ఉపాధ్యాయినిలకు లీడ్ స్కూల్వరి జాతీయ పురస్కారాలు

ఉపాధ్యాయినిలకు లీడ్ స్కూల్వరి జాతీయ పురస్కారాలు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెనాలి: 08-04-2024: విద్యా విధానంలో వస్తున్న నూతన మార్పులకు అనుగుణంగా ప్రతీ విద్యార్థికీ నాణ్యమైన విద్యను అందించి, ఆదర్శవంతమైన ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే లీడ్ స్కూల్ విధానం అని ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్ రీజనల్ డైరెక్టర్ బి. సుబ్రహ్మణ్యం అన్నారు. స్థానిక బోస్ రోడ్డులో నెహ్రూనికేతన్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ప్రస్తుతం కాలంలో విద్యార్థికి అవసరమైన నూతన విద్యావిధానాలను బోధించడంలో అత్యుత్తమ ప్రతిభను కనబరచిన 14 మంది నెహ్రూనికేతన్ ఉపాధ్యాయినులకు లీడాస్కూల్వారి జాతీయ పురస్కారాన్ని అందించి అనంతరం జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సభకు నెహ్రూనికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి అధ్యక్షత వహించారు. సుబ్రహ్మణ్యం తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ భారతదేశంలో 3 వేలకు పైచిలుకు పాఠశాలలు అధునాతనమైన లీడస్కూల్వారి విద్యావిధానాన్ని అవలంభిస్తున్నట్లు తెలిపారు. అధ్యక్షత వహించిన మురళీకాంత్ మాట్లాడుతూ కాలానుగుణంగా వస్తున్న విద్యా విధానంలో మార్పులను అవగాహన చేసుకుని, ఎప్పటికప్పుడు నవీన ఆలోచనలతో, నూతన పద్ధతులతో విద్యాబోధన చేస్తున్న నెహ్రూనికేతన్ ఉపాధ్యాయులను అభినందించారు. అనంతరం 14 మంది ఉపాధ్యాయినులకు జ్ఞాపికలు, నగదుతో సత్కరించి లీడ్ స్కూల్వారి జాతీయ పురస్కారాలను అందించారు. ఇదే కార్యక్రమంలో లీడాస్కూల్వారి ఉత్తమ పాఠశాల పురస్కారాన్ని నెహ్రూనికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి. దాసరి అందుకున్నారు. సభలో లీడస్కూల్ గుంటూరుజిల్లా అకాడెమిక్ మేనేజర్ బి.వి. సుధాకర్ ప్రసంగించారు. కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, సుధాకర్లను నెహ్రూనికేతన్ తరఫున ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.