వినూత్నంగా తెనాలిలో జగజ్జీవన్ రామ్ 116 జయంతి వేడుకలు

వినూత్నంగా తెనాలిలో జగజ్జీవన్ రామ్ 116 జయంతి వేడుకలు
-116 వ జయంతిన 116 యాచకులకు ఒకొక్కరికి  రు116/- పంపిణీ
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: మాజీ ఉప ప్రధాని, సీనియర్ పార్లమెంటెరియన్  స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ జన్మించి ఇప్పటికి 116 సంవత్సరాలు పూర్తయ్యాయి . జగజీవన్ రామ్ జీవితాన్ని సినిమాగా చిత్రీకరిస్తున్న దర్శకుడుదిలీప్ రాజా శుక్రవారం తెనాలిలో జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలను  నూతన పంధాలో వినూత్నంగా నిర్వహించారు. జగజ్జీవన్ రామ్ పాత్రను బయోపిక్ లో పోషిస్తున్న నటుడు మిలటరీ ప్రసాద్ ను జగజ్జీవన్ రామ్ వేషధారణతో పట్టణంలోని అనేక ప్రాంతాల్లోని భిక్షగాళ్ళు,యాచకులుకు ఒక్కొక్కరికి 116/- రూపాయలు చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా ఈ మూవీ మేకర్ దర్శకుడు దిలీప్ రాజా మీడియాతో మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ జన్మించి నేటికి 116 సంవత్సరాలు పూర్తియిన నేపద్యంలో బిక్ష గాళ్ళకు,యాచకులకు ఒకక్కరికి 116/- రూపాయలు చొప్పున అందచేశామని చెప్పారు. ఈ 116/- రూపాయలు అందుకున్న యాచకులందరు జగ్జీవన్ రామ్ పేరు చెప్పుకుని ఈరోజు కడుపునిండా భోజనం చేయాలనే ఆలోచనతో తెనాలిలో ఈ కొత్త కార్యక్రమా నికి శ్రీకారం చుట్టినట్లుగా ఆయన తెలిపారు. కాగా పట్టణంలోని రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ , ఓవర్ బ్రిడ్జ్ పై ఉన్న భిక్షగాళ్లకు,యాచకులకు 116/- రూపాయలు ఒకొక్కరికి పంపిణీ చేసినట్లు అయన తెలిపారు.జగజ్జీవన్ రామ్ పాత్రలో పేదోడి కడుపు నింపే ప్రయత్నం తన కెంతో సంతోషం కలిగించిందని జగజ్జీవన్  రామ పాత్రను పోషిస్తున్న నటుడు మిలటరీ ప్రసాద్ పేర్కొన్నారు. కార్యక్రమంలో సహాయ దర్శకుడు వెంకీ రావణ్ తదితరులు పాల్గొన్నారు.