భగవద్గీత విశ్వరూపం ఆల్బమ్ ను ఆవిష్కరించిన హీరో విశ్వక్సేన్

భగవద్గీత విశ్వరూపం ఆవిష్కరించిన
 హీరో విశ్వక్సేన్
_ వేడుకగా ఆవిష్కరణ నిర్వహించిన
 సినెటేరియా ఫిలిం బ్రాండింగ్ హౌజ్
_ప్రముఖ సంగీత దర్శకులు ఆర్.పి. పట్నాయక్ స్వీయ సంగీతం,స్వీయ వ్యాఖ్యానంతో విడుదల
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
ప్రముఖ సంగీత దర్శకుడు అర్.పి. పట్నాయక్ రూపొందించిన సంపూర్ణ భగవద్గీత తాత్పర్యం ఆధ్యాత్మిక ఆల్బంను యువ హీరో విశ్వక్ సేన్ ఆవిష్కరించారు. హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో ఆదివారం సాయంత్రం కార్యక్రమం ఘనం గా జరిగింది.
సినెటేరియా మీడియా వర్క్స్ ఆవిష్కరణను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది.
కార్యక్రమానికి హీరో విశ్వక్ సేన్ ముఖ్య అథిది గా విచ్చేశారు. రఘు కుంచె, గాయని కౌసల్య, దర్శకులు దశరథ్, రచయిత జె.కె. భారవి, చిత్రకారుడు జానకిరాం, నటుడు జెమిని సురేష్, రాధే గ్రూప్ సీఈవో శ్రీవికాస్, మార్కెటింగ్ హెడ్ రాం లు పాల్గొని సంగీత దర్శకులు ఆర్.పి. పట్నాయక్ ను కొనియాడారు.