విజయ్ వర్మ ను సత్కరించిన సింగపూర్ నాలెడ్జి హబ్

విజయ్ వర్మ ను సత్కరించిన సింగపూర్ నాలెడ్జి  హబ్ 
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
సినీ దర్శక ,నిర్మాత ,నటులు ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ అఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి వీఎస్ విజయ్ వర్మ పాకలపాటి నేతృత్వంలో సినీ ప్రతినిధుల బృందం శ్రీలంక రాజధానిలో జరిగిన ఇండో సింగపూర్ ఫిలిం అండ్ టూరిజం ఎక్స్చేంజి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సినీ సాంకేతిక , సమన్వయ , ప్రచార ఉభయోపరి సహకారంతో పాటు పర్యాటక అభివృద్ధిని కాంక్షిస్తూ చేపట్టిన ఈ కార్యక్రమంలో విజయ్ వర్మ మాట్లాడుతూ ఆర్థికంగా, నిష్పక్షపాత , అవినీతి రహితంగా ఉన్నత స్థానంలో వున్న సింగపూర్  కి చెందిన ప్రొడక్షన్ హౌసెస్ తో మన చిత్ర నిర్మాణ సంస్థల భాగస్వామ్యం మన చిత్రాల పరిధి మరింతగా పెరిగేందుకు దోహదపడుతుందని అన్నారు.ఈ సందర్భంగా సింగపూర్ నాలెడ్జి హబ్ ప్రతినిధులు అడ్రియన్ ఓయ్, షియోబాన్ ఇసోబెల్ , నరేన్ ఆర్  లు విజయ్ వర్మ ని సత్కరించి ఇటువంటి మంచి కార్యక్రమాలు తరచుగా నిర్వహించాలని కోరారు.