Skip to main content

Posts

Showing posts from April, 2024

రోబోటిక్ పోటీల విజేతలకు బహుమతి ప్రదానం

రోబోటిక్ పోటీల విజేతలకు బహుమతి ప్రదానం టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: తెనాలి: 30-04-2024: స్థానిక బోస్ రోడ్డులోని నెహ్రూనికేతన్ హైస్కూల్లో ఇటీవల రోబోటిక్ వైజ్ఞానిక పోటీలు జరిగాయి. ఈ పోటీలలో విజేతలకు మంగళవారం ఉదయం మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి జ్ఞాపికలు అందించి అభినందించారు. ఈ సందర్భంగా మురళీకాంత్ మాట్లాడుతూ పిల్లల మేధస్సుకు పదును పెట్టెందుకు రోబోటిక్లను రూపొందించడం, దానికి కోడింగ్ ఇచ్చే విధానం, రోబో ఎలా పనిచేస్తుంది? కృత్రిమ మేధస్సుకు సంబంధించిన అంశాలు ఇత్యాది పలు అంశాలలో పోటీలు నిర్వహంచి విజేతలకు బహుమతులు అందించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడకు చెందిన రోబోటిక్ టెక్నాలజీస్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు వి. నాగ వెంకట సాయిరాం, సాజీద్ షేక్, బాలబాలికలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

జేఈఈ మెయిన్‌ పరీక్షలో విజ్ఞాన్‌ విజయపరంపర

జేఈఈ మెయిన్‌ పరీక్షలో విజ్ఞాన్‌ విజయపరంపర టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: జేఈఈ మెయిన్‌ పరీక్షా ఫలితాల్లో అఖిల భారతస్థాయిలో ‘‘విజ్ఞాన్‌’’ విద్యార్థులు విజయపరంపర మోగించారని విజ్ఞాన్‌ విద్యాసంస్థల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్‌ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. కార్యక్రమంలో వడ్లమూడి విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాల, గుంటూరులోని మహిళా కళాశాల ప్రిన్సిపల్స్‌ జే.మోహన్‌ రావు, వై. వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ మా వద్ద ఐఐటీ మెయిన్స్‌ కోచింగ్‌ తీసుకున్న విద్యార్థులలో 50 శాతం మంది విద్యార్థులు 90 శాతం పర్సంటైల్‌ సాధించారు. ఇందులో ఐ.హనీత్‌ (99.67), ఎం.స్నేహ (99.46), బీ.యోగ విజయ కుమార్‌ (99.30), ఏ.రోహన్‌ (98.69), కే.లీలావతి (98.30), వీ.అభిరామ్‌ (96.87), కే.శివనాగ రాజు (96.47), టీ.సంజయ్‌ తేజ (96.41), పీ.గౌతమ్‌ (96.03), ఎమ్‌. వివేక్‌ పూజిత్‌ కుమార్‌ (95.72), కే.కారుణ్య (94.95), జీడీవీజీ పుల్లారెడ్డి (93.78), ఎం.నాగ సాయి ప్రకాష్‌ (93.06), సీహెచ్‌. వెంకట ఉదవ్‌ ఆదిత్య (93.45), ఏ.థాఫిల్‌ (93.55), సీ.ర...

నూతన నటీ నటులతో దళపతి సినీ ప్రొడక్షన్స్ నూతన చిత్రం..

నూతన నటీ నటులతో దళపతి సినీ ప్రొడక్షన్స్ నూతన చిత్రం  _ నిర్మాత విజయ్ వర్మ చేతుల మీదుగా పూజా కార్యక్రమం   టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: దళపతి సినీ ప్రొడక్షన్స్ పతాకంపై యువ నిర్మాత, రాజకీయ నాయకుడు దళపతి భువనేశ్వర్ రాజు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.మణి కుమార్ , సిందూర తేజస్విని జంటగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా బండారు అజయ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సినీ నిర్మాత, తెలుగు సినిమా వేదిక అధ్యక్షులు విజయ్ వర్మ పాకలపాటి స్క్రిప్ట్ ని దర్శకునికి అందజేసి శుభాకాంక్షలు తెలియజేసారు. కథ మాటలు స్క్రీన్ ప్లే ని కూడా అందిస్తున్న అజయ్ చెప్పిన స్క్రిప్ట్ నచ్చి చిత్ర నిర్మాణంలోకి అడుగు పెట్టానని నిర్మాత భువనేశ్వర్ రాజు పేర్కొన్నారు. నిర్మాత వుంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొనేలా కృషి చేస్తానని దర్శకుడు బండారు అజయ్ పేర్కొన్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో సుమ , అమ్మాజీ , హారిక , ప్రియాంక, శివమణి , నాగమణి , కృష్ణ , అంజి తదితరులు నటిస్తున్నారు.

దేశ భవిష్యత్తు కోసం మరొకసారి పుట్టండి సార్

ఆయన ఆలోచనలు అనంతం.. ఆయన త్యాగం అనవరతం...  ఆయన స్పూర్తి ఆదర్శం  ఆయనే దేశానికి ఆకాశం.. కుట్రలు..కుళ్లు..కరెన్సీ స్వార్ధంతో కంపుకొడుతున్న  ఈదేశానికి మీ అవసరం ఉంది.తెల్లదొరల పాలనకన్నా    ప్రమాదకరమైన నల్లదొరల చీకటి సామ్రాజ్యం లో వెలుగులు నిండాలి అంటే  మీరు దేశం కోసం . దేశ భవిష్యత్తు కోసం మరొకసారి పుట్టండి సార్. రచన: దిలీప్ రాజ, సినీ దర్శకులు

అంబేద్కర్ ఎక్స్ లేన్సి అవార్డ్ అందుకున్న శ్యామ్ సాగర్

అంబేద్కర్ ఎక్స్ లేన్సి అవార్డ్ అందుకున్న శ్యామ్ సాగర్ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: భారత రత్న డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ 133 వ జయంతి స్థానిక అంబేద్కర్ సేవా ట్రస్ట్ కార్యాలయం లో శనివారం సాయంత్రం ఘనం గా జరిగింది. కార్యక్రమం లో భాగం గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్స్ లెన్సీ పురస్కారాన్ని జర్నలిస్ట్ అంబటి శ్యామ్ సాగర్ కు ప్రదానం చేసారు. పట్టణానికి చెందిన టాలెంట్ ఎక్స్ ప్రెస్, శ్రీశ్రీ మీడియా, టివి 7 న్యూస్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవలందించిన వారికి పురస్కారం అందిస్తున్న నేపథ్యంలో పత్రికా రంగానికి సంబంధించి జర్నలిస్ట్ శ్యామ్ సాగర్ ను ఎంపికచేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యా లయం అంబేద్కర్ చైర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె.అబ్రహాంలింకన్ అధ్యక్షతన నిర్వహించిన సభలో శ్యామ్ సాగర్ పురస్కారాన్ని అందించారు. షీల్డు బహూకరించి సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ అబ్రహాం లింకన్ మాట్లాడుతూ సమాజ చైతన్యంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమన్నారు. శ్యామ్ సాగర్ కు అంబేద్కర్   పురస్కారంతో సత్కరించటం అభినందనీమన్నారు. దిబుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి యండ్రపాటి అశోక్...

ఇంటర్‌ ఫలితాల్లో ‘‘విజ్ఞాన్‌’’ విజయభేరి

ఇంటర్‌ ఫలితాల్లో ‘‘విజ్ఞాన్‌’’ విజయభేరి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ఇంటర్‌ ఫలితాల్లో తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని విజ్ఞాన్‌ విద్యాసంస్థల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్‌ తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాలలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపల్స్‌ జే.మోహనరావు, వై. వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వ విద్యా శాఖ విడుదల చేసిన ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో తమ కళాశాలకు చెందిన రెండో సంవత్సరం విద్యార్థులు కే.లీలావతి (989), జీ.వైశాలి (988), ఎం.స్నేహ  (987), ఎస్‌కే.మీరావలి(987), కే.వంశీ క్రిష్ణ (987), టీ.సంజయ్‌ తేజ (986), సీహెచ్‌. మనస్వి (986), టీ.సంజయ్‌ తేజ (986), చైతన్య చంద్రశేఖర్‌ (985), జీ.శశిధర్‌ (985), జీ.హారిక (985), వీవీ.మేఘన(985), టీ.చైతన్య చంద్రశేఖర్‌(985), జీ.శశిధర్‌ (985), ఆర్‌. రాఘ మానస (984), ఎస్‌.సౌమ్యశ్రీ (984), ఆర్‌.శివప్రియ (983), ఎస్వీ గాయత్రి (983), డీ.చంద్రిక (983), బీ.శ్రీ అనూహ్య (983), కే.మేధ గాయత్రి (982), డీ.శ్రవంతి(982), ఏ.దీపిక (981), జీ.కీర్తి(981), ఆర్‌.పద్మ (981), ఈ.రిషిత(980) మార్కులు ...

అంబేద్కర్ ఎక్స్ లెన్సీ అవార్డుకు ఎంపికైన శ్యామ్ సాగర్

అంబేద్కర్ ఎక్స్ లెన్సీ అవార్డుకు ఎంపికైన శ్యామ్ సాగర్ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:  భారత రత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకును ప్రతి ఏడాది టాలెంట్ ఎక్స్ప్రెస్ సంస్థ అంబేద్కర్ ఎక్స్ లెన్సీ అవార్డును ప్రదానం చేస్తుంది. 2024 సంవత్సరానికి గాను ఈ అవార్డును పట్టణానికి చెందిన జర్నలిస్ట్ అంబటి శ్యామ్ సాగర్కు అందజేస్తునట్లు దర్శకుడు కనపర్తి రత్నాకర్ తెలిపారు. స్థానిక బస్టాండ్ సమీపంలోని జైభీమ్ అంబేద్కర్ ఫెడరేషన్ కార్యాలయంలో శనివారం సాయంత్రం 4గంటలకు ప్రధానోత్సవ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న సభ నాగార్జున విశ్వవిద్యాలయం అంబేద్కర్ చైర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కనపర్తి అబ్రహాం లింకన్ అధ్యక్షతన నిర్వహిస్తునట్లు తెలిపారు. టాలెంట్ ఎక్స్ ప్రెస్, శ్రీశ్రీ మీడియా, టివి 7 న్యూస్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుందని నిర్వహకులు ఎం. శ్రీకాంత్, పుట్ట పున్నయ్యలు చెప్పారు.

ఉపాధ్యాయినిలకు లీడ్ స్కూల్వరి జాతీయ పురస్కారాలు

ఉపాధ్యాయినిలకు లీడ్ స్కూల్వరి జాతీయ పురస్కారాలు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: తెనాలి: 08-04-2024: విద్యా విధానంలో వస్తున్న నూతన మార్పులకు అనుగుణంగా ప్రతీ విద్యార్థికీ నాణ్యమైన విద్యను అందించి, ఆదర్శవంతమైన ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే లీడ్ స్కూల్ విధానం అని ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్ రీజనల్ డైరెక్టర్ బి. సుబ్రహ్మణ్యం అన్నారు. స్థానిక బోస్ రోడ్డులో నెహ్రూనికేతన్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ప్రస్తుతం కాలంలో విద్యార్థికి అవసరమైన నూతన విద్యావిధానాలను బోధించడంలో అత్యుత్తమ ప్రతిభను కనబరచిన 14 మంది నెహ్రూనికేతన్ ఉపాధ్యాయినులకు లీడాస్కూల్వారి జాతీయ పురస్కారాన్ని అందించి అనంతరం జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సభకు నెహ్రూనికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి అధ్యక్షత వహించారు. సుబ్రహ్మణ్యం తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ భారతదేశంలో 3 వేలకు పైచిలుకు పాఠశాలలు అధునాతనమైన లీడస్కూల్వారి విద్యావిధానాన్ని అవలంభిస్తున్నట్లు తెలిపారు. అధ్యక్షత వహించిన మురళీకాంత్ మాట్లాడుతూ కాలానుగుణంగా వస్తున్న విద్యా విధానంలో మార్పులను అవగాహన చేసుకుని, ఎప్పటికప్పుడు నవీన ఆలోచనలతో, నూతన ప...

ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్వర్యంలో ఉగాది పురస్కారాలు

ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్వర్యంలో - అంగరంగ వైభవంగా ఉగాది సినిమా పురస్కారాలు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్వర్యంలో "ఉగాది సినిమా పురస్కారాలు" పేరుతో ఆదివారం సాయంత్రం  విజయవాడ - గుంటూరు హైవే నందు గల హ్యాపీ రిసార్ట్స్ లో జరిగిన అవార్డ్స్ కార్యక్రమం ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ఉత్తమ డైరెక్టర్ గా వేణు వెల్దండి (బలగం), ఉత్తమ క్యారక్టర్ ఆర్టిస్ట్ గా అజయ్ ఘోష్ (మంగళవారం), ఉత్తమ హీరోగా ఆశిష్ గాంధీ (రుద్రాంగి), ఉత్తమ వెటరన్ డైరెక్టర్ గా సి.ఉమామహేశ్వర రావు (ఇట్లు అమ్మ), ఉత్తమ సపోర్టింగ్ నటుడుగా గా కోయ కిషోర్, ఉత్తమ సపోర్టింగ్ నటిగా జయశ్రీ రాచకొండ, ఉత్తమ బాల నటిగా బేబీ నేహా (లిల్లి), స్పెషల్ జ్యూరీ ఫీచర్ ఫిల్మ్ అక్షరం గా  అవార్డులు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ నుంచి తీసిన అన్ని సినిమాలకు ప్రోత్సాహక బహుమతులు ఇచ్చి సత్కరించారు. ఈ అవార్డ్ ల కార్యక్రమాన్ని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షులు కొత్త బసిరెడ్డి, ప్రస్తుత ఏపీ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు ఏ. యమ్.రత్నం , మాజీ అధ్యక్షులు  అంబటి మధుమోహన కృష్ణ , ఛాంబర్ సెక్...

విజయ్ వర్మ ను సత్కరించిన సింగపూర్ నాలెడ్జి హబ్

విజయ్ వర్మ ను సత్కరించిన సింగపూర్ నాలెడ్జి  హబ్   టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: సినీ దర్శక ,నిర్మాత ,నటులు ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ అఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి వీఎస్ విజయ్ వర్మ పాకలపాటి నేతృత్వంలో సినీ ప్రతినిధుల బృందం శ్రీలంక రాజధానిలో జరిగిన ఇండో సింగపూర్ ఫిలిం అండ్ టూరిజం ఎక్స్చేంజి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సినీ సాంకేతిక , సమన్వయ , ప్రచార ఉభయోపరి సహకారంతో పాటు పర్యాటక అభివృద్ధిని కాంక్షిస్తూ చేపట్టిన ఈ కార్యక్రమంలో విజయ్ వర్మ మాట్లాడుతూ ఆర్థికంగా, నిష్పక్షపాత , అవినీతి రహితంగా ఉన్నత స్థానంలో వున్న సింగపూర్  కి చెందిన ప్రొడక్షన్ హౌసెస్ తో మన చిత్ర నిర్మాణ సంస్థల భాగస్వామ్యం మన చిత్రాల పరిధి మరింతగా పెరిగేందుకు దోహదపడుతుందని అన్నారు.ఈ సందర్భంగా సింగపూర్ నాలెడ్జి హబ్ ప్రతినిధులు అడ్రియన్ ఓయ్, షియోబాన్ ఇసోబెల్ , నరేన్ ఆర్  లు విజయ్ వర్మ ని సత్కరించి ఇటువంటి మంచి కార్యక్రమాలు తరచుగా నిర్వహించాలని కోరారు.

వినూత్నంగా తెనాలిలో జగజ్జీవన్ రామ్ 116 జయంతి వేడుకలు

వినూత్నంగా తెనాలిలో జగజ్జీవన్ రామ్ 116 జయంతి వేడుకలు -116 వ జయంతిన 116 యాచకులకు ఒకొక్కరికి  రు116/- పంపిణీ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: మాజీ ఉప ప్రధాని, సీనియర్ పార్లమెంటెరియన్  స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ జన్మించి ఇప్పటికి 116 సంవత్సరాలు పూర్తయ్యాయి . జగజీవన్ రామ్ జీవితాన్ని సినిమాగా చిత్రీకరిస్తున్న దర్శకుడుదిలీప్ రాజా శుక్రవారం తెనాలిలో జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలను  నూతన పంధాలో వినూత్నంగా నిర్వహించారు. జగజ్జీవన్ రామ్ పాత్రను బయోపిక్ లో పోషిస్తున్న నటుడు మిలటరీ ప్రసాద్ ను జగజ్జీవన్ రామ్ వేషధారణతో పట్టణంలోని అనేక ప్రాంతాల్లోని భిక్షగాళ్ళు,యాచకులుకు ఒక్కొక్కరికి 116/- రూపాయలు చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా ఈ మూవీ మేకర్ దర్శకుడు దిలీప్ రాజా మీడియాతో మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ జన్మించి నేటికి 116 సంవత్సరాలు పూర్తియిన నేపద్యంలో బిక్ష గాళ్ళకు,యాచకులకు ఒకక్కరికి 116/- రూపాయలు చొప్పున అందచేశామని చెప్పారు. ఈ 116/- రూపాయలు అందుకున్న యాచకులందరు జగ్జీవన్ రామ్ పేరు చెప్పుకుని ఈరోజు కడుపునిండా భోజనం చేయాలనే ఆలోచనతో తెనాలిలో ఈ కొత్త కార్యక్రమా నికి శ్రీకారం చుట్టినట్లుగా ...