జర్నలిస్టుల ఇళ్లస్థలాల జి.ఓ ను అమలు చేయాలి

జర్నలిస్టుల ఇళ్లస్థలాల జి.ఓ ను అమలు చేయాలి.
_ ఇళ్ల పట్టాలు అందించేలా చర్యలు తీసుకోవాలి.
ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో తెనాలి సబ్ కలెక్టర్ కు వినతి
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (ఎపిడబ్ల్యుజెఎఫ్) రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపులో భాగంగా జర్నలిస్టులకు ఇళ్లస్థలాల మంజూరు అంశం పై సోమవారం తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం లో డి. టీ  సుధా కిరణ్మయికు ఏపీడబ్ల్యూజేఎఫ్  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కనపర్తి రత్నాకర్ నాయకత్వంలో ఫెడరేషన్ సభ్యులు
వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో  జర్నలిస్టులకు మూడు సెంట్ల ఇంటిస్థలం కేటాయింపు వెంటనే జరిగేందుకు వీలైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
 జిల్లాలో కమిటీలు ఇప్పటికే జాబితాలను తయారు చేశారని తరువాత ఫిబ్రవరిలో మరోవారం రోజులు దరఖాస్తుకు అవకాశం కల్పించడం ద్వారా మరికొంతరు జర్నలిస్టులు కూడా దరఖాస్తు చేసే అవకాశం కల్పించారన్నారు. వీలైనంత త్వరగా తుది జాబితాను తయారు చేయాలని వెంటనే ఆ జాబితా విడుదల చేయాలని కోరారు. జాబితాలోని జర్నలిస్టులకు ఆయా మండలాల్లో, జిల్లా కేంద్రంలో ఎంతభూమి అవసరమో అంచనాలు తయారుచేసి అందుబాటులో ఉన్న భూమి వివరాలను సేకరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే భూమి అందుబాటు ఉన్న ప్రాంతాల్లో ధర నిర్ణయం జరిగి జర్నలిస్టులు ఎంతమొత్తం,ఎప్పటిలోగా చెల్లించాలో కమిటీలు నిర్ణయిస్తే అందుకు అనుగుణంగా జర్నలిస్టులు సంసిద్ధులవుతారని ఆర్థికంగా బలహీనస్థితిలో ఉన్నవారం కనుక తగినంత సమయం ఇస్తే బాగుంటుందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన జీ. ఓ. అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.  అనంతరం డి.ఎస్.పి. ఎం. రమేష్ ను కలసి జర్నలిస్టుల పై దాడులు జరగకుండా చూడాలని. హోమ్ మంత్రి ఆధ్వర్యం లో మీడియా హై పవర్ కమిటీ వేయాలని వినతి పత్రంఅందజేశారు. కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు ఎస్.ఎస్. జహీర్,బచ్చు సురేష్ బాబు, ఎం. సుబ్బారావు,
 పి. పున్నయ్య, అంబటి శ్యామ్ సాగర్, బి. చంద్ర మోహన్, సీ.హెచ్ చంద్ర శేఖర్, యూ. షణ్ముఖేశ్వర రావు, జి. ప్రకాశరావు, డి. నాగరాజు. ఎ. సాంబ శివరావు, కరేటి సాంబశివ రావు,సభ్యులు ఉన్నం భూషణం, శ్రీనివాస్, వి. లక్ష్మణరావు, వి. నాయుడు, ఎ. సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.