ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్వర్యంలో ఉగాది పురస్కారాలు

ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్వర్యంలో
- అంగరంగ వైభవంగా ఉగాది సినిమా పురస్కారాలు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్వర్యంలో "ఉగాది సినిమా పురస్కారాలు" పేరుతో ఆదివారం సాయంత్రం  విజయవాడ - గుంటూరు హైవే నందు గల హ్యాపీ రిసార్ట్స్ లో జరిగిన అవార్డ్స్ కార్యక్రమం ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ఉత్తమ డైరెక్టర్ గా వేణు వెల్దండి (బలగం), ఉత్తమ క్యారక్టర్ ఆర్టిస్ట్ గా అజయ్ ఘోష్ (మంగళవారం), ఉత్తమ హీరోగా ఆశిష్ గాంధీ (రుద్రాంగి), ఉత్తమ వెటరన్ డైరెక్టర్ గా సి.ఉమామహేశ్వర రావు (ఇట్లు అమ్మ), ఉత్తమ సపోర్టింగ్ నటుడుగా గా కోయ కిషోర్, ఉత్తమ సపోర్టింగ్ నటిగా జయశ్రీ రాచకొండ, ఉత్తమ బాల నటిగా బేబీ నేహా (లిల్లి), స్పెషల్ జ్యూరీ ఫీచర్ ఫిల్మ్ అక్షరం గా  అవార్డులు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ నుంచి తీసిన అన్ని సినిమాలకు ప్రోత్సాహక బహుమతులు ఇచ్చి సత్కరించారు. ఈ అవార్డ్ ల కార్యక్రమాన్ని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షులు కొత్త బసిరెడ్డి, ప్రస్తుత ఏపీ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు ఏ. యమ్.రత్నం , మాజీ అధ్యక్షులు  అంబటి మధుమోహన కృష్ణ , ఛాంబర్ సెక్రెటరీ జె.వి.మోహన్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ విజయవర్మ పాకలపాటి, జాయింట్ సెక్రటరీ  జంగా చైతన్య  తడితురులు ప్పురస్కార గ్రహీతలను సత్కరించారు.