యువత నాటకరంగం లో రాణించాలని

యువత నాటకరంగం లో రాణించాలని 
 - సినీ రచయిత బుర్రా సాయి మాధవ్
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
అనేక రంగాలు అభివృద్ధి చెందుతున్నాయి కానీ నాటకరంగం అభివృద్ధి చెందడం లేదని, అందుకే నాటక కుటుంబం నుండి వచ్చిన తాను నాటక రంగంపై అభిమానంతో తనకు చేతనైనంత వరకు నాటకరంగానికి తోడ్పడుతున్నానని ప్రముఖ సినీ రచయిత  బుర్రా సాయి మాధవ్ అన్నారు. ప్రముఖ నాటక,సినీ నటి, రచయిత్రి, దర్శకురాలు డా. శ్రీజ సాదినేని రచించిన " త్రినయని " మూడు విభిన్న నాటికలు పుస్తక ఆవిష్కరణ మంగళవారం ఫిల్మ్ నగర్ లో జరిగింది.  సాయి మాధవ్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి ప్రతిని డా.శ్రీజకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత నాటక రంగం లోకి రావాలి, రాణించాలని కోరారు. ఎప్పటికప్పుడు నూతన ప్రయోగాలు చేస్తూ ఈ సంవత్సరం సాంఘిక పద్య నాటకాలను పరిచయం చేయబోతున్నామని చెప్పారు. శ్రీజ సాదినేని లాగే మరెందరో నటులు, రచయితలు తమ ప్రతిభకు సాన పెట్టుకున్నట్లు అవుతుంది, అందుకు ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం కూడా మంచి సందర్భం అని డా.శ్రీజ సాదినేనికి అభినందనలు తెలిపారు.ఎంతో ప్రతిభ కలిగిన డా.శ్రీజ కేవలం నాటక రంగంలో మాత్రమే కాకుండా సినీ పరిశ్రమలో కూడా చక్కని నటిగా, మంచి రచయిత్రిగా పేరు ప్రఖ్యాతులు గడించాలని ఆయన ఆశీస్సులు అందించారు. డా.శ్రీజ సాదినేని మాట్లాడుతూ ప్రముఖ నాటక సినీ రచయిత  సాయి మాధవ్ గారు నాటక రంగ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారని, వారి చేతుల మీదుగా తన త్రినయని పుస్తక ఆవిష్కరణ జరగడం శుభ దాయకం అని సంతోషాన్ని వ్యక్తం చేశారు. సాయి మాధవ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు డా.శ్రీజ సాదినేనికి అభినందనలు తెలిపారు.