ఆంధ్రలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి నావంతు కృషి చేస్తా _ఎ. యమ్.రత్నం

ఆంధ్రలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి నావంతు కృషి చేస్తా
-ఎ. యమ్.రత్నం
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్, డూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన ఎ.యమ్.రత్నం ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా.. ఆయన నెల్లూరు జిల్లా వాసి కావడంతో ఆ జిల్లాకు చెందిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, కళాకారులు నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ లో ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ కమిటీ సభ్యులకు, ఆయనకు ఘన సన్మానం చేసి చిత్ర పరిశ్రమలో ఆయన గొప్పతనాన్ని కొనియాడారు.
ఎ. యమ్.రత్నం మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో నేను జన్మించినందుకు అదృష్టంగా భావిస్తున్నానని , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా చిత్ర పరిశ్రమను బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు.. 
ఛాంబర్ కార్యదర్శి జె.వి.మోహన్ గౌడ్ మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమలో నెల్లూరు జిల్లాకు ఎంతో ప్రాముఖ్యత ఉందని , నెల్లూరు జిల్లా నుంచి పేరు మోసిన కళాకారులు, నిర్మాతలు, దర్శకులు ఎందరో ఉన్నారని , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అందరం కలిసి కట్టుగా పని చేయాలని పిలుపు నిచ్చారు.. ఛాంబర్ తరుపున వర్క్ షాప్ లు నిర్వహించి నిర్మాతలలో ప్రొడక్షన్ పట్ల అవగాహన, టెక్నీషియన్స్ లో స్కిల్ డెవలప్మెంట్ కు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ఆంధ్రలో విజయవాడ, తిరుపతి లో కూడా పూర్తి స్థాయి ఔట్ డోర్ యూనిట్స్ ఏర్పాటుకు ఛాంబర్ తరుపున ప్లాన్ చేస్తున్నామని తెలిపారు.. ప్రభుత్వ రాయితీలను నిర్మాతల దృష్టికి తీసికెళ్ళి రాష్ట్రం లోనే షూటింగ్ లు జరిగేలా కృషి చేస్తామని తెలిపారు.. ఇంకా కార్యక్రమంలో ఛాంబర్ ట్రెజరర్ యం.శ్రీనాధ రావు, వైస్ ప్రెసిడెంట్ మంతా శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ పి. రమణా రెడ్డి, ఇ సి 
 మెంబర్లు పి డి ఆర్ప్రసాద్ రెడ్డి, మిత్తాన ఈశ్వర్ రావు, ఛాంబర్ మాజీ ఇ సి మెంబర్ డిస్ట్రిబ్యూటర్ డి.ప్రభాకర్ రావు పాల్గొన్నారు..