నూతన నటీ నటులతో దళపతి సినీ ప్రొడక్షన్స్ నూతన చిత్రం..

నూతన నటీ నటులతో దళపతి సినీ ప్రొడక్షన్స్ నూతన చిత్రం 
_ నిర్మాత విజయ్ వర్మ చేతుల మీదుగా పూజా కార్యక్రమం 
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
దళపతి సినీ ప్రొడక్షన్స్ పతాకంపై యువ నిర్మాత, రాజకీయ నాయకుడు దళపతి భువనేశ్వర్ రాజు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.మణి కుమార్ , సిందూర తేజస్విని జంటగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా బండారు అజయ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సినీ నిర్మాత, తెలుగు సినిమా వేదిక అధ్యక్షులు విజయ్ వర్మ పాకలపాటి స్క్రిప్ట్ ని దర్శకునికి అందజేసి శుభాకాంక్షలు తెలియజేసారు. కథ మాటలు స్క్రీన్ ప్లే ని కూడా అందిస్తున్న అజయ్ చెప్పిన స్క్రిప్ట్ నచ్చి చిత్ర నిర్మాణంలోకి అడుగు పెట్టానని నిర్మాత భువనేశ్వర్ రాజు పేర్కొన్నారు. నిర్మాత వుంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొనేలా కృషి చేస్తానని దర్శకుడు బండారు అజయ్ పేర్కొన్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో సుమ , అమ్మాజీ , హారిక , ప్రియాంక, శివమణి , నాగమణి , కృష్ణ , అంజి తదితరులు నటిస్తున్నారు.