ఆంధ్ర లో సినీ పరిశ్రమ అభివృద్ధే మాలక్ష్యం

ఆంధ్రలో సినీ పరిశ్రమ అభివృద్ధే మాలక్ష్యం.
 - దర్శకుల దినోత్సవంలోదర్శకులు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినీపరిశ్రమ అభివృద్ధి మాత్రమే తమ ముందున్న లక్ష్యమని దర్శకుల దినోత్సవంలో పాల్గొన్న ఎపి దర్శకులు గళమెత్తారు. స్థానిక రత్న ఫార్టున్ కళ్యాణ మండపం లోశనివారం సినిమా దర్శకుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 'మా ఎపి ' నిర్వహించిన ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు దర్శకులు అభిప్రాయం వ్యక్తంచేశారు. కార్యక్రమానికి 'మా- ఎపి' న్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీప్ రాజూ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా దర్శకరత్న దాసరి నారాయణరావు స్మారక పురస్కారాన్ని అంకురం, మౌనం,శ్రీకారం, చిత్రాల దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత సి. ఉమా మహేశ్వరరావు అందుకున్నారు. 40 సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు భరత్ పారేపల్లి కూడా 'దాసరి' పురస్కారాన్ని పట్టణానికి నికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ కొత్తమాసు శ్యామ్ సుందర్ అందజేశారు. ఆంధ్రప్రదేశ్ కి చెందిన దర్శకులు 'డాడీశ్రీనివాస్, ఓం సాయి, బి. సోమసుందరం, చలవాది  శివ ప్రసాద్ లు దర్శక దినోత్సవ సందర్భంగా' మా _ ఎపి నుండి గౌరవ పురస్కారాన్ని అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఫిలిమ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ మేనేజర్ శ్రీనివాస నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో చిత్రీకరించిన సినిమాలకు ప్రభుత్వం లోకేషన్లు ఉచితంగా ఇస్తుందని తెలిపారు.రాష్ట్రంలో షూటింగ్ లు నిర్విరామంగా జరగటానికి దర్శకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవల్సిందిగా ఆయన కోరారు.వర్థమాన హీరోరోయిన్లు దివిజ, మౌనిక రెడ్డి, టీనా చౌదరిలను ''ఎపి' సత్కరించింది. కార్యక్రమం లో ముందు గ్రీష్మ శ్రీ భరతనాట్య ప్రదర్శన చేయగా మానసిక వైద్యులు డాక్టర్ ఐనంపూడి శరత్ బాబు దర్శక దినోత్సవ ప్రత్యేక గీతాన్ని ఆలపించారు. కారక్రమాన్ని దర్శకుడు కనపర్తి రత్నాకర్ ప్రారంభించగా నటుడు మిలటరీ ప్రసాద్ వందన సమర్పణచేశారు. కాగా శ్రీకాంత్, వెంకీ రావణ్,
తదితరులు పర్య వేక్షించారు.