Skip to main content
నాటకరంగంలో మహానటి సావిత్రి అవార్డు ప్రకటిస్తే తొలిగా శ్రీజ కి ఇవ్వమని చెప్తాను -
 సినీ దర్శకులు వి.యన్. ఆదిత్య
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
ఈరోజుల్లో నిజాలు మాట్లాడడం చాలా డేంజర్, అలాంటిది సమాజంలో చూసిన వ్యక్తులు, ఎదుర్కొన్న పరిస్థితుల ఆధారంగా కవితల బాణాలు సంధించడానికి
చాలా ధైర్యం కావాలి, 
డా. శ్రీజ సాదినేని చేసిన అలాంటి సాహసం విజయం సాధించాలని ప్రముఖ సినీ దర్శకులు వి.యన్.ఆదిత్య అన్నారు. సినీ నటి, రచయిత్రి డా.శ్రీజ సాదినేని రచించిన "శ్రీజ కోట్స్" నిప్పు లాంటి నిజాలు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్ చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభ, గుండవరపు హనుమంతరావు కళా వేదికలో ఘనంగా జరిగింది. 
ఈ కార్యక్రమానికి సినీ దర్శకులు వి. యన్. ఆదిత్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పుస్తకాన్ని ఆవిష్కరించి మొదటి కాపీని వర్ధమాన సినీ దర్శకులు గౌరీ నాయుడుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆదిత్య మాట్లాడుతూ ... 
డా.శ్రీజ నటించిన నేషనల్ హైవే అనే నాటికలో స్వతంత్ర అనే పాత్రను పోషించారు. ఆమె నటనకు థియేటర్ మొత్తం స్టాండింగ్ ఓవేషన్ చేశారు. క్లైమాక్స్ లో అందరినీ ఏడిపించేసింది.నాటిక మర్చిపోవచ్చు కానీ ఆక్షణం ప్రేక్షకుడుగా పొందిన అనుభూతి ఎప్పటికీ మర్చిపోలేము.తెలుగు రాష్ట్రాలలో ఏ ప్రభుత్వం అయినా మహానటి సావిత్రి అవార్డు ప్రకటిస్తే ఫస్ట్ ఆ అవార్డు ఆవిడకే ఇవ్వాలి అని నేను చెప్తాను.
గొప్ప నటిగా తనకు తెలిసిన శ్రీజ కవయిత్రిగా, రచయిత్రిగా కూడా ప్రతిభను కనపర్చడం చూసి ఆశ్చర్యపోయానన్నారు. అభిసారిక అనే ప్రేమ కవితా సంపుటి, 
త్రినయని  పేరుతో మూడు విభిన్న నాటికలు, 
నిప్పు లాంటి నిజాలు అంటూ నిత్య జీవిత సత్యాలు ఇన్ని రచనలు చేసిన తను ఎంతో అభినందనీయురాలు.
ఇలా జీవితంలో తను అనుభవించిన కష్టాలు, ఎదుర్కొన్న పరిస్థితులు, రచయిత్రిగా తన ప్రయాణం అన్నీ కలగలిపి వయసుకు మించిన అనుభవం సంపాదించింది కాబట్టి తను రాస్తే అవి కచ్చితంగా నిప్పు లాంటి నిజాలే అవుతాయని ఆదిత్య అన్నారు.
దైనందిన జీవితంలో అడుగడుగునా ఎదురయ్యే సమస్యల నుంచి ఉపశమనం కోసం ఈ పుస్తకం చదివితే అది వారికి మంచి మెడిసిన్ లా పనిచేస్తుందని, నిరాశా నిస్పృహలకు లోనై మానసికంగా బాధ పడి వారికి ఈ పుస్తకం చక్కని ప్రోత్సాహాన్ని అందించి ముందుకు నడిపిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదని, ఇలాంటి ఇంకా ఎన్నో గొప్ప రచనలు చేసి మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని డా. శ్రీజ సాదినేనిని ఆయన అభినందించారు. 
మనిషి మనసు లోతుల్లోని భావాలు, జీవిత సత్యాల గురించి చాలా బాగా ఈ పుస్తకంలో డా. శ్రీజ రాశారని దర్శకులు గౌరీ నాయుడు అన్నారు.
ఈ కార్యక్రమంలో సినీ దర్శకులు గౌరీ నాయుడు, శ్రీ జయా ఆర్ట్స్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ కే. రత్నయ్య, జనరల్ సెక్రటరీ శశిధర్ ఘణపురం, అవినాష్ యాదవ్, వేదాంతం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆవిష్కరణకు విచ్చేసి ఆశీస్సులు అందించిన అందరికీ డా.శ్రీజ సాదినేని కృతజ్ఞతలు తెలిపారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...