ప్రపంచమంతా ఏఐ మయం

ప్రపంచమంతా ఏఐ మయం
- యూఎస్‌ఏలోని అరిజోనా స్టేట్‌ యూనివర్సిటీ మెకానికల్‌ అండ్‌ ఏరో స్పేస్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ డీన్‌ ప్రొఫెసర్‌ పాట్రిక్‌ ఫెలాన్‌
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
భవిష్యత్‌లో ప్రపంచమంతా ఏఐ ( ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్‌) మయం కానుందని యూఎస్‌ఏలోని అరిజోనా స్టేట్‌ యూనివర్సిటీ మెకానికల్‌ అండ్‌ ఏరో స్పేస్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ డీన్‌ ప్రొఫెసర్‌ పాట్రిక్‌ ఫెలాన్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ అడ్వాన్డ్స్‌ కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీల సంయుక్త ఆధ్వర్యంలో ‘‘ద ఫ్యూచర్‌ ఆఫ్‌ ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ ఎట్‌ అరిజోనా స్టేట్‌ యూనివర్సిటీ’’ అనే అంశంపై ప్రత్యేక అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యూఎస్‌ఏలోని అరిజోనా స్టేట్‌ యూనివర్సిటీ మెకానికల్‌ అండ్‌ ఏరో స్పేస్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ డీన్‌ ప్రొఫెసర్‌ పాట్రిక్‌ ఫెలాన్‌ మాట్లాడుతూ ప్రస్తుతం ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌ స్కిల్స్‌ ఉంటేనే సంస్థలు అభ్యర్థుల వైపు చూసే పరిస్థితి నెలకొందన్నారు. సమీప భవిష్యత్‌లో ప్రపంచమంతా ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్‌ చుట్టూ తిరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఇటీవల కొన్ని కంపెనీలు వారికి అవసరమైన మానవ వనరులను ఎంపిక చేయడంలో సైతం రిక్రూటర్లు ఏఐ టెక్నాలజీను ఉపయోగిస్తున్నారని వెల్లడించారు. ఏఐ టెక్నాలజీ మార్కెటింగ్‌ సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు వినియోగదారుల మనోభావాలను, వారి కొనుగోలు అలవాట్లను ముందే ట్రాక్‌ చేసి సంస్థలకు అందజేస్తుందన్నారు. ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే కొత్తగా పలు వినూత్న జాబ్‌ ప్రొఫైల్స్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పేరొన్నారు. అనంతరం ముఖ్య అతిథిను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో యూఎస్‌ఏలోని అరిజోనా స్టేట్‌ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ ట్రాన్స్‌ఫర్‌ రిక్రూట్‌మెంట్‌ అసోసియేట్‌ డైరక్టర్‌ చెస్తెర్‌ హెండర్సన్, యూఎస్‌ఏలోని అరిజోనా స్టేట్‌ యూనివర్సిటీ రెప్రెజెంట్‌ రోషన్‌ లాలన్, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.