సత్యజిత్ రే కి నివాళి అర్పించిన సినీ దర్శక నిర్మాత విజయ్ వర్మ

సత్యజిత్ రే కి కలకత్తా లో జయంతి నివాళి అర్పించిన సినీ దర్శక నిర్మాత విజయ్ వర్మ పాకలపాటి
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
సినీ దర్శక నిర్మాత వీస్ విజయ్ వర్మ పాకలపాటి ఈ రోజు కలకత్తా లో భారతరత్న అవార్డు గ్రహీత భారతీయ చలనచిత్ర దిగ్గజం దివంగత సత్యజిత్ రే జయంతిని పురస్కరించుకొని సత్యజిత్ రే నివాసంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించటం జరిగింది. అనంతరం వారి కుమారుడు అగ్ర దర్శకుడు సందీప్ రాయ్ మరియు వారి కుటుంబ సభ్యులను కలవడం జరిగింది. బెంగాలీ మరో అగ్ర దర్శకుడు అరిందమ్ సిల్  ని కలవడం .. ఆయన తెలుగు చలన చిత్ర పరిశ్రమను అమితంగా పొగడడం ఆనందాన్ని ఇచ్చింది అని విజయ్ వర్మ అన్నారు . భారతీయ చలన చిత్ర పరిశ్రమ గర్వించే దర్శక మహాశయుడు సత్యజిత్ రే జన్మదినోత్సవ సందర్భంగా వారి స్వగృహంలో జరిగిన ఈ వేడుకల్లో పాల్గొనడం ఓ చిరస్మర స్మృతిగా వుంటుందని వర్మ అన్నారు.