ఎమ్మెల్యే విజయ చంద్ర ' మా- ఎపి' సభ్యులే

ఎమ్మెల్యే విజయ చంద్ర ' మా- ఎపి' సభ్యులే  - 
-సినీదర్శకులు దిలీప్ రాజా 
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెనాలి, జూన్ 22 : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ,ఆంధ్ర ప్రదేశ్ లో సభ్యుడైన విజయ చంద్ర విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గo శాసనసభ్యుడిగా గెలుపొందారని 'మా - ఎపి' వ్యవస్థాపకులు, సినీ దర్శకుడు దిలీప్ రాజా చెప్పారు.స్థానిక 'మా- ఎపి' కార్యాలయంలో శనివారం ఏర్పటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పార్వతీపురం ఎమ్మెల్యే విజయ చంద్ర నిర్మాణంలో ఉన్న బాబు జగజ్జీవన్ రామ్ బయోపిక్ "బాపూజీ'లో  ప్రాముఖ్యం ఉన్న పాత్రలో నటిస్తున్నారని తెలిపారు.అసెంబ్లీలో శనివారం ఎమ్మెల్యే విజయచంద్రను కలసి అభినందించిన అనంతరo ' మా - ఏపి' జ్ఞాపికను అందజేసినట్లుగా ఆయన పేర్కొన్నారు.నటుడు మిలటరీ ప్రసాద్  మాట్లాడుతూ ఎమ్మెల్యే విజయ చంద్ర మంచి టైమింగ్ ఉన్న  ఆర్టిస్ట్ అని కొనియాడా రు.శాసన సభ బడ్జెట్ సమావేశాలు జరిగే సమయంలో తెనాలి వచ్చి' మా - ఎపి ' సభ్యులను  ఎమ్మెల్యే విజయ చంద్ర కలుసుకుoటా రని  తెలిపారు.కార్యక్రమములో సహాయ దర్శకుడు వెంకీ రావణ్,అయినంపూడి  రాకేష్ పాల్గోన్నారు.