విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ కు ఘన నివాళి

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు 101 వ జయంతి  ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యం లో తాడేపల్లి లోని ఛాంబర్ ప్రాంగణంలో ఘన నివాళులు అర్పింఛారు.
తెలుగు చిత్ర పరిశ్రమ మనుగడకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఛాంబర్ వ్యవస్థాపక అధ్యక్షులు  రాజా వాసిరెడ్డి భూపాల్ ప్రసాద్  మాట్లాడుతూ యన్.టి.రామారావు కారణ జన్ముడని, తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఆయన చేసిన కృషి మరువలేనిదని, వారు హీరోగా ఉన్న సమయంలో పరిశ్రమ చాలా క్రమశిక్షణతో ఉండేదని, ప్రతి ఒక్కరూ వారిని స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలని పిలుపు మిచ్చారు.. ఛాంబర్ జనరల్ సెక్రటరీ జె.వి.మోహన్ గౌడ్ మాట్లాడుతూ చరిత్ర మరువని మహానుభావుడు ఎన్టీఆర్ గారని, చివరివరకు తాను తానుగా బ్రతికాడే తప్ప ఎప్పుడూ తలవంచని గొప్పవ్యక్తి ఆయనని, ఆయన హీరోగా ఉన్న సమయంలో చిన్న రెమ్యునరేషన్ పెంచుకోవడం కోసం నిర్మాతల అంగీకారంతోనే చేశారని, ప్రస్తుతం ఇండస్ట్రీలో అలాంటి పరిస్థితులు లేవని, నేటి హీరోలు కొంత క్రేజీ రాగానే కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ పెంచి ఇండస్ట్రీకి భారంగా తయారవుతున్నారని, ఇండస్ట్రీ ఏమవుతేనేమి మాకు కావాల్సింది మాకు ఇవ్వాలంటున్నారని, ప్రస్తుతం ఇండస్ట్రీ పతనావస్థకు దగ్గరలో ఉందని, అందరూ మనసు మార్చుకొని ఇండస్ట్రీ బాగు కోసం పనిచేయాలని, దానికి ఎన్టీఆర్, ఏఎన్ఆర్  లను  స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని తెలిపారు..ఇండస్ట్రీలో ఏది చేయాలన్నా ఎవరికి వారే యమునా తీరే అన్న పరిస్థితుల్లో ఉందని ఇండస్ట్రీలో  వ్యవస్థను చక్కదిద్దే దమ్మున్న నాయకులు లేరని అవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ట్రెజరర్ యమ్.శ్రీనాధరావు, జాయింట్ సెక్రటరీస్  జంగా చైతన్య, పులి రమణారెడ్డి, ఈ. సి.మెంబర్ రవీంద్రనాథ్ ఠాగూర్ బాబు, నిర్మాత సభ్యులు బి.వి.రత్నం, శంకర్ , విఠల్ తదితరులు పాల్గొన్నారు.