బతికుండగ పిడికెడు పిండంపెట్టక..

బతికుండగ పిడికెడు పిండంపెట్టక !!! 
చచ్చినంక గజదండెందుకు దండగ?? 
గొంతెండిన చుక్క నీళ్ళియ్యక  ఒలుకుల్లో బక్కావు దానం!! 
ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టక
మాతాతలు నేతులు తాగారనే కోతలు కొయ్యక!!! 
పాత చిరుగు పాత దానమీయని నైజం 
పట్టు వస్త్రధారణ ఇజం! 
ఇళ్ల మొజాయిక్ ఫ్లోర్ పై పడ్డ దుమ్ము ధూళి దులిపే
కార్మికులు  ఈ దేశంలో పేదవాడు!? 
భూమి ని నమ్మేవాడూ, భూమిని అమ్ముకుని బిక్షాటనా భోగి 
భరత మాత ముద్దు జీవి! 
నదులెన్నో ఉన్నా 
ఆవేదనలు అంతకు మిన్న! 
రాయలేలిన రాజ్యం నాడు 
కుఠిల రాజకీయ పూజ్యం నేడు! 
అన్నార్తులు, అనాధలు లేని  కోరిక శ్రీ శ్రీ గారిది
అక్షరాలు అమ్ముడు పోవడం నేటి దిక్కిది!! 
ప్రతి దినం శాంతోదయ తర్పణం. 
సగటు మనిషి అర్పణం. 
తియ్యని, తియ్యని మాటలు. 
తేనె పూసిన కత్తులు!! 
సూర్య శక్తి, వాయ్వుక్తి
వ్యర్ధమవుతున్న జనశక్తి!? 
స్వర్గానికి నిచ్చెనలేసే యువత 
అధః పాతాళ ఘనత! 
బిగవని పిడికిళ్ళు, ఇంకి పోయిన కన్నీళ్లు!!!! 


దేవిశెట్టి కృష్ణా రావు 
తెనాలి. 
చరవాణి:6303347479.