Skip to main content

Posts

Showing posts from May, 2024

టీనాచౌదరికి వరల్డ్ రికార్డ్స్ లో స్థానం

టీనాచౌదరికి వరల్డ్ రికార్డ్స్   లో స్థానం టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: మే 28 (తెనాలి) తెనాలికి చెందిన కూచిపూడి నర్తకి, వర్ణమాన సినీనటి టీనా చౌదరికి లిటిల్ ఛాంప్స్ అకాడమీ ఆఫ్ ఇండియా వరల్డ్ రికార్డు సర్టిఫికెట్ ను అందుకున్నారు. స్థానిక ఆర్టీవో కార్యాలయంలో తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ ఈ ప్రతిష్టాత్మక వరల్డ్ రికార్డు సర్టిఫికేట్ ను మంగళవారం టీనాచౌదరికి అందజేశారు. ఈ సందర్బంగా  తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ తెనాలికి చెందిన బి.టెక్ విద్యార్థినికి లిటిల్ ఛాంప్స్ అకాడమీ ఆఫ్ ఇండియా వరల్డ్ రికార్డు కు ఎంపిక కావడం పట్ల అభినందనలు వ్యక్తం చేశారు. 'మా-ఎపి వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీవ్ రాజు మాట్లాడుతూ గతంలో నాటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ గవర్నర్, ఆంధ్ర ప్రదేశ్, మిజోరాం రాష్ట్ర గవర్నర్లు నుండి తెనాలికి చెందిన టీనా చౌదరి సత్కారాలు అందుకోవడం తెనాలి పట్టణానికే గర్వకారణమన్నారు. మా. ఎపి'లో సభ్యురాలైన టీనా చౌదరి అంచెలంచలుగా అవకాశాలను అందిపుచ్చుకుని మరింతగా ఎదగాలని ఆయన అన్నారు. టీనామాట్లాడుతో తన ఎదుగుదలకు కృషి చేసిన అందరికి కతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ...

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ కు ఘన నివాళి

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు 101 వ జయంతి  ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యం లో తాడేపల్లి లోని ఛాంబర్ ప్రాంగణంలో ఘన నివాళులు అర్పింఛారు. తెలుగు చిత్ర పరిశ్రమ మనుగడకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఛాంబర్ వ్యవస్థాపక అధ్యక్షులు  రాజా వాసిరెడ్డి భూపాల్ ప్రసాద్  మాట్లాడుతూ యన్.టి.రామారావు కారణ జన్ముడని, తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఆయన చేసిన కృషి మరువలేనిదని, వారు హీరోగా ఉన్న సమయంలో పరిశ్రమ చాలా క్రమశిక్షణతో ఉండేదని, ప్రతి ఒక్కరూ వారిని స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలని పిలుపు మిచ్చారు.. ఛాంబర్ జనరల్ సెక్రటరీ జె.వి.మోహన్ గౌడ్ మాట్లాడుతూ చరిత్ర మరువని మహానుభావుడు ఎన్టీఆర్ గారని, చివరివరకు తాను తానుగా బ్రతికాడే తప్ప ఎప్పుడూ తలవంచని గొప్పవ్యక్తి ఆయనని, ఆయన హీరోగా ఉన్న సమయంలో చిన్న రెమ్యునరేషన్ పెంచుకోవడం కోసం నిర్మాతల అంగీకారంతోనే చేశారని, ప్రస్తుతం ఇండస్ట్రీలో అలాంటి పరిస్థితులు లేవని, నేటి హీరోలు కొంత క్రేజీ రాగానే కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ పెంచి ఇండస్ట్రీకి భారంగా తయారవుతున్నారని, ఇండస్ట్రీ ఏమ...

Let's remember the Legendary NTR on his 101th Birthday#NTRBirthdayCDP #ntrbirthdaymonth #NTRBirthday

కేన్స్' ఫిల్మ్ ఫెస్టివల్ లో భారత సినిమాకు రెడ్ కార్పెట్

'కేన్స్' ఫిల్మ్ ఫెస్టివల్ లో భారత  సినిమాకు రెడ్ కార్పెట్       సినీ దర్శకుడు దిలీప్ రాజా  టాలెంట్ ఎక్స్ న్యూస్,: తెనాలి, మే 22: ఫ్రాన్స్ దేశంలో జరుగుతున్న 'కేన్స్' ఫిల్మ్ ఫెస్టివల్ లో భారతీయ సినిమాకు రెడ్ కార్పెట్ వేయడం యావత్తు భారత ప్రజానీకం గర్వించదగిన అంశమని " మా - ఏపి" వ్యవస్థాపకులు,సినీ దర్శకుడు దిలీప్ రాజా చెప్పారు.ఈమేరకు మూవీ  ఆర్టిస్ట్  అసోసియేషన్ ,ఆంధ్రప్రదేశ్ శు భాకాంక్షల తీర్మానాన్ని ఆమొదించినట్లు తెలిపారు. గుంటూరుజిల్లా తెనాలిలోని రత్న ఫార్చ్యున్ కల్యాణమండపంలో బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతు ప్రపంచ వ్యాప్తంగా చలన చిత్ర నైపుణ్యాల ప్రదర్శనలో ప్రసిద్ధి చెందిన కేన్స్ లోని అంతర్జాతీయ వేదికపై భారత చిత్రాలకు పెరిగిన ఆదరణకు గౌరవం లభించడంపట్ల  భారత దేశ సినీ దర్శకుడుగా  సంతోషిస్తున్నానని ఆయన వ్యాఖ్యనించారు.ముస్తాజాబుద్దీన్ మాలిక్ దర్శకత్వంలో రూపొందిన" గాడ్  మస్ట్ డై" చిత్రoలో సాక్షాత్తు దేవుడిని చంపడం అనే ఊహించలేని కథాంశం ప్రస్తుతం  ప్రపంచ వ్యాప్తంగ చర్చకు దారి తీసిందంటే భారతీయ సినిమా హాలీవుడ్ స...

ఆంధ్ర లో సినీ పరిశ్రమ అభివృద్ధే మాలక్ష్యం

ఆంధ్రలో సినీ పరిశ్రమ అభివృద్ధే మాలక్ష్యం .  - దర్శకుల దినోత్సవంలోదర్శకులు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినీపరిశ్రమ అభివృద్ధి మాత్రమే తమ ముందున్న లక్ష్యమని దర్శకుల దినోత్సవంలో పాల్గొన్న ఎపి దర్శకులు గళమెత్తారు. స్థానిక రత్న ఫార్టున్ కళ్యాణ మండపం లోశనివారం సినిమా దర్శకుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 'మా ఎపి ' నిర్వహించిన ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు దర్శకులు అభిప్రాయం వ్యక్తంచేశారు. కార్యక్రమానికి 'మా- ఎపి' న్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీప్ రాజూ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా దర్శకరత్న దాసరి నారాయణరావు స్మారక పురస్కారాన్ని అంకురం, మౌనం,శ్రీకారం, చిత్రాల దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత సి. ఉమా మహేశ్వరరావు అందుకున్నారు. 40 సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు భరత్ పారేపల్లి కూడా 'దాసరి' పురస్కారాన్ని పట్టణానికి నికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ కొత్తమాసు శ్యామ్ సుందర్ అందజేశారు. ఆంధ్రప్రదేశ్ కి చెందిన దర్శకులు 'డాడీశ్రీనివాస్, ఓం సాయి, బి. సోమసుందరం, చలవాది  శివ ప్రసాద్ లు దర్శక...

సత్యజిత్ రే కి నివాళి అర్పించిన సినీ దర్శక నిర్మాత విజయ్ వర్మ

సత్యజిత్ రే కి కలకత్తా లో జయంతి నివాళి అర్పించిన సినీ దర్శక నిర్మాత విజయ్ వర్మ పాకలపాటి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: సినీ దర్శక నిర్మాత వీస్ విజయ్ వర్మ పాకలపాటి ఈ రోజు కలకత్తా లో భారతరత్న అవార్డు గ్రహీత భారతీయ చలనచిత్ర దిగ్గజం దివంగత సత్యజిత్ రే జయంతిని పురస్కరించుకొని సత్యజిత్ రే నివాసంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించటం జరిగింది. అనంతరం వారి కుమారుడు అగ్ర దర్శకుడు సందీప్ రాయ్ మరియు వారి కుటుంబ సభ్యులను కలవడం జరిగింది. బెంగాలీ మరో అగ్ర దర్శకుడు అరిందమ్ సిల్  ని కలవడం .. ఆయన తెలుగు చలన చిత్ర పరిశ్రమను అమితంగా పొగడడం ఆనందాన్ని ఇచ్చింది అని విజయ్ వర్మ అన్నారు . భారతీయ చలన చిత్ర పరిశ్రమ గర్వించే దర్శక మహాశయుడు సత్యజిత్ రే జన్మదినోత్సవ సందర్భంగా వారి స్వగృహంలో జరిగిన ఈ వేడుకల్లో పాల్గొనడం ఓ చిరస్మర స్మృతిగా వుంటుందని వర్మ అన్నారు.