కేన్స్' ఫిల్మ్ ఫెస్టివల్ లో భారత సినిమాకు రెడ్ కార్పెట్

'కేన్స్' ఫిల్మ్ ఫెస్టివల్ లో భారత 
సినిమాకు రెడ్ కార్పెట్
      సినీ దర్శకుడు దిలీప్ రాజా 
టాలెంట్ ఎక్స్ న్యూస్,:
తెనాలి, మే 22: ఫ్రాన్స్ దేశంలో జరుగుతున్న 'కేన్స్' ఫిల్మ్ ఫెస్టివల్ లో భారతీయ సినిమాకు రెడ్ కార్పెట్ వేయడం యావత్తు భారత ప్రజానీకం గర్వించదగిన అంశమని " మా - ఏపి" వ్యవస్థాపకులు,సినీ దర్శకుడు దిలీప్ రాజా చెప్పారు.ఈమేరకు మూవీ  ఆర్టిస్ట్  అసోసియేషన్ ,ఆంధ్రప్రదేశ్ శు భాకాంక్షల తీర్మానాన్ని ఆమొదించినట్లు తెలిపారు. గుంటూరుజిల్లా తెనాలిలోని రత్న ఫార్చ్యున్ కల్యాణమండపంలో బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతు ప్రపంచ వ్యాప్తంగా చలన చిత్ర నైపుణ్యాల ప్రదర్శనలో ప్రసిద్ధి చెందిన కేన్స్ లోని అంతర్జాతీయ వేదికపై భారత చిత్రాలకు పెరిగిన ఆదరణకు గౌరవం లభించడంపట్ల  భారత దేశ సినీ దర్శకుడుగా  సంతోషిస్తున్నానని ఆయన వ్యాఖ్యనించారు.ముస్తాజాబుద్దీన్ మాలిక్ దర్శకత్వంలో రూపొందిన" గాడ్  మస్ట్ డై" చిత్రoలో సాక్షాత్తు దేవుడిని చంపడం అనే ఊహించలేని కథాంశం ప్రస్తుతం  ప్రపంచ వ్యాప్తంగ చర్చకు దారి తీసిందంటే భారతీయ సినిమా హాలీవుడ్ స్టాయికి ఎదిగిందని దిలీప్ రాజా అభిప్రాయం వ్యక్తo చేశారు .ఇందులో హీరోగా నటించిన భారతీయుడు సందీప్ కర్తార్ సింగ్ కు'కేన్స్' లో రెడ్ కార్పెట్ వేయడం మర్చిపోలేని అనుభూతి అన్నారు.అమెరికా ఫిలిం మేకర్, నటి గ్రేటా గెర్విగ్ జ్యూరీ కు అధ్యక్షులుగా, ఫ్రెంచ్ నటి కెమిల్లి కోటిన్  హోస్ట్ గా వ్యవహరించిన ' కేన్స్' వేడుకల్లో శోభితా ధూళిపాళ, కైరా అద్వానీ, ఐశ్వర్యరాయ్ బచన్, ఎమీ జాక్సన్,జాక్విలిన్ ఫెర్నాండెజ్,కన్నప్ప చిత్ర యూనిట్ తదితరులు పాల్గోనడం  అభినందనీయమని దిలీప్ రాజా పేర్కొన్నారు.సినీ దర్శకుడు అచ్చెన శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ " గాడ్  మస్ట్ డై " లాంటీ ప్రయోగాత్మక చిత్రానికి భారత ప్రభుత్వం వినోదం పన్ను మినహాయించి ఆయా దర్శక నిర్మాతలను గౌరవించాల్సిందిగా భారత ప్రభుత్వానికి మనవి చేశారు.' మా - ఏపి' సంయుక్త కార్యదర్శి,నటుడు మిలిటరీ ప్రసాద్ మాట్లాడుతు ఇటీవల ఆస్కార్ అవార్డ్ పొందిన తెలుగు సినిమా ఖ్యాతిని దేశం తలఎత్తుకుని చూసేలా చేసిందన్నారు. సమావేశం లో
మా - ఎపి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ మునిపల్లి
 శ్రీకాంత్,నటుడు బెల్లంకొండ వెంకట్, మన్నె సత్యనారాయణ చౌదరి,సహాయ దర్శకులు ఇంటూరి విజయ భాస్కర్ ,వెంకీ రావణ్ తదితరులు  పాల్గొన్నారు