Skip to main content

Posts

Showing posts from June, 2024

వ్యాపార సంస్థల కోసం లీజుకు లభించును..

1600 స్క్వేర్ ఫీట్ గల జయ వెంకట్ కాంప్లెక్స్ నందు ఒకటి రెండు మూడు ఫ్లోర్ ఆఫీసులకు వ్యాపారాలకు బ్యాంకులకు లీజుకు ఇవ్వబడును లిఫ్ట్ సౌకర్యం కలదు పాతరత్న టాకీస్ వద్ద నియర్ ట్రెండ్స్ తెనాలి.  సంప్రదించవలసిన నెంబర్: 8121855393

డిజిపిని కలిసిన దిలీప్ రాజా

డిజిపిని కలిసిన దిలీప్ రాజా డీజీపీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్న దిలీప్ రాజా టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: తెనాలి ,జూన్ 29 : ఆంధ్రప్రదేశ్ నూతన  డిజిపి ద్వారక తిరుమల రావుని 'మా - ఎపి' వ్యవస్థాపకులు,సినీ దర్శకుడు దిలీప్ రాజా శనివారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరపున నూతన డీజీపీ గా భాద్యతలను తీసుకున్న ద్వారక తిరుమల రావుకు శుభాకాంక్షలు అందజేశామని దిలీప్ రాజా మీడియకు తెలిపారు. ఆంధ్రాలో  మా - ఎపి  కార్యక్రమలను డీజీపీ అడిగి తెలుసుకున్నారని ఆయన చెప్పారు.ఈసందర్భంగా నిర్మాణంలో ఉన్న జగజ్జీవన్ రామ్ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్న మిలటరీ ప్రసాద్, లాల్ బహదూర్ శాస్త్రి గా నటిస్తున్న ఉత్తరప్రదేశ్ నటుడు అమీర్ చౌదరి ,సహాయ దర్శకుడు వెంకీ రావన్లను నూతన డీజీపీకి  పరిచయం చేసినట్లు  ఆయన వివరించారు.కాగా తెనాలిలో ని  మా - ఎపి కార్యాలయాన్ని సందర్శించవలసిందిగా డీజీపీని ఆహ్వానించినట్లుగా దిలీప్ రాజా తెలిపారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ వీసీకు ఎన్‌సీసీ విభాగంలో గౌరవ కల్నల్‌ ర్యాంక్‌

విజ్ఞాన్స్‌ వర్సిటీ వీసీకు ఎన్‌సీసీ విభాగంలో గౌరవ కల్నల్‌ ర్యాంక్‌ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌కు ఎన్‌సీసీ విభాగంలో గౌరవ కల్నల్‌ ర్యాంక్‌ను అందిస్తున్నట్లు న్యూఢిల్లీలోని గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా– మినిస్ట్రీ ఆఫ్‌ డిఫెన్స్‌ శుక్రవారం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను, గెజిట్‌ నోటిఫికేషన్‌ను త్వరలోనే ఆయనకు అందజేస్తామని వెల్లడించింది. విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అకడమిక్‌ ఫ్రేమ్‌వర్క్‌లో ఎన్‌సీసీను ఏకీకృతం చేయడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచి విద్యార్థుల్లో క్రమశిక్షణ, స్నేహభావం, నిబద్ధత, సమగ్ర అభివృద్ధికై చేస్తున్నటువంటి కృషికి గాను ఎన్‌సీసీ విభాగంలో గౌరవ కల్నల్‌ ర్యాంక్‌ను అందిస్తున్నామని వెల్లడించింది. యూనివర్శిటీలో ఎన్‌సీసీ కార్యకలాపాలను ఎక్కువగా నిర్వహించటంలో ఆయన విశేషమైన నిబద్ధతను ప్రదర్శించారని తెలియజేసింది. ఎన్‌సీసీ మరియు ఎన్‌సీసీయేతర క్యాడెట్‌లకు 20 క్రెడిట్‌లను అందించే ఎన్‌సీసీ మైనర్‌ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టడం ఆయన సాధించిన విజయాలలో అతి ముఖ్యమైనది. ఎన్‌సీసీ ట్రైనింగ్‌ ప్రాముఖ్యతను గుర్తిస్తూ అకడమిక్‌ ...

సమస్యల సాధనకు పోరు బాట పట్టాలి

సమస్యల సాధనకు పోరు బాట పట్టాలి .. - ఏపీడబ్ల్యూ జె ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు పిలుపు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: రాష్ట్రంలో పాత్రికేయులుతీవ్ర సంక్షోభంలో ఉన్నారని సమస్యల సాధనకు పోరాట పంధాయే మార్గమని ఏపీడబ్ల్యూ జే ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు  ఉద్బోధించారు.ప్రస్తుతం మీడియా యావత్తు ఇటు ప్రభుత్వం తోను అటు యాజమాన్య పరంగా ఇక్కట్ల నెదుర్కొంటున్నారని  ఆవేదన వ్యక్తం చేసారు. ఏలూరు జిల్లా తృతీయ కార్యవర్గ సమావేశం బుధవారం ఇక్కడి పి ఆర్ ట్రైనింగ్ సెంటర్లో జిల్లా అధ్యక్షుడు ఎస్ డి జబీర్ ఆధ్యక్షతన జరిగింది ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు విలేకరుల సాధక బాధలు ప్రస్తావించారు. వారు నడిరోడ్డుపై ఉన్నారని నూతన కూటమి ప్రభుత్వం నాలుగు దశాబ్దాల పరిపాలనానుభవం కలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారధ్యం లో ఏర్పడిందని అభినందించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం ఇటీవల వరకు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, మంజూరు విషయంలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చి చివరిరోజు వరకు మభ్య పెట్టారని ఆవేదన చెందారు. చంద్రబాబు గత ప్రభుత్వం...

విద్యాశాఖ ప్రోత్సాహం గ్రీష్మశ్రీకు ఉంటుంది

విద్యాశాఖ ప్రోత్సాహం గ్రీష్మశ్రీకు ఉంటుంది  - ఆర్జేడి బి. లింగేశ్వరరెడ్డి  టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: తెనాలి మన బాల నృత్య కళాకారిణి గ్రీష్మశ్రీకు విద్యాశాఖ  ప్రోత్సాహం వుంటుందని పాఠశాలల ఆర్జేడీ బి. లింగేశ్వరరెడ్డి చెప్పారు. స్థానిక అరవింద విద్యా కేంద్రంలో బుధ వారం అభినందన సభ జరిగింది. సమావేశానికి శ్రీ అరవింద డైరెక్టర్ కొండపనేని సంపూర్ణ అధ్యక్షత వహించారు. గవర్నర్ల సత్కారం పొందిన ఎనిమిది సంవత్సరాల గ్రీష్మ శ్రీ గుంటూరు జిల్లా విద్యార్థిని కావడం జిల్లాగే గర్వకారణం అని లింగేశ్వర రెడ్డి అన్నారు. ప్రతిభను ప్రోత్సహించడంతో విద్యాశాఖ ముందుంటుందని ఆయన పేర్కొన్నారు. కేవలం నాలుగో తరగతి చదువుతూ కూచిపూడి నృత్యంలో విశేష ప్రతిభ చూపిన గ్రీష్మశ్రీను ఆయన సత్కరించారు. సినీ దర్శకుడు దిలీప్ రాజూ మాట్లాడుతూ ప్రోత్సాహం వుంటే  గమ్యం చేరడం ఎంతమాత్రం కష్టం కాదని గ్రీష్మశ్రీ నిరూపించిందన్నారు. ప్రతిభకు ప్రోత్సాహం తోడయితే విజయం అంచున విద్యార్థులు అధిరోహించగలరని ఆయన తెలిపారు . కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు ఆర్. నిర్మల కుమారి, నందిపాటి శివకుమారి, పాఠశాల సెక్రటరీ వై. మోహన...

AP government approves ticket price hike for Kalki 2898 AD

AP government approves ticket price hike for Kalki 2898 AD Talent express news: Prepare for the cinematic voyage into the visionary universe of Nag Ashwin’s Kalki 2898 AD, hitting screens this Thursday. With Prabhas and Deepika Padukone leading the charge, the film promises an enthralling visual odyssey. In recent updates, Andhra Pradesh has greenlit a two-week window for increased ticket prices. Single-screen rates climb by Rs. 75, while multiplexes surge to Rs. 125, bolstering the film’s statewide reception. Telangana mirrors the trend, albeit for only eight days, with single-screen and multiplex rates rising by Rs. 75 and Rs. 100, respectively.Despite the premium pricing, fervent fans are securing seats for the much-anticipated release, anticipating record-breaking success. Alongside Prabhas and Deepika Padukone, the film features a stellar ensemble cast, including Amitabh Bachchan, Kamal Haasan, Pasupathy, Anna Ben, Mrunal Thakur, Brahmanandam, Rajendra Prasad, and ...

పెమ్మసాని అనే నేను...

పెమ్మసాని అనే నేను... - పార్లమెంటులో తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: పెమ్మసాని చంద్రశేఖర్ అను నేను.. లోక్ సభ సభ్యునిగా ఎన్నుకొనబడిన వాడనై శాసనము ద్వారా.. అంటూ సోమవారం ఉదయం డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పార్లమెంట్ వేదికగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ భర్త హరి మెహతాబ్ అధ్యక్షతన జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగంగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పార్లమెంట్ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సభలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భర్తు హరి మెహతాబ్క అభివాదం చేసారు. ఆ తర్వాత పెమ్మసాని స్పందిస్తూ తనకు ఎంపీగా అవకాశం కల్పించిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి కృతజ్ఞతలు, అలాగే 3.44 లక్షల భారీ మెజారిటీతో తనకు ఈ విజయం అందించిన గుంటూరు పార్లమెంట్ ప్రజానీకానికి ధన్యవాదాలు తెలిపారు.

మళ్ళీ శంషాబాద్‌లో చిరుత కలకలం?

మళ్ళీ శంషాబాద్‌లో చిరుత కలకలం? హైదరాబాద్ :జూన్ 24 శంషాబాద్‌లో చిరుత పులి కలకలం సృష్టించింది. ఘన్సీమియాగూడ శివారు లోఈరోజు ఉదయం చిరుత సంచారం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది.  రెండు రోజుల క్రితం పొలంలో కుక్కలపై చిరుత దాడి చేసి చంపేసింది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు రైతులు. చిరుతను బంధించాలని కోరుతున్నారు. సీసీ కెమెరాల్లో కనిపించిన చిరుత జాడల్ని కనిపెట్టా లని కోరుతున్నారు.  గ్రామంలో వ్యవసాయంపై అదారపడే తాము పొలం వెళ్లాలంటే అరచేతిలో ప్రాణాల్ని పెట్టుకొని వెళ్తున్నామని, వెంటనే అధికారులు సకాలంలో స్పందించి చిరుతను పట్టుకోవాలని కోరుతు న్నారు. కాగా, నెల రోజుల క్రితం శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు సమీపంలో చిరుతతో పాటు రెండు పిల్లలు ఎయిర్‌ పోర్టు లోపలికి ప్రవేశించేందుకు ప్రహరీ దూకేందుకు ప్రయత్నించాయి. అయితే ఫెన్సింగ్‌ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్‌ పోర్ట్‌ కంట్రోల్‌ రూం అలారం మోగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే చిరుతను, దాని పిల్లల్ని బందించారు. ఆ సంఘటన మరువక ముందే మళ్ళీ చిరుత అనవాళ్లు గుర్తించడంతో స్థానికుల్లో భయాందోళన మొదలైంది.

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విద్యార్థినికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విద్యార్థినికి పీహెచ్‌డీ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ సైన్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ విభాగంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌ విభాగానికి  చెందిన టీ.నాగమల్లేశ్వరి అనే విద్యార్థినికి తమ యూనివర్సటీ పీహెచ్‌డీ పట్టా అందించిందని వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ డోపింగ్‌ ఇండ్యూస్డ్‌ మోడిఫికేషన్‌ ఇన్‌ ఎన్నీల్డ్‌ జింక్‌ ఆక్సైడ్‌ నానోస్ట్రక్చర్స్‌: ఏ మల్టిఫేసిటెడ్‌ స్టడీ ఆన్‌ స్ట్రక్చరల్, ఆప్టికల్, మ్యాగ్నటిక్‌ అండ్‌ మెకానికల్‌ ప్రాపర్టీస్‌’’ అనే అంశంపై విద్యార్థిని పరిశోధన చేసిందని తెలియజేశారు. ఈమెకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌  ఫిజిక్స్‌ విభాగంలోని ప్రొఫెసర్‌ జాలాది నిశ్చల్‌ కిరణ్‌ గైడ్‌గా వ్యవహరించారని పేర్కొన్నారు. ఈమె తన పరిశోధనలో భాగంగా మొత్తం 1 స్కోపస్‌ ఇండెక్స్, 3 ఎస్‌సీఐ ఇండెక్డ్స్‌ జర్నల్‌లో పేపర్స్‌ పబ్లిష్‌ చేశారని తెలియజేసారు. డాక్టరేట్‌ పొందిన  టీ.నాగమల్లేశ్...

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ – సీడాక్‌ల మధ్య అవగాహన ఒప్పందం

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ – సీడాక్‌ల మధ్య అవగాహన ఒప్పందం టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ – బెంగుళూరులోని సీడాక్‌ ( సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్డ్స్‌ కంప్యూటింగ్‌) ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని శనివారం యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీడాక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ డాక్టర్‌ ఎస్‌డీ.సుదర్శన్‌తో వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ అవగాహన ఒప్పందానికి సంబంధించిన పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ మాట్లాడుతూ ఈ అవగాహన ఒప్పందం వలన విద్యార్థులకు, అధ్యాపకులకు రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్, ప్రోడక్ట్‌ డెవలప్‌మెంట్, ట్రైనింగ్‌ అండ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ రంగాలలో ప్రత్యేక శిక్షణ లభిస్తుందన్నారు. అంతేకాకుండా రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్, హై పెర్ఫార్మెన్స్‌ కంప్యూటింగ్, బిగ్‌డేటా అనలిటిక్స్, సైబర్‌ సెక్యూరిటీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, ఎంబెడెడ్‌ సిస్టమ్స్, రోబోటిక్స...

ఎమ్మెల్యే విజయ చంద్ర ' మా- ఎపి' సభ్యులే

ఎమ్మెల్యే విజయ చంద్ర ' మా- ఎపి' సభ్యులే   -  -సినీదర్శకులు దిలీప్ రాజా  టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: తెనాలి, జూన్ 22 : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ,ఆంధ్ర ప్రదేశ్ లో సభ్యుడైన విజయ చంద్ర విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గo శాసనసభ్యుడిగా గెలుపొందారని 'మా - ఎపి' వ్యవస్థాపకులు, సినీ దర్శకుడు దిలీప్ రాజా చెప్పారు.స్థానిక 'మా- ఎపి' కార్యాలయంలో శనివారం ఏర్పటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పార్వతీపురం ఎమ్మెల్యే విజయ చంద్ర నిర్మాణంలో ఉన్న బాబు జగజ్జీవన్ రామ్ బయోపిక్ "బాపూజీ'లో  ప్రాముఖ్యం ఉన్న పాత్రలో నటిస్తున్నారని తెలిపారు.అసెంబ్లీలో శనివారం ఎమ్మెల్యే విజయచంద్రను కలసి అభినందించిన అనంతరo ' మా - ఏపి' జ్ఞాపికను అందజేసినట్లుగా ఆయన పేర్కొన్నారు.నటుడు మిలటరీ ప్రసాద్  మాట్లాడుతూ ఎమ్మెల్యే విజయ చంద్ర మంచి టైమింగ్ ఉన్న  ఆర్టిస్ట్ అని కొనియాడా రు.శాసన సభ బడ్జెట్ సమావేశాలు జరిగే సమయంలో తెనాలి వచ్చి' మా - ఎపి ' సభ్యులను  ఎమ్మెల్యే విజయ చంద్ర కలుసుకుoటా రని  తెలిపారు.కార్యక్రమములో సహాయ దర్శకుడు వెంకీ రావణ్,అయినంపూడి  రాకేష్ పాల్గోన్నారు.

యోగాతోనే ఆరోగ్యకరమైన జీవితం

యోగాతోనే ఆరోగ్యకరమైన జీవితం -  ఏపీలోని భారత్‌ స్వాభిమాన్‌ ట్రస్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డీ.దుర్గా రావ్‌ _  విజ్ఞాన్స్‌లో ఘనంగా 10వ ఇంటర్నేషనల్‌ యోగా డే ఉత్సవం టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ఆరోగ్యకరమైన జీవితానికి యోగా ఎంతో సహాయపడుతుందని ఏపీలోని భారత్‌ స్వాభిమాన్‌ ట్రస్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డీ.దుర్గా రావ్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో 10వ ఇంటర్నేషనల్‌ యోగా డేను ఈ సంవత్సరం ‘‘యోగా ఫర్‌ ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌’’ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. యోగా డేను పురస్కరించుకుని నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీలోని భారత్‌ స్వాభిమాన్‌ ట్రస్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డీ.దుర్గా రావ్‌ మాట్లాడుతూ ప్రస్తుతం మానసిక ఒత్తిడి, సమస్యలు లేని జీవితం లేదంటే అతిశయోక్తి కాదన్నారు. పని ఒత్తిడి, ఆర్థిక పరమైన సమస్యలు, ఇతర ఇబ్బందుల కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ప్రతిరోజు కనీసం ఒక అరగంట అయినా శారీరక శ్రమ చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అందుకు యోగా చక్కని మార...

దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదుద్దుతాం

* దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదుద్దుతాం * - రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: అమరావతి, జూన్ 20 :   సహజసిద్దమైన ప్రకృతి అందాలతో అలరారే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ది పరుస్తామని రాష్ట్ర  పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం  5.50 గంటల సమయంలో వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం  రెండో బ్లాక్ లో  రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రూ.2.31 కోట్ల అంచనా వ్యయంతో 10 టూరిజం బోట్లను  కొనుగోలు చేసే ఫైలుపై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 974 కిలోమీటర్ల సముద్రతీర ప్రాంతంతో మరియు  సహజ సిద్ధమైన ప్రకృతి అందాలతో అలరారే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పర్యాటక పరంగా ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. పర్యాటకం మరియు కళల పట్ల ప్రత్యేక శ్రద్ద ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నా...

'స్టూడియోలు నిర్మించడానికి ముందుకు రావాలి

స్టూడియోలు నిర్మించడానికి ముందుకు రావాలి ' టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:  సచివాలయంలోని రెండో బ్లాక్ లో పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రిగా కందుల దుర్గేశ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో స్టూడియోలు నిర్మించడానికి ముందుకు రావాలన్నారు. అన్ని రకాల సహకారాలు అందిస్తామన్నారు. ఎకో, అడ్వెంచర్ టూరిజాన్ని ప్రోత్సహిస్తామని చెప్పారు. పర్యాటక రంగం ద్వారా నిధులు సమకూర్చుకునేలా కృషి చేస్తామన్నారు. రానున్న రోజుల్లో కోనసీమను అద్భుతంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

శుభాకాంక్షలు..

కుష్టురోగులకు సాయం చేయడమే సంతృప్తి

కుష్టురోగులకు సాయం చేయడమే సంతృప్తి   - సినీ దర్శకుడు దిలీప్ రాజా  టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: పెదరావూరు, జూన్ 16: కుష్టురోగులకు సాయం చేయడoలో ఎOతో ఆత్మ సంతృప్తి ఉందని  సినీ దర్శకుడు దిలీప్ రాజా చెప్పారు.రూరల్ మండలం పెదరావురులోని పెన్నీ  మినిస్ట్రీస్  స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో ఆదివారం కుష్టురోగులకు నూతన వస్త్రాలు, నిత్యావసర వస్తువులతో పాటుగా ఆర్థిక సహాయాన్ని  కూడా ఆయన అందజేశారు. పాస్టర్ మట్లపూడి జోషి దైవప్రార్ధన నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.సమావేశానికి సంస్థ డైరెక్టర్ ప్రదీప్ దోనేపూడి  అద్యక్షత వహించారు.తమకున్నదాంట్లో లేనివారికి సాయం చెయ్యాలనే సంకల్పంతో  2002 నుండి పెన్నీ మినిస్ట్రీస్ స్వచ్ఛంద సేవాసంస్థ ఇప్పటి వరకు కుష్టురోగులకు,ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు,వితంతువులకు సహాయం చేస్తు 22 సంవత్సరాలు కొనసాగటo వెనుక  ఉన్నతమైన లక్ష్యం దాగివున్నదని  ప్రదీప్ దోనేపూడి తెలిపారు.ప్రాధమిక స్థాయిలో కుష్టు వ్యాధిని గమనించి, గుర్తించి తగిన చికిత్సను డాక్టర్ ద్వారా తీసుకోవలసిందిగా ఆయా రోగులకు ఆయన సూచించారు.కార్యక్రమoలో వివిధ ప్రాంతా...

పరిశోధనలు చేస్తేనే ఉజ్వల భవిత

పరిశోధనలు చేస్తేనే ఉజ్వల భవిత  ఐఐటీ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ సీ.శాస్త్రి  విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో వైభవంగా ముగిసిన అంతర్జాతీయస్థాయి కాన్ఫరెన్స్‌ టాలెంట్ ఎక్స్ ప్రెస్: గణిత రంగంలో పరిశోధనలు చేసిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని ఐఐటీ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ సీ.శాస్త్రి తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ సైన్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ విభాగంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మేథమ్యాటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ విభాగం ఆధ్వర్యంలో  ‘‘ ఎమర్జింగ్‌ ట్రెండ్స్‌ ఇన్‌ మేథమ్యాటిక్స్‌ అండ్‌ సైంటిఫిక్‌ కంప్యూటింగ్‌’’ అనే అంశంపై మూడు రోజుల పాటు హైబ్రిడ్‌ మోడ్‌లో నిర్వహించిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ను శనివారం వైభవంగా ముగించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐఐటీ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ సీ.శాస్త్రి మాట్లాడుతూ విభిన్న వర్గాల వినియోగదారులు, వారి అభిరుచులు, వారి అవసరాలను గుర్తించే క్రమంలో సమాచారాన్ని సేకరించడం... వాటిని క్రోడీకరించి వర్గీకరిస్తేనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని తెలిపారు. మేథమేటిక్స్, స్టాటిస్టిక్స్‌ రంగాలలో పరిశో...

నాడు దుర్గాభాయి దేశ్‌ముఖ్ నటించిన అనిత నేడు హోం మంత్రి

నాడు దుర్గాభాయి దేశ్‌ముఖ్.. నేటి హోం మంత్రి  అనిత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: తెనాలి, జూన్ 14: పెదరావూరు ఫిల్మ్ స్టూడియో తెనాలిలో నిర్మించిన " అంబేద్కర్ " లో దుర్గాభాయి దేశ్ ముఖ్ పాత్రలో నటించిన వంగలమూడి అనిత నేడు ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వంలో అత్యంత కిలకమైన హోంమంత్రి గా నియమితులయ్యారు. సినీ దర్శకుడు దిలీప్ రాజా శుక్రవారం మీడియతో మాట్లాడుతు అప్పట్లో మహిళాబిల్లును నాటి పార్లమెంటులో ప్రవేశ పెట్టమని న్యాయశాఖమంత్రి అంబేద్కర్‌ను కోరిన సన్నివేశాన్ని తెనాలిలోనే చిత్రీకరించానని చెప్పారు.అంబేద్కర్ పాత్రలో తెలుగుదేశం నేత వర్ల రామయ్య నటించగా దుర్గాభాయి దేశ్‌ముఖ్ పాత్రను అనిత పోషించారని ఆయన తెలిపారు. ప్రస్తుత కృష్ణాజిల్లా నందిగామ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య కుడా భగత్  సింగ్ సమకాలీకులు ప్రీతిలత వాడేకర్ పాత్రలో నటించారని దిలీప్ రాజా పేర్కొన్నారు.అంబేద్కర్ లాంటి చరిత్రకారుని జీవితాన్ని చిత్రీకరిస్తుoటే భాద్యతగల ప్రజాప్రతినిధులుగాఉండి కూడ తమ అమూల్యమైన సమయాన్ని అంబేద్కర్  షూటింగుకు కేటాయించి నటించడం  వెనుక సామాజిక భాద్యత ఉందని అభిప్రాయం వ్యక్తo చేశా...

తెనాలి నృత్య కళాకారిణి గ్రీష్మశ్రీ కు త్రిపుర గవర్నర్ సత్కారం

తెనాలి నృత్య కళాకారిణి గ్రీష్మశ్రీ కు త్రిపుర గవర్నర్ సత్కారం   టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: తెనాలి, జూన్ 13: తెనాలికి చెందిన  కూచిపూడి నృత్య కళాకారిణి చిరంజీవి గ్రీష్మ శ్రీ(8)ను త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి గురువారo హైదరాబాద్ రాజ్‌భవన్‌లో సత్కరించారు. చిన్న వయసులోనే గజ్జల సవ్వడికి తగిన విధంగా గ్రీష్మశ్రీ హావభావాలను ప్రదర్శించినట్లుగా తెలియజేస్తు గ్రీష్మశ్రీను గవర్నర్ ప్రశంసించి ఆశీర్వదించారని గ్రీష్మశ్రీ తల్లి శెవ్వ అరుణ కుమారి ,తండ్రి శెవ్వా కృష్ణారెడ్డిలు తెలిపారు. గ్రీష్మశ్రీ స్థానిక అరబిందో స్కూల్ లో విద్యార్ధి కాగా తండ్రి శెవ్వా కృష్ణారెడ్డి స్థానిక కొత్తపేటలోని మునిసిపల్ ఉన్నత  పాఠశాలలో  ఉపాధ్యాయుడుగా  విధులను నిర్వహిస్తున్నారు.త్రిపుర గవర్నర్ ను కలిసిన వారిలో గ్రీష్మశ్రీ అన్నయ్య అరవింద్ రెడ్డి కూడా ఉన్నారు. గ్రీష్మశ్రీ గతంలో కర్ణాటక రాజ్‌భవన్ లో  గవర్నర్  థవార్‌చంద్  గెహ్లాట్,హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయల ముందు నృత్య ప్రదర్శనలు చేసి ఇద్దరు గవర్నర్ల నుండి గ్రీష్మశ్రీ సత్కారం అందు కున్నారని తండ్రి శెవ్వా ...

గంజాయి రహిత గుంటూరుగా మార్చండి

గంజాయి రహిత గుంటూరుగా మార్చండి ఎస్పికి పెమ్మసాని సూచన టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: గుంటూరును గంజాయి రహితంగా మార్చాలని ఈమేరకు 100 రోజుల్లో గంజాయి అనే మాట గుంటూరు పార్లమెంట్ పరిధిలో వినపడకూడదు, కనపడకూడదని ఈమేరకు తగిన కార్యచరణ రూపొందించాలని గుంటూరు లోక్సభ సభ్యుడు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు. ఈమేరకు బుధవారం రాత్రి ఆయన ఎస్పితో ఫోన్ లో మాట్లాడారు. గుంటూరుతో సహా పార్లమెంట్ పరిధిలోని ఎన్నో ప్రాంతాల్లో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు, కొనుగోళ్ళు పెరిగిపోయాయని, ఫలితంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని

కేంద్ర సహాయ మంత్రిగా పెమ్మసాని బాధ్యతలు స్వీకరణ

* కేంద్ర సహాయ మంత్రిగా పెమ్మసాని బాధ్యతలు స్వీకరణ * టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:  ప్రజా సేవకు అవకాశం కల్పించిన నరేంద్ర మోడీ, చంద్రబాబుకు కృతజ్ఞతలు : పెమ్మసాని 'ప్రజలు, నాయకుల అంచనాలకు తగిన విధంగా పనిచేస్తాను. ప్రజా సమస్యలను పరిష్కరించే ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టను.' అని గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ కేంద్ర సహాయక మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఢిల్లీలోని స్థానిక సంచార్ భవన్ లో కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రిగా గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలోకి అడుగుపెట్టిన పెమ్మసాని సంబంధిత అధికారులు ఆత్మీయంగా ఆహ్వానించారు. బాధ్యత స్వీకరణ అనంతరం అధికారులతో ఆయన మాట్లాడుతూ శాఖ పరమైన వివరాలు కార్యాలయ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే క్రమంలో అందరి సహకారం ఉండాలని, మన మేధస్సును రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఉపయోగించాలని అధికారులతో మాట్లాడుతూ కోరారు. అనంతరం పెమ్మసాని మాట్లాడుతూ తనను, తన వ్యక్తిత్వాన్ని నమ్మి ఇంతటి బాధ్యతను అప్పగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబా...

ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా కూటమి శ్రేణుల సంబరాలు

ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా కూటమి శ్రేణుల సంబరాలు   టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: తెనాలి : కూటమి అధికారం లోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భం గా రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొందని రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ అన్నారు.స్థానిక బస్టాండ్ ఔట్ గేట్ బయట ఈగల్ రెస్టారెంట్ పక్కన ఉన్న కార్యాలయంలో సంబరాలు బాణాసంచా కాలుస్తూ పార్టీ నాయకులు ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్నారు బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ నాదెళ్ల మనోహర్ అనగాని సత్యప్రసాద్ మిగతా మంత్రులకు అభినందనలు తెలిపారు వీధి సారధ్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు నవ్యాంధ్రప్రదేశ్ నూతన ఉత్సాహంతో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని వారన్నారు ఐదు సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోని అమరావతి ప్రాంతం నేడు నూతన ఉత్తేజంతో అభివృద్ధి చెందుతుందని వారు అన్నారు తెలుగుదేశం నాయకులు కన్నెగంటి మురళీకృష్ణ కాకుమాను ఉపేంద్ర శ్రీనివాసరావు పావులూరు రాంబాబు ఆంజనేయులు ఎర్రగుంట్ల మహేష్ కాకుమాను నరేంద్ర ఆలపాటి కిరణ్ మేడూరు భాస్కరరా...

ఎంసెట్‌ ఫలితాల్లో విజ్ఞాన్‌ విద్యార్థుల ప్రభంజనం

ఎంసెట్‌ ఫలితాల్లో విజ్ఞాన్‌ విద్యార్థుల ప్రభంజనం టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ఎంసెట్‌ ఫలితాల్లో విజ్ఞాన్‌ జూనియర్‌ కాలేజీకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించి అందరికంటే ముందు వరుసలో నిలిచారని విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాలల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్‌ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌ జే.మోహన్‌రావు మాట్లాడుతూ వడ్లమూడిలోని విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాలకు చెందిన ఐ . హనీత్ (387), టీ. సంజయ్ తేజ ( 494), ఏ. రోహన్ (904), సీ. రేవంత్ (957), పీ. అమర లోకేష్ (1015), పీ. గౌతమ్ ( 1195), కే.కారుణ్య ( 1206), ఎం. నాగ సాయి ప్రకాష్ ( 1219), బీ. యోగ విజయ్ కుమార్ ( 1369), సిహెచ్. వెంకట ఉదయ్ ఆదిత్య (1377), కే. దక్షిణ్ (1777), ఎం. వివేక్ పూజిత్ కుమార్ (1964) ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు. ప్రణాళికబద్ధమైన విద్యాబోధన వల్లనే అన్ని పోటీ పరీక్షల్లో తమ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధిస్తున్నారని వెల్లడించారు. 47 ఏళ్లకుపైగా అనుభవం, అవగాహనతో తాము విద్యార్థుల...

గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రిగా పెమ్మసాని

గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రిగా  పెమ్మసాని టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ నుంచి ప్రమాణ స్వీకారం చేసిన వారికి కేంద్రం శాఖలు కేటాయించింది. సహాయమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖలను అప్పగించింది.. 
' పెమ్మసాని చంద్రశేఖర్ అనే నేను..* + కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పెమ్మసాని + ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము + ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబుకు నమస్కరించిన పెమ్మసాని 'డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అనే నేను.. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని' అంటూ గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థిగా భారీ మెజారిటీతో విజయం నమోదు చేసిన పెమ్మసాని చంద్రశేఖర్ గారు రాష్ట్రపతి భవన్ ముంగిట ఏర్పాటుచేసిన ప్రమాణ స్వీకార వేదికపై కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం ఆదివారం చేశారు.  ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఏడు దేశాల అధ్యక్షులు, దేశ, రాష్ట్ర నాయకుల సాక్షిగా ఆయన ఈ ప్రమాణస్వీకారం నిర్వహించారు. ప్రమాణ స్వీకారం అనంతరం డాక్టర్ పెమ్మసాని స్పందిస్తూ చంద్రబాబు నాయుడు వైపు చూస్తూ కృతజ్ఞతకొద్దీ ఆయనకు పెమ్మసాని నమస్కరించారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసినంత సేపు యావత్ గుంటూరు పార్లమెంటు ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయన ఎప్పుడ...

ఇకపై ప్రతి కళాకారునికి భరోసా

ఇకపై ప్రతి కళాకారునికి భరోసా   - స్టార్ సినీ రైటర్ బుర్రా సాయి మాధవ్ -పట్టణ రంగస్థల కళాకారుల సంఘ కార్యవర్గం ఏకగ్రీవం టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:తెనాలి: 09-06-2024: ఇకపై తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం లో ప్రతి సభ్యునికి భరోసా వుంటుందని స్టార్ సినీ రైటర్ బుర్ర సాయి మాధవ్ హామీ ఇచ్చారు. తెనాలి కళా వైభవాన్ని సంఘం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం సర్వసభ్య సమావేశం ఆదివారం ఉదయం స్థానిక బుర్రిపాలెంరోడ్డు బి.సి. కాలనీలోని సంఘ భవనంలో ఆదివారం ఉదయం సంఘ మాజీ ప్రధాన కార్యదర్శి గరికపాటి సుబ్బారావు అధ్యక్షతన జరిగింది. గత కార్యవర్గం పదవీకాలం అయిదు సంవత్సరాలు ముగియడంతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటున్నట్లు సంఘంలోని మాజీ కార్యవర్గ సభ్యులు  ప్రకటించారు. ఎన్నికలు జరపడం వల్ల డబ్బు చాలా ఖర్చు జరుగుతుందని, ఏకగ్రీవంగా ఎన్నికోవడం వల్ల ఆ ధనాన్ని సంఘానికి వినియోగించ వచ్చునని సాయి మాధవ్ బుర్రా సూచించారు. ఎన్నికల అధికారిగా కాకతీయ కో-ఆపరేటివ్ సొసైటీ ఛైర్మన్ డి. కాంతారావు వ్యవహరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సినీ మాటల రచయి...

టిడిపికి రెండు కేంద్రమంత్రి పదవులు?

టిడిపికి రెండు కేంద్రమంత్రి పదవులు? టీడీపీకి రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. కేంద్ర కేబినేట్ కూర్పుపై కసరత్తులు చేసిన BJP ఏపీకి రెండు పదవులను ఖరారు చేసింది. కేంద్ర మంత్రులుగా రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ను ఫిక్స్ చేశారు. రామ్మోహన్ నాయుడుకు కేబినేట్ హోదా కల్పించగా పెమ్మసానికి కేంద్ర సహాయ మంత్రి పదవిని కేటాయించినట్లు ఢిల్లీ వర్గాలు వెల్లడించాయి.

స్వయంకృషికి తొలి సంతకం రామోజీరావు

స్వయంకృషికి తొలి సంతకం రామోజీరావు .. -మా-ఎపి' దిలీప్ రాజా టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: తెనాలి: జూన్ 8 : స్వయం కృషికి తొలిసంతకం రామోజీ రావు అని 'మా - ఎపి' వ్యవస్థాపక అధ్యక్షుడు, సినీ దర్శకుడు దిలీప్ రాజా అన్నారు.స్థానిక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఆంధ్ర ప్రదేశ్ కార్యాలయంలో  రామోజీ రావు సంతాప సభ నిర్వహించారు.   తెలుగు రాజకీయాలపై తిరుగులేని పట్టు సాధించిన సినీనిర్మాత, రామోజీఫిలిమ్ సిటీ అధిపతి, ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీ రావు చిరస్మరణీయుడు అని నివాళులర్పించారు. నటుడు మిలటరీ ప్రసాద్ అధ్యక్షత వహించారు. జర్నలిజం, సాహిత్యం, సినిమా, విద్యా రంగాల్లో రామోజీరావు చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం 2016లో భారతదేశపు అత్తున్నత ద్వితీయ పురస్కారం 'పద్మవిభూషణ్' అందించి దేశం ఆయనను సముచితంగా గౌరవించిందని దిలీప్ రాజా చెప్పారు. హాలీవుడ్ స్థాయిలో నెలకొల్పిన రామోజీ ఫిలిమ్ సిటీని గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు కావడం తెలుగువారందరూ గర్వించదగిన అంశమన్నారు. క్రమశిక్షణ, వ్యాపార శైలిలో నూతన ఒరవడి, పట్టుదల లాంటి ఆయుధాలతో రామోజీరావు అభివృద్ధి అంచుల వరకు ఎదిగారనడంలో ...

వ్యాపార పటిమకు నిలువుటద్దం రామోజీ రావు

వ్యాపార పటిమకు నిలువుటద్దం రామోజీ రావు   - సినీ నట దర్శక నిర్మాత విజయ్ వర్మ  టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: మీడియా , సినీ రంగాలతో పాటు, పాలు పచ్చళ్ళు ఐనా వ్యాపారం అంటే ఇలా క్రమబద్ధంగా చెయ్యాలి అని చేసి చూపించిన దార్శినికుడు రామోజీరావు అని, అలాగే సినీ పాత్రికేయ రంగాలలో తనదైన దారిలో రాణించి ఎందరికో ఉపాధి ఇచ్చారని, క్రమశిక్షణ, పట్టుదల , భావిభవిస్యత్  విషయంలో ఆయన ఎందరికో ఆదర్శవంతులని సినీ నట దర్శక నిర్మాత, సంఘ సేవకులు విజయ్ వర్మ పాకలపాటి తెలియజేసారు.ఈ సందర్భంగా రామోజీరావు కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు

దార్శనికుడు రామోజీ కి నివాళి

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: తెలుగు భాషకు కొత్త ఊపిరిపోసి పత్రికారంగాన్ని సరికొత్తగా మలిచిన మార్గదర్శి రామోజీ మరణం తీరని లోటు. వ్యాపార రంగాన్ని ఖండాంతరాలు దాటించి తెలుగు వారి ఉనికిని ఉన్నతంగా నిల బెట్టిన దార్శనికుడు రామోజీ కి నివాళి. - ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి

నరసరావుపేట టిడిపి ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు కు అభినందనలు

నరసరావుపేట టిడిపి ఎమ్మెల్యే చదలవాడ  అరవింద బాబు కు అభినందనలు తెలియజేసిన  ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్. నరసరావుపేట  జులై 7: ఇటీవల జరిగిన 2024 జనరల్ ఎలక్షన్లలో నరసరావుపేట నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీచేసిన చదలవాడ అరవింద్ బాబు ఘనవిజయం సాధించారు.. ఈ విజయాన్ని పురస్కరించుకొని ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్  స్టేట్ అడిషనల్ జనరల్ సెక్రటిరీ యస్. గురుబ్రహ్మం ఆధ్వర్యంలో అరవింద బాబు కు మెమొంటో బహుకరించి శాలువాతో ఘన సత్కారం చేశారు.ఏపీ ఎలక్ట్రిసిటి స్టాఫ్ &వర్కర్స్ యూనియన్  సి.పి డి.సి.ల్  యూనిట్  సెక్రటరీ  యం శ్రీకాంత్, సెక్రటరీ కె.ప్రవీణ్,  యూనియన్ నాయకులు యస్. వెంకట్  పల్నాడు జిల్లా ప్రెసిడెంట్ యస్.ప్రసన్నకుమార్, ట్రెజరర్ యస్.గిరిబాబు, అడిషనల్ సెక్రటరీ టి.శివ నారాయణ జనరల్ సెక్రటరీ , sk. అబూబకర్ఆఫీస్ సెక్రటరీ SK. కరీముల్లా, గంగాధర్ రావు, SK, రఫి యాసీన్ పి వెంకట రాయుడు, D. సుభాని, మీటర్ రీడర్స్ జనరల్ సెక్రటరీ A. శివ సాయి,  శ్రీనివాస్ రెడ్డి, రాధా కృష్ణ,  షఫీ కార్యక్రమంలో పాల్గొన్నా...

నాదెళ్ల మనోహర్ కు అభినందన

నాదెళ్ల మనోహర్ కు అభినందన   తెనాలి : జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ మాజీ శాసనసభాపతి నూతన శాసనసభ్యులు నాదెళ్ల మనోహర్ కు అభినందన వెలుగుతున్నాయి తెనాలి నుండి అత్యధిక మెజారిటీతో గెలుపొంది శాసనసభలో అడుగుపెడుతున్న తరుణంలో పలువురు నాయకులు కార్యకర్తలు అభినందనలతో ముంచుతున్నారు తెలుగుదేశం రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి. ఈదర వెంకట పూర్ణచంద్ గురువారం తన అనుచరులతో కలిసి నాదెండ్ల మనోహర్ కు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనోహర్ గారి ఆధ్వర్యంలో తెనాలి మరింత అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు అంతేకాకుండా మంత్రివర్గంలో కూడా కీలక పదవిని పొందుతారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఈదర శ్రీనివాసరావు కాకుమాను ఉపేంద్ర గుమ్మడి ప్రసాద్ జెడి శివరామరాజు ఉన్నారు

మనోహర్ కు అభినందనలు తెలిపిన ఏపి వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యులు

మనోహర్ కు అభినందనలు తెలిపినఏపి వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యులు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: తెనాలి: జనసేన  పార్టీ పి. ఎ. సి చైర్మన్, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల శాసనసభ మాజీ సభాపతి, తెనాలి శాసన సభ్యులు నాదెండ్ల మనోహర్ ను అంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ సభ్యులు కలసి అభినందించారు. బుధవారం సాయంత్రం జరిగిన కార్యక్రమం లో ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు కనపర్తి రత్నాకర్, తెనాలి డివిజన్ ఫెడరేషన్ అధ్యక్షులు పుట్ట పున్నయ్య, కార్యదర్శి ఎస్.ఎస్. జహీర్, ఉపాధ్యక్షులు అచ్యుత సాంబశివరావు, వేమూరు ఫెడరేషన్ నాయకులు రామకృష్ణ, పొన్నూరు ఫెడరేషన్ నాయకులు రమేష్, నాయకులు డి. కోటేశ్వరరావు, ఎం. శ్రీకాంత్, డి. నాగరాజు, నాయుడు తదితరులు పాల్గొన్నారు. తెనాలి ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని, జర్నలిస్టుల సూచనలు, సలహాలు అవసరవని మనోహర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

వెండితెర వెలుగు రామానాయుడు

వెండితెర వెలుగు రామానాయుడు —' మా-ఎపి' దిలీప్ రాజా . టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్,తెనాలి: జూన్ 6:  వెండితెరకు వెలుగులు నింపిన మహనీయుడు స్వర్గీయ రామానాయుడు అని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఆంధ్ర ప్రదేశ్ వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీప్ రాజా చెప్పారు. స్థానిక మా - ఎపి' కార్యాలయంలో గురువారం మూవీ మొఘల్, దాదా సాహెబ్ ఫాల్కేఅవార్డు గ)హీత, శతచిత్రాల నిర్మాత డాక్టర్ దగ్గుపాటి రామానాయుడు 88వ జయంతి వేడుకలు జరిగాయి. ప్రపంచ చలన చిత్ర చరిత్రలో అయిదు దశాబ్దాలుగా సినీపరిశ్రమ కు ఎనలేని చేసి 15 భాషల్లో 155 సినిమాలను నిర్మించిన ఏకైక వ్యక్తి రామానాయుడు అని దిలీప్ రాజా పేర్కొన్నారు. రామానాయుడు స్వీయ నిర్మాణ సంస్థ అయిన సురేష్ ప్రొడక్షన్ లో 24 మంది నూతన దర్శకులను 12 మంది టాప్ హీరోయిన్లను పరిచయం అయ్యారని ఆయన వివరించారు. భారత ప్రభుత్వం రామానాయుడు సేవకు గుర్తింపుగా 2012లో నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ద్వారా పద్మ భూషణ్ ద్వారా అందుకోవడమే కాకుండా రఘుపతి వెంకయ్య లాంటి ప్రతిష్టాత్మక అవార్డులు ఆయన సొంతమయ్యాయని తెలిపారు. రామానాయుడు నిర్మించిన సినిమాల్లో ఎన్టీఆర్, అక్కినేని,, శోభన్ ...

అమరావతి: ఏపీ అసెంబ్లీ రద్దు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్

* అమరావతి: ఏపీ అసెంబ్లీ రద్దు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్ *  టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: *సీఎం రాజీనామాతో 15 వ అసెంబ్లీ రద్దు చేసిన గవర్నర్.*

ఎన్డీఏ ముందు రెండు ఆప్షన్స్.... పక్కా ప్లానింగ్ తో చంద్రబాబు

ఎన్డీఏ ముందు రెండు ఆప్షన్స్.... పక్కా ప్లానింగ్ తో చంద్రబాబు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: బీజేపీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో.. ఢిల్లీలో పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్డీఏకి 292 సీట్లు రాగా, ఇండియా కూటమి 234 స్థానాలు దక్కించుకుంది. ఎన్డీఏలో టీడీపీకి 16, జేడీయూకి 12 మంది ఎంపీల బలం ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈ రెండు పార్టీలు ఇప్పుడు కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో కీలక భూమిక పోషించనున్నాయి. ఇక తాము NDAతోనే ఉన్నామని స్పష్టం చేశారు చంద్రబాబు, నితీష్‌. కాగా ఇక్కడ రెండు ఆప్షన్లను పరిశీలిస్తుంది టీడీపీ. ఆప్షన్‌ 1 : కేంద్రంలో చేరి 5-6 మంత్రి పదవులు అడగటం, ఆప్షన్‌-2 : స్పీకర్‌ పదవి తీసుకుని, బయటినుంచి మద్దతు ఇవ్వడం. దీంతో సాయంత్రం జరిగే ఎన్డీయే మీటింగ్‌పై ఉత్కంఠత ఏర్పడింది. NDA కూటమిలో బలమైన పక్షంగా టీడీపీ ఉంది. దీంతో తెలుగుదేశం 5-6 మంత్రి పదవులు అడగొచ్చని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఒకవేళ మంత్రి పదువులు తీసుకుంటే… పోలవరం కోసం జలశక్తి శాఖ అడిగే అవకాశం ఉంది. అలానే ఆరోగ్యశాఖ, వ్యవసాయశాఖ, కేంద్ర ఆర్థికశాఖపైనా టీడీపీ కన్ను ఉన్నట్లు తెలుస్తోంది. అటు జేడీయూ సైతం కేబినెట్‌లో తమకు ...

తెనాలి నియోజకవర్గ ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలిపిన మనోహర్

  తెనాలి నియోజకవర్గ ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలిపిన మనోహర్   టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: మూడోసారి తనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న తెనాలి నియోజకవర్గ ప్రజానీకానికి నాదెండ్ల మనోహర్ కృతజ్ఞతలు తెలిపారు.  ఉమ్మడి రాష్ట్రాల మాజీ సభాపతి,జనసేన పీఏసీ చైర్మన్, తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపి, స్వేచ్ఛగా మాట్లాడే వారిపై కేసులు పెట్టి, ఇబ్బందులు పాలు చేశారని అన్నారు. తమ పార్టీ అధినేత, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా,వారి ఇబ్బందులను తెలుసుకుని అండగా ఉన్నామని,అన్నారు. ఆస్పత్రుల్లో సరైన వైద్యం లేదని, ప్రజా జీవితంలో ప్రజలు కోరుకున్న విధంగా నాయకులు నేర్చుకోవాల్సింది మంచి పరిపాలన అందించాలని ఆశిస్తారని, తమ నాయకత్వం మీద నమ్మకం ఉంచి అద్భుతమైన మెజార్టీ అందించి, తమకు బరువు బాధ్యతలు పెంచారని అన్నారు. ఇంత సుదీర్ఘమైన తమ ప్రయాణాన్ని దేవుడు ఆశీర్వదించారని, ప్రజలు కోరుకున్నట్టుగా లా అండ్ ఆర్డర్ సక్రమంగా పనిచేసే విధంగా అలాగే గంజాయిని పూర్తిగా నిర్మూలించే విధంగా, పనిచేస్తామన్నారు. తమ మె...