల్గొన్నారు.