టీనాచౌదరికి వరల్డ్ రికార్డ్స్ లో స్థానం

టీనాచౌదరికి వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
మే 28 (తెనాలి) తెనాలికి చెందిన కూచిపూడి నర్తకి, వర్ణమాన సినీనటి టీనా చౌదరికి లిటిల్ ఛాంప్స్ అకాడమీ ఆఫ్ ఇండియా వరల్డ్ రికార్డు సర్టిఫికెట్ ను అందుకున్నారు. స్థానిక ఆర్టీవో కార్యాలయంలో తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ ఈ ప్రతిష్టాత్మక వరల్డ్ రికార్డు సర్టిఫికేట్ ను మంగళవారం టీనాచౌదరికి అందజేశారు. ఈ సందర్బంగా 
తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ తెనాలికి చెందిన బి.టెక్ విద్యార్థినికి లిటిల్ ఛాంప్స్ అకాడమీ ఆఫ్ ఇండియా వరల్డ్ రికార్డు కు ఎంపిక కావడం పట్ల అభినందనలు వ్యక్తం చేశారు. 'మా-ఎపి వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీవ్ రాజు మాట్లాడుతూ గతంలో నాటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ గవర్నర్, ఆంధ్ర ప్రదేశ్, మిజోరాం రాష్ట్ర గవర్నర్లు నుండి తెనాలికి చెందిన టీనా చౌదరి సత్కారాలు అందుకోవడం తెనాలి పట్టణానికే గర్వకారణమన్నారు. మా. ఎపి'లో సభ్యురాలైన టీనా చౌదరి అంచెలంచలుగా అవకాశాలను అందిపుచ్చుకుని మరింతగా ఎదగాలని ఆయన అన్నారు. టీనామాట్లాడుతో తన ఎదుగుదలకు కృషి చేసిన అందరికి కతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీనా చౌదరి తండ్రి మన్నె సత్యన్నారాయణ, తల్లి మన్నె శివకుమారి, సహాయ దర్శకులు ఇంటూరి విజయ బాస్కర్, వెంకీరావణ్ తదితరులు పాల్గొన్నారు.