ఎంసెట్‌ ఫలితాల్లో విజ్ఞాన్‌ విద్యార్థుల ప్రభంజనం

ఎంసెట్‌ ఫలితాల్లో విజ్ఞాన్‌ విద్యార్థుల ప్రభంజనం
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
ఎంసెట్‌ ఫలితాల్లో విజ్ఞాన్‌ జూనియర్‌ కాలేజీకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించి అందరికంటే ముందు వరుసలో నిలిచారని విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాలల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్‌ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌ జే.మోహన్‌రావు మాట్లాడుతూ వడ్లమూడిలోని విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాలకు చెందిన ఐ . హనీత్ (387), టీ. సంజయ్ తేజ ( 494), ఏ. రోహన్ (904), సీ. రేవంత్ (957), పీ. అమర లోకేష్ (1015), పీ. గౌతమ్ ( 1195), కే.కారుణ్య ( 1206), ఎం. నాగ సాయి ప్రకాష్ ( 1219), బీ. యోగ విజయ్ కుమార్ ( 1369), సిహెచ్. వెంకట ఉదయ్ ఆదిత్య (1377), కే. దక్షిణ్ (1777), ఎం. వివేక్ పూజిత్ కుమార్ (1964)
ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు. ప్రణాళికబద్ధమైన విద్యాబోధన వల్లనే అన్ని పోటీ పరీక్షల్లో తమ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధిస్తున్నారని వెల్లడించారు. 47 ఏళ్లకుపైగా అనుభవం, అవగాహనతో తాము విద్యార్థులను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఉత్తమ ర్యాంకులతో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు విజ్ఞాన్‌ విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ లావు రత్తయ్య, విజ్ఞాన్‌ విద్యాసంస్థల ఉపాధ్యక్షుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాళ్లు జె.మోహన్‌రావు, వై.వెంకటేశ్వరరావు, విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాలల సిబ్బంది అభినందనలు తెలిపారు.