అమెరికాలో ఇంటర్న్‌షిప్‌కు విజ్ఞాన్‌ ఫార్మసీ విద్యార్థులు

అమెరికాలో ఇంటర్న్‌షిప్‌కు విజ్ఞాన్‌ ఫార్మసీ విద్యార్థులు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు అమెరికాలోని ప్రముఖ అడ్వాన్డ్స్‌ ఫార్మసీ హాస్పిటల్స్‌లలో ఇంటర్న్‌షిప్‌కు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీ.శ్రీనివాసబాబు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలలో ఫార్మా–డీకు చెందిన 6వ సంవత్సరం విద్యార్థులు వీ.నిస్సీ జోసెఫ్, బీ.శ్రీలేఖ, ఎస్‌కే. దెహనాజ్, ఏ.వెన్నెల అనే 4 విద్యార్థులు అమెరికాలోని ప్రముఖ హాస్పిటల్స్‌లలో 4 వారాల అడ్వాన్డ్స్‌ ఫార్మసీ ప్రాక్టీస్‌ ఎక్సిపెరిమెంటల్‌ ట్రైనింగ్‌ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికయ్యారని తెలియజేసారు. అంతేకాకుండా ఈ నలుగురు విద్యార్థులు వచ్చే ఏప్రిల్‌ 11, 12 తేదీలలో ఓహియోలోని యూనివర్సిటీ ఆఫ్‌ ఫిండ్లేలో జరగనున్న ఫార్మా–డీ సింపోసిజమ్‌ ఫర్‌ స్కాలర్‌షిప్‌ అండ్‌ క్రియేటివీటీ కాన్ఫరెన్స్‌లో మూడు రీసెర్చ్‌ పేపర్లు ప్రచురించడానికి అనుమతి లభించిందని తెలియజేసారు. అమెరికాలో ఇంటర్న్‌షిప్‌తో పాటు రీసెర్చ్‌ పేపర్లు ప్రజెంట్‌ చేయడానికి ఎంపికైన విద్యార్థులను విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీ.శ్రీనివాసబాబు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు అభినందించారు.