నాడు దుర్గాభాయి దేశ్‌ముఖ్ నటించిన అనిత నేడు హోం మంత్రి

నాడు దుర్గాభాయి దేశ్‌ముఖ్.. నేటి హోం మంత్రి  అనిత
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెనాలి, జూన్ 14: పెదరావూరు ఫిల్మ్ స్టూడియో తెనాలిలో నిర్మించిన " అంబేద్కర్ " లో దుర్గాభాయి దేశ్ ముఖ్ పాత్రలో నటించిన వంగలమూడి అనిత నేడు ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వంలో అత్యంత కిలకమైన హోంమంత్రి గా నియమితులయ్యారు. సినీ దర్శకుడు దిలీప్ రాజా శుక్రవారం మీడియతో మాట్లాడుతు అప్పట్లో మహిళాబిల్లును నాటి పార్లమెంటులో ప్రవేశ పెట్టమని న్యాయశాఖమంత్రి అంబేద్కర్‌ను కోరిన సన్నివేశాన్ని తెనాలిలోనే చిత్రీకరించానని చెప్పారు.అంబేద్కర్ పాత్రలో తెలుగుదేశం నేత వర్ల రామయ్య నటించగా దుర్గాభాయి దేశ్‌ముఖ్ పాత్రను అనిత పోషించారని ఆయన తెలిపారు. ప్రస్తుత కృష్ణాజిల్లా నందిగామ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య కుడా భగత్  సింగ్ సమకాలీకులు ప్రీతిలత వాడేకర్ పాత్రలో నటించారని దిలీప్ రాజా పేర్కొన్నారు.అంబేద్కర్ లాంటి చరిత్రకారుని జీవితాన్ని చిత్రీకరిస్తుoటే భాద్యతగల ప్రజాప్రతినిధులుగాఉండి కూడ తమ అమూల్యమైన సమయాన్ని అంబేద్కర్  షూటింగుకు కేటాయించి నటించడం  వెనుక సామాజిక భాద్యత ఉందని అభిప్రాయం వ్యక్తo చేశారు.