డాక్టర్ శారదకు షారోన్ అంతర్జాతీయ సేవా అవార్డు

 డాక్టర్ శారదకు షారోన్ అంతర్జాతీయ సేవా అవార్డు

- రేపు తెనాలిలో ప్రదానం


టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్,తెనాలి: కరోనా రోజుల్లో బాధితులను వైద్యసేవలను అందించటం తో సహా మహిళల్లో క్యాన్సర్ రహిత తెనాలి కోసం కృషి చేస్తూ, ప్రస్తుతం ధర్మ ప్రాజెక్టుతో గోల్డెన్ అవర్ వైద్యాన్ని ఉచితంగా అంది స్తున్న శారద సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకురాలు డాక్టర్ డి.శారదకు మరో ప్రతిష్టాత్మక గౌరవం దక్కనుంది. కెనాడకు చెందిన ప్రముఖ స్వచ్ఛంద సేవకురాలు షారోన్ పేరుతో అవార్డును ఇవ్వనున్నారు. షారోన్ అంతర్జా తీయ సేవా అవార్డు-2024కు ఎంపికయ్యారు. స్థానిక పెన్నీ మినిస్ట్రీస్ స్వచ్చంద సేవాసంస్థ అధ్యక్షుడు ప్రదీప్ దోనేపూడి ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10 గంటలకు స్థానిక రత్న ఫార్చ్యూన్ కల్యాణ మండపంలో ఏర్పాటయ్యే ప్రత్యేక సభలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఇటీవల మృతిచెందిన షారోన్ తన జీవితకాలం వైద్య సేవలు అందిందించారాన్నారు. ఆమె గౌరవార్ధం ఏటా షారోన్ అం తర్జాతీయ సేవా అవార్డును బహూకరిం చాలని నిర్ణయించినట్టు తెలిపారు. తొలిగా డాక్టర్ శారదకు, వచ్చే ఏడాది అవార్డును జమైకాలో ఉంటున్న భారతీయ వైద్యుడు డాక్టర్ నాగ మల్లేశ్వరరావుకు బహూకరిస్తామని వివరించారు. ఐఎంఏ, తెనాలి శాఖ అధ్యక్షురాలు డాక్టర్ విజయలక్ష్మి తోపాటు పట్టణ ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొంటారని పెన్నీ మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు, సినీదర్శకుడు దిలీప్ రాజా తెలిపారు.