అంతర్జాతీయ పత్రికలో ప్రజ్ఞాచారి కవిత్వం


అంతర్జాతీయ పత్రికలో ప్రజ్ఞాచారి కవిత్వం
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
ప్రపంచ దేశాలలో అగ్రరాజ్యముగా పేరు ందిన అమెరికా దేశం న్యూజెర్సీ పట్టణమందు ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగు వారిచే నడుపబడుతున్న తెలుగు జ్యోతి పత్రిక లో సంక్రాంతి పండుగను పురస్క రించుకుని తెలుగు జ్యోతి సంస్థ యాజమాన్యం నిర్వహించిన కవితల పోటీలలో తెనాలి మం డలం కొలకలూరు గ్రామానికి
చెందిన సాహితీ రత్న నూతక్కి పూర్ణ ప్రజ్ఞాచారి తెలుగు సౌరభం అను శీర్షిక పేరున రాసిన పద్యాలు న్యూజెర్సీ నందలి తెలుగు జ్యోతి పత్రికలో ప్రచురణకు ఎంపిక కాబడ్డాయి. ఈ సందర్భంగా ప్రజ్ఞాచారి మాట్లాడుతూ సాహితీ ప్రక్రియలో వస్తువు శిల్పము సమాన స్థాయిలో ఉన్నప్పుడు ఆ కవిత్వం ఒక అమెరికాకే కాదు ఖండాలు కూడా దాటిపోయే శక్తి కలిగి వుంటుందని నా పద్యాలు అమెరికా న్యూజెర్సీ వారి తెలుగు జ్యోతి పత్రికలో ప్రచురణకు ఎంపిక కావటం గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రజ్ఞాచారికి టాలెంట్ ఎక్స్ ప్రెస్ ఎడిటర్ కనపర్తి రత్నాకర్ శుభాకాంక్షలు తెలిపారు