ఇకపై ప్రతి కళాకారునికి భరోసా

ఇకపై ప్రతి కళాకారునికి భరోసా 
- స్టార్ సినీ రైటర్ బుర్రా సాయి మాధవ్
-పట్టణ రంగస్థల కళాకారుల సంఘ కార్యవర్గం ఏకగ్రీవం
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:తెనాలి: 09-06-2024: ఇకపై తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం లో ప్రతి సభ్యునికి భరోసా వుంటుందని స్టార్ సినీ రైటర్ బుర్ర సాయి మాధవ్ హామీ ఇచ్చారు. తెనాలి కళా వైభవాన్ని సంఘం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం సర్వసభ్య సమావేశం ఆదివారం ఉదయం స్థానిక బుర్రిపాలెంరోడ్డు బి.సి. కాలనీలోని సంఘ భవనంలో ఆదివారం ఉదయం సంఘ మాజీ ప్రధాన కార్యదర్శి గరికపాటి సుబ్బారావు అధ్యక్షతన జరిగింది. గత కార్యవర్గం పదవీకాలం అయిదు సంవత్సరాలు ముగియడంతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటున్నట్లు సంఘంలోని మాజీ కార్యవర్గ సభ్యులు  ప్రకటించారు. ఎన్నికలు జరపడం వల్ల డబ్బు చాలా ఖర్చు జరుగుతుందని, ఏకగ్రీవంగా ఎన్నికోవడం వల్ల ఆ ధనాన్ని సంఘానికి వినియోగించ వచ్చునని సాయి మాధవ్ బుర్రా సూచించారు. ఎన్నికల అధికారిగా కాకతీయ కో-ఆపరేటివ్ సొసైటీ ఛైర్మన్ డి. కాంతారావు వ్యవహరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సినీ మాటల రచయిత డాక్టర్ సాయి మాధవ్ సంఘ కమిటీ ఆహ్వానం మేరకు పాల్గొన్నానని సాయి మాధవ్ తెలిపారు. సభ్యులందరి  ఆమోధం తో నూతన కమిటీని అప్పటికప్పుడే ప్రకటించి కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కార్యవర్గం లో   బుఱ్ఱా జయలక్ష్మి (అధ్యక్షులు), ఆరాధ్యుల కోటేశ్వరరావు (గౌరవ అధ్యక్షుడు), గరికపాటి సుబ్బారావు (కార్యనిర్వాహక అధ్యక్షుడు), ఆరాధ్యుల ఆదినారాయణరావు (ప్రధాన కార్యదర్శి), ఎం.రామలింగేశ్వరరావు ( కార్యనిర్వాహక కార్యదర్శి), దీపాల సుబ్రహ్మమణ్యం (కోశాధికారి), ఉపాధ్యక్షులుగా శ్రీమతి బెజ్జంకి నాగమణి, శ్రీమతి నిర్మాలా రమేష్, పందిటి సుబ్బారావు, శరత్ వెంకయ్య, ముత్యాత లక్ష్మీ తులసి, సంయుక్త కార్యదర్శులుగా కనపర్తి మధుకర్, గోగినేని సుధీర్, మహబూబ్ సుభాని ఎంపిక కాగా కార్యవర్గ నూతన సభ్యులుగా బడుగు మోహనరావు, గోళ్ళ సుబ్రహ్మణ్యం, కొండమూది రమేష్, ఎస్.కె. షైదా, శ్రీమతి వేములవాడ సత్యవతి ఎంపికయ్యారు. క్రమశిక్షణా కమిటీ సభ్యులుగా డాక్టర్ సాయిమాధవ్ బుర్రా, చెరుకుమల్లి సింగారావు, షేక్ జానిబాషా, న్యాయ సలహాదారుగా హరిదాసు గౌరీశంకర్, గౌరవ సలహాదారుగా ఉప్పాల రాజేశ్వరరావు, అయినాల మల్లేశ్వరరావు, టి.వి.ఎస్. శాస్త్రి, కనపర్తి బాబురావు, గోగినేని కేశవరావు, బొల్లిముంత కృష్ణ, చిట్లూరి సీతారామయ్య ఏకగ్రీకంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సాయిమాధవ్ బుర్రా మాట్లాడుతూ పట్టణ రంగస్థల సంఘ కళాకారుల సంక్షేమం, అభివృద్ధి కోసం సాయశక్తులా కష్టపడి పనిచేస్తానని ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, కళాకారులు పాల్గొన్నారు.