తెనాలి నృత్య కళాకారిణి గ్రీష్మశ్రీ కు త్రిపుర గవర్నర్ సత్కారం

తెనాలి నృత్య కళాకారిణి గ్రీష్మశ్రీ కు త్రిపుర గవర్నర్ సత్కారం 
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెనాలి, జూన్ 13: తెనాలికి చెందిన  కూచిపూడి నృత్య కళాకారిణి చిరంజీవి గ్రీష్మ శ్రీ(8)ను త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి గురువారo హైదరాబాద్ రాజ్‌భవన్‌లో సత్కరించారు. చిన్న వయసులోనే గజ్జల సవ్వడికి తగిన విధంగా గ్రీష్మశ్రీ హావభావాలను ప్రదర్శించినట్లుగా తెలియజేస్తు గ్రీష్మశ్రీను గవర్నర్ ప్రశంసించి ఆశీర్వదించారని గ్రీష్మశ్రీ తల్లి శెవ్వ అరుణ కుమారి ,తండ్రి శెవ్వా కృష్ణారెడ్డిలు తెలిపారు. గ్రీష్మశ్రీ స్థానిక అరబిందో స్కూల్ లో విద్యార్ధి కాగా తండ్రి శెవ్వా కృష్ణారెడ్డి స్థానిక కొత్తపేటలోని మునిసిపల్ ఉన్నత  పాఠశాలలో  ఉపాధ్యాయుడుగా
 విధులను నిర్వహిస్తున్నారు.త్రిపుర గవర్నర్ ను కలిసిన వారిలో గ్రీష్మశ్రీ అన్నయ్య అరవింద్ రెడ్డి కూడా ఉన్నారు.
గ్రీష్మశ్రీ గతంలో కర్ణాటక రాజ్‌భవన్ లో  గవర్నర్ 
థవార్‌చంద్  గెహ్లాట్,హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయల ముందు నృత్య ప్రదర్శనలు చేసి ఇద్దరు గవర్నర్ల నుండి గ్రీష్మశ్రీ సత్కారం అందు కున్నారని తండ్రి శెవ్వా కృష్ణారెడ్డి తెలిపారు. ఎనిమిది సంవత్సరాల గ్రీష్మ శ్రీ  తెనాలికి చెందిన నృత్య గురువు నిర్మల రమేష్ వద్ద కూచిపూడి నృత్యం లో శిక్షణ తీసుకుoటున్నట్లుగా తల్లితండ్రులు వివరించారు.

ఫోటో రైటప్:
  గ్రీష్మశ్రీ ను సత్కరిస్తున్న త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి