ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా కూటమి శ్రేణుల సంబరాలు

ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా కూటమి శ్రేణుల సంబరాలు 
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెనాలి : కూటమి అధికారం లోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భం గా రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొందని రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ అన్నారు.స్థానిక బస్టాండ్ ఔట్ గేట్ బయట ఈగల్ రెస్టారెంట్ పక్కన ఉన్న కార్యాలయంలో సంబరాలు బాణాసంచా కాలుస్తూ పార్టీ నాయకులు ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్నారు బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ నాదెళ్ల మనోహర్ అనగాని సత్యప్రసాద్ మిగతా మంత్రులకు అభినందనలు తెలిపారు వీధి సారధ్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు నవ్యాంధ్రప్రదేశ్ నూతన ఉత్సాహంతో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని వారన్నారు ఐదు సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోని అమరావతి ప్రాంతం నేడు నూతన ఉత్తేజంతో అభివృద్ధి చెందుతుందని వారు అన్నారు తెలుగుదేశం నాయకులు కన్నెగంటి మురళీకృష్ణ కాకుమాను ఉపేంద్ర శ్రీనివాసరావు పావులూరు రాంబాబు ఆంజనేయులు ఎర్రగుంట్ల మహేష్ కాకుమాను నరేంద్ర ఆలపాటి కిరణ్ మేడూరు భాస్కరరావు తిరుమల శెట్టి సత్యనారాయణ గుమ్మడి ప్రసాద్ గిరి తదితరులు పాల్గొన్నారు.