Skip to main content

Posts

Showing posts from March, 2024

తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంటపురం ఆధ్వర్యంలో విద్యార్థులకు సాయం

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంటపురం ఆధ్వర్యంలో   బాపట్ల జిల్లా చుండూరు మండలం ఎడ్లపల్లి గ్రామంలోని ఆలపాటి వెంకట్రామయ్య జిల్లా పరిషత్ హై స్కూల్ నందు పదవ తరగతి పరీక్షలకు వెళుతున్న 102 మంది విద్యార్థినీ విద్యార్థులకు అవసరమైన ప్యాడ్స్, పెన్నులు, పెన్సిళ్లు, స్కేల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు పావులూరు రాంబాబు అసిస్టెంట్ గవర్నర్ కన్నెగంటి మురళీకృష్ణ ఫాస్ట్ ప్రెసిడెంట్ ఈదర వెంకట పూర్ణ చంద్, ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఈదర శ్రీనివాసరావు , డి .మురళీకృష్ణ, గుమ్మడి వెంకటనారాయణ, కాకుమాను ఉపేంద్ర ,జాన్ కిడ్స్ సుబ్రహ్మణ్యం, స్కూలు ప్రధాన ఉపాధ్యాయుడు రొటీరియన్ కుర్రా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్ శారదకు షారోన్ అంతర్జాతీయ సేవా అవార్డు

  డాక్టర్ శారదకు షారోన్ అంతర్జాతీయ సేవా అవార్డు - రేపు తెనాలిలో ప్రదానం టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్,తెనాలి: కరోనా రోజుల్లో బాధితులను వైద్యసేవలను అందించటం తో సహా మహిళల్లో క్యాన్సర్ రహిత తెనాలి కోసం కృషి చేస్తూ, ప్రస్తుతం ధర్మ ప్రాజెక్టుతో గోల్డెన్ అవర్ వైద్యాన్ని ఉచితంగా అంది స్తున్న శారద సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకురాలు డాక్టర్ డి.శారదకు మరో ప్రతిష్టాత్మక గౌరవం దక్కనుంది. కెనాడకు చెందిన ప్రముఖ స్వచ్ఛంద సేవకురాలు షారోన్ పేరుతో అవార్డును ఇవ్వనున్నారు. షారోన్ అంతర్జా తీయ సేవా అవార్డు-2024కు ఎంపికయ్యారు. స్థానిక పెన్నీ మినిస్ట్రీస్ స్వచ్చంద సేవాసంస్థ అధ్యక్షుడు ప్రదీప్ దోనేపూడి ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10 గంటలకు స్థానిక రత్న ఫార్చ్యూన్ కల్యాణ మండపంలో ఏర్పాటయ్యే ప్రత్యేక సభలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఇటీవల మృతిచెందిన షారోన్ తన జీవితకాలం వైద్య సేవలు అందిందించారాన్నారు. ఆమె గౌరవార్ధం ఏటా షారోన్ అం తర్జాతీయ సేవా అవార్డును బహూకరిం చాలని నిర్ణయించినట్టు తెలిపారు. తొలిగా డాక్టర్ శారదకు, వచ్చే ఏడాది అవార్డును జమైకాలో ఉంటున్న భారతీయ వైద్యుడు డాక్టర్ నాగ మల్లేశ్వరర...

ప్రపంచమంతా ఏఐ మయం

ప్రపంచమంతా ఏఐ మయం - యూఎస్‌ఏలోని అరిజోనా స్టేట్‌ యూనివర్సిటీ మెకానికల్‌ అండ్‌ ఏరో స్పేస్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ డీన్‌ ప్రొఫెసర్‌ పాట్రిక్‌ ఫెలాన్‌ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: భవిష్యత్‌లో ప్రపంచమంతా ఏఐ ( ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్‌) మయం కానుందని యూఎస్‌ఏలోని అరిజోనా స్టేట్‌ యూనివర్సిటీ మెకానికల్‌ అండ్‌ ఏరో స్పేస్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ డీన్‌ ప్రొఫెసర్‌ పాట్రిక్‌ ఫెలాన్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ అడ్వాన్డ్స్‌ కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీల సంయుక్త ఆధ్వర్యంలో ‘‘ద ఫ్యూచర్‌ ఆఫ్‌ ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ ఎట్‌ అరిజోనా స్టేట్‌ యూనివర్సిటీ’’ అనే అంశంపై ప్రత్యేక అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యూఎస్‌ఏలోని అరిజోనా స్టేట్‌ యూనివర్సిటీ మెకానికల్‌ అండ్‌ ఏరో స్పేస్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ డీన్‌ ప్రొఫెసర్‌ పాట్రిక్‌ ఫెలాన్‌ మాట్లాడుతూ ప్రస్తుతం ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌ స్కిల్స్‌ ఉంటేనే సంస్థలు అభ్యర్థుల వైపు చూసే పరిస్థి...

అమెరికాలో ఇంటర్న్‌షిప్‌కు విజ్ఞాన్‌ ఫార్మసీ విద్యార్థులు

అమెరికాలో ఇంటర్న్‌షిప్‌కు విజ్ఞాన్‌ ఫార్మసీ విద్యార్థులు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు అమెరికాలోని ప్రముఖ అడ్వాన్డ్స్‌ ఫార్మసీ హాస్పిటల్స్‌లలో ఇంటర్న్‌షిప్‌కు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీ.శ్రీనివాసబాబు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలలో ఫార్మా–డీకు చెందిన 6వ సంవత్సరం విద్యార్థులు వీ.నిస్సీ జోసెఫ్, బీ.శ్రీలేఖ, ఎస్‌కే. దెహనాజ్, ఏ.వెన్నెల అనే 4 విద్యార్థులు అమెరికాలోని ప్రముఖ హాస్పిటల్స్‌లలో 4 వారాల అడ్వాన్డ్స్‌ ఫార్మసీ ప్రాక్టీస్‌ ఎక్సిపెరిమెంటల్‌ ట్రైనింగ్‌ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికయ్యారని తెలియజేసారు. అంతేకాకుండా ఈ నలుగురు విద్యార్థులు వచ్చే ఏప్రిల్‌ 11, 12 తేదీలలో ఓహియోలోని యూనివర్సిటీ ఆఫ్‌ ఫిండ్లేలో జరగనున్న ఫార్మా–డీ సింపోసిజమ్‌ ఫర్‌ స్కాలర్‌షిప్‌ అండ్‌ క్రియేటివీటీ కాన్ఫరెన్స్‌లో మూడు రీసెర్చ్‌ పేపర్లు ప్రచురించడానికి అనుమతి లభించిందని తెలియజేసారు. అమెరికాలో ఇంటర్న్‌షిప్‌తో పాటు రీసెర్చ్‌ పేపర్లు ప్రజెంట్‌ చేయడానికి ...

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:జాతీయ ఒలంపియాడ్లో నెహ్రూనికేతను రాష్ట్ర ర్యాంక్

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: జాతీయ ఒలంపియాడ్లో నెహ్రూనికేతన్   రాష్ట్ర ర్యాంక్ తెనాలి: 12-03-2024: న్యూఢిల్లీకి చెందిన సిల్వరోన్ ఫౌండేషన్వారు గతేడాది డిసెంబర్లో నిర్వహించిన జాతీయ గణిత ఒలంపియాడ్లో స్థానిక బోస్ రోడ్ లోని  నెహ్రూ నికేతన్ చెందిన బాలబాలికలు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. దాసరి శెర్మిష్ట్రా (179వ ర్యాంక్), ఎన్. కరుణశ్రీ (305వ ర్యాంక్), సి.హెచ్. ఈశ్వర్ బాబు (321), కె. సహస్రద్యుతి (340వ ర్యాంక్), సి.హెచ్. జయశ్రీనివాస్ (403వ ర్యాంక్), కాజా తరుణి (467వ ర్యాంక్) సాధించారు. సిల్వరోన్ ఫౌండేషన్వారు న్యూఢిల్లీ నుండి పంపిన ధ్రువపత్రాలతో పాటు బంగారు, రజత, కాంస్య పతకాలను నెహ్రూనికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి మంగళవారం పాఠశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో విజేతలకు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, ఉపాధ్యాయలు పాల్గొన్నారు.

భగవద్గీత విశ్వరూపం ఆల్బమ్ ను ఆవిష్కరించిన హీరో విశ్వక్సేన్

భగవద్గీత విశ్వరూపం ఆవిష్కరించిన  హీరో విశ్వక్సేన్ _ వేడుకగా ఆవిష్కరణ నిర్వహించిన  సినెటేరియా ఫిలిం బ్రాండింగ్ హౌజ్ _ప్రముఖ సంగీత దర్శకులు ఆర్.పి. పట్నాయక్ స్వీయ సంగీతం,స్వీయ వ్యాఖ్యానంతో విడుదల టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ప్రముఖ సంగీత దర్శకుడు అర్.పి. పట్నాయక్ రూపొందించిన సంపూర్ణ భగవద్గీత తాత్పర్యం ఆధ్యాత్మిక ఆల్బంను యువ హీరో విశ్వక్ సేన్ ఆవిష్కరించారు. హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో ఆదివారం సాయంత్రం కార్యక్రమం ఘనం గా జరిగింది. సినెటేరియా మీడియా వర్క్స్ ఆవిష్కరణను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. కార్యక్రమానికి హీరో విశ్వక్ సేన్ ముఖ్య అథిది గా విచ్చేశారు. రఘు కుంచె, గాయని కౌసల్య, దర్శకులు దశరథ్, రచయిత జె.కె. భారవి, చిత్రకారుడు జానకిరాం, నటుడు జెమిని సురేష్, రాధే గ్రూప్ సీఈవో శ్రీవికాస్, మార్కెటింగ్ హెడ్ రాం లు పాల్గొని సంగీత దర్శకులు ఆర్.పి. పట్నాయక్ ను కొనియాడారు. 

ఎ.పి. వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ బాపట్ల నియోజకవర్గ నూతన కార్యవర్గం ఎన్నిక

ఎ.పి. వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ బాపట్ల నియోజకవర్గ నూతన కార్యవర్గం ఎన్నిక టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: తెనాలి: అంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ బాపట్ల నియోజక వర్గ నూతన కార్యవర్గ ఎన్నిక సోమవారం ఉదయం స్థానిక ఎన్. జీ. ఓ ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కనపర్తి రత్నాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల్లో  బాపట్ల నియోజకర్గ అధ్యక్షునిగా గుమ్మడి ప్రకాశరావు, ప్రధాన కార్యదర్శి గా దేవరపల్లి నాగరాజు లను ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గం రెండు సంవత్సరాలు కొనసాగుతుందని రత్నాకర్ చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామని, ఫెడరేషన్ అభివృద్ధి కోసం పాటుపడతామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు. ఎన్నికను ఫెడరేషన్ నాయకులు యూ. షణ్ముఖేశ్వర రావు పర్యవేక్షించారు. కార్యక్రమం లో ఫెడరేషన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

ఎ.పి. వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ తెనాలి నియోజకవర్గ నూతన కార్యవర్గం ఎన్నిక

ఎ.పి. వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ తెనాలి నియోజకవర్గ నూతన కార్యవర్గం ఎన్నిక టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: తెనాలి: అంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ తెనాలి నియోజక వర్గ నూతన కార్యవర్గ ఎన్నిక సోమవారం ఉదయం స్థానిక ఎన్. జీ. ఓ ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కనపర్తి రత్నాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల్లో  తెనాలి నియోజకర్గ అధ్యక్షునిగా పుట్ట పున్నయ్య, ఉపాధ్యక్ష్యునిగా ఎ. సాంబ శివరావు, ప్రధాన కార్యదర్శి గా ఎస్.ఎస్. జహీర్, కోశాధికారిగా సి . హెచ్ చంద్ర శేఖర్, సహాయ కార్యదర్శి గా బి. చంద్రమోహన్ లను ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గం రెండు సంవత్సరాలు కొనసాగుతుందని రత్నాకర్ చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామని, ఫెడరేషన్ అభివృద్ధి కోసం పాటుపడతామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు. ఎన్నికను ఫెడరేషన్ నాయకులు యూ. షణ్ముఖేశ్వర రావు పర్యవేక్షించారు. కార్యక్రమం లో ఫెడరేషన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

జర్నలిస్టుల ఇళ్లస్థలాల జి.ఓ ను అమలు చేయాలి

జర్నలిస్టుల ఇళ్లస్థలాల జి.ఓ ను అమలు చేయాలి . _ ఇళ్ల పట్టాలు అందించేలా చర్యలు తీసుకోవాలి. ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో తెనాలి సబ్ కలెక్టర్ కు వినతి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (ఎపిడబ్ల్యుజెఎఫ్) రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపులో భాగంగా జర్నలిస్టులకు ఇళ్లస్థలాల మంజూరు అంశం పై సోమవారం తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం లో డి. టీ  సుధా కిరణ్మయికు ఏపీడబ్ల్యూజేఎఫ్  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కనపర్తి రత్నాకర్ నాయకత్వంలో ఫెడరేషన్ సభ్యులు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో  జర్నలిస్టులకు మూడు సెంట్ల ఇంటిస్థలం కేటాయింపు వెంటనే జరిగేందుకు వీలైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.  జిల్లాలో కమిటీలు ఇప్పటికే జాబితాలను తయారు చేశారని తరువాత ఫిబ్రవరిలో మరోవారం రోజులు దరఖాస్తుకు అవకాశం కల్పించడం ద్వారా మరికొంతరు జర్నలిస్టులు కూడా దరఖాస్తు చేసే అవకాశం కల్పించారన్నారు. వీలైనంత త్వరగా తుది జాబితాను తయారు చేయాలని వెంటనే ఆ జాబితా విడుదల చేయాలని కోరారు. జాబితా...

జర్నలిస్టుల ఇళ్లస్థలాల జి.ఓ ను అమలు చేయాలి

జర్నలిస్టుల ఇళ్లస్థలాల జి.ఓ ను అమలు చేయాలి . _ ఇళ్ల పట్టాలు అందించేలా చర్యలు తీసుకోవాలి. ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో తెనాలి సబ్ కలెక్టర్ కు వినతి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: తెనాలి: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (ఎపిడబ్ల్యుజెఎఫ్) రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపులో భాగంగా జర్నలిస్టులకు ఇళ్లస్థలాల మంజూరు అంశం పై సోమవారం తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం లో డి. టీ  సుధా కిరణ్మయికు ఏపీడబ్ల్యూజేఎఫ్  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కనపర్తి రత్నాకర్ నాయకత్వంలో ఫెడరేషన్ సభ్యులు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో  జర్నలిస్టులకు మూడు సెంట్ల ఇంటిస్థలం కేటాయింపు వెంటనే జరిగేందుకు వీలైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.  జిల్లాలో కమిటీలు ఇప్పటికే జాబితాలను తయారు చేశారని తరువాత ఫిబ్రవరిలో మరోవారం రోజులు దరఖాస్తుకు అవకాశం కల్పించడం ద్వారా మరికొంతరు జర్నలిస్టులు కూడా దరఖాస్తు చేసే అవకాశం కల్పించారన్నారు. వీలైనంత త్వరగా తుది జాబితాను తయారు చేయాలని వెంటనే ఆ జాబితా విడుదల చేయాలని కోరారు. జాబితాలోని...