ఘనంగా జరిగిన తెలుగు సినిమా పుట్టిన రోజు వేడుక..

ఘనంగా జరిగిన తెలుగు సినిమా పుట్టిన రోజు వేడుక

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
 06-02-24వ తేదీ ప్రసాద్ ల్యాబ్స్ లో నేస్తం ఫౌండేషన్, తెలుగు సినిమా వేదిక అధ్వర్యంలో  తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.. కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన తెలంగాణ మాజీ కార్మిక శాఖామంత్రి, సినీ నటులు బాబు మోహన్, సీనియర్ నిర్మాత, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు ఎ.యమ్.రత్నం, తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి అధ్యక్షులు కె.యల్.దామోదర ప్రసాద్, డిజిక్వెస్ట్ అధినేత బసిరెడ్డి, తెలంగాణ ఛాంబర్  కార్యదర్శి అనుపమ్ రెడ్డి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ EC మెంబర్ నాగులపల్లి పద్మిని ఇలాంటి వేడుక జరగడం తెలుగు చిత్ర పరిశ్రమకే గర్వకారణమని, ఈ కార్యక్రమం నిర్వహించిన జె.వి.మోహన్ గౌడ్, విజయవర్మలకు అభినందనలు తెలుపతున్నామని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ హీరోయిన్ కవిత, క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివ పార్వతి, హాస్యనటుడు చిట్టిబాబు, నిర్మాత కైకాల నాగేశ్వరరావు, దర్శకులు లక్షమరేఖ గోపాలకృష్ణ, సీనియర్ పాత్రికేయులు జగన్, నటులు రవీంద్ర గోపాల, డిస్ట్రిబ్యూటర్ పేపర్ సత్యనారాయణ, 24 క్రాఫ్ట్స్ సీనియర్ టెక్నిషియన్స్ కు అతిథులు సత్కరించి వారి సేవలను కొనియాడారు..