జేఈఈ మెయిన్‌ పరీక్షలో విజ్ఞాన్‌ విజయపరంపర

జేఈఈ మెయిన్‌ పరీక్షలో విజ్ఞాన్‌ విజయపరంపర
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
జేఈఈ మెయిన్‌ పరీక్షా ఫలితాల్లో అఖిల భారతస్థాయిలో ‘‘విజ్ఞాన్‌’’ విద్యార్థులు విజయపరంపర మోగించారని విజ్ఞాన్‌ విద్యాసంస్థల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్‌ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. కార్యక్రమంలో వడ్లమూడి విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాల, గుంటూరులోని మహిళా కళాశాల ప్రిన్సిపల్స్‌ జే.మోహన్‌ రావు, వై. వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ మా వద్ద ఐఐటీ మెయిన్స్‌ కోచింగ్‌ తీసుకున్న విద్యార్థులలో 50 శాతం మంది విద్యార్థులు 90 శాతం పర్సంటైల్‌ సాధించారు. ఇందులో ఐ.హనీత్‌ (99.67), ఎం.స్నేహ (99.46), బీ.యోగ విజయ కుమార్‌ (99.30), ఏ.రోహన్‌ (98.69), కే.లీలావతి (98.30), వీ.అభిరామ్‌ (96.87), కే.శివనాగ రాజు (96.47), టీ.సంజయ్‌ తేజ (96.41), పీ.గౌతమ్‌ (96.03), ఎమ్‌. వివేక్‌ పూజిత్‌ కుమార్‌ (95.72), కే.కారుణ్య (94.95), జీడీవీజీ పుల్లారెడ్డి (93.78), ఎం.నాగ సాయి ప్రకాష్‌ (93.06), సీహెచ్‌. వెంకట ఉదవ్‌ ఆదిత్య (93.45), ఏ.థాఫిల్‌ (93.55), సీ.రేవంత్‌ (93.45), పీ.అమర్‌ లోకేష్‌ (93.48), ఎల్‌పీజీ సాయి (92.24), బీ.సాయి రామ్‌రెడ్డి (92.16), వై నాగ వీర కార్తికేయ (90.96), కే.తరున్‌ గుప్త (90.49), బీ.హేమంత్‌ (90.21)లు ఉత్తమ పర్సంటైల్‌తో రాణించారని వెల్లడించారు.  95 శాతం పర్సంటైల్‌ పైన 10 మంది విద్యార్థులు ఉన్నారని, 90 పర్సంటైల్‌కుపైగా 22 మంది విద్యార్థులు సాధించారని పేర్కొన్నారు. గత 47 సంవత్సరాలుగా పరిమిత సంఖ్యలో ప్రవేశాలు కల్పిస్తూ ప్రతి ఒక్క విద్యార్థి విజయమే లక్ష్యంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పోటీ పరీక్షలకు తగిన విధంగా తాము అందజేస్తున్న అత్యున్నత స్థాయి విద్యా విధానం వల్లనే తమ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధిస్తున్నారని పేర్కొన్నారు. అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల అధినేత డాక్టర లావు రత్తయ్య, వడ్లమూడి, గుంటూరు మహిళల జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపల్స్‌ జే.మోహన్‌ రావు, వై. వెంకటేశ్వరరావు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.