స్వయంకృషికి తొలి సంతకం రామోజీరావు

స్వయంకృషికి తొలి సంతకం రామోజీరావు..
-మా-ఎపి' దిలీప్ రాజా
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెనాలి: జూన్ 8 : స్వయం కృషికి తొలిసంతకం రామోజీ రావు అని 'మా - ఎపి' వ్యవస్థాపక అధ్యక్షుడు, సినీ దర్శకుడు దిలీప్ రాజా అన్నారు.స్థానిక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఆంధ్ర ప్రదేశ్ కార్యాలయంలో  రామోజీ రావు సంతాప సభ నిర్వహించారు.   తెలుగు రాజకీయాలపై తిరుగులేని పట్టు సాధించిన సినీనిర్మాత, రామోజీఫిలిమ్ సిటీ అధిపతి, ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీ రావు చిరస్మరణీయుడు అని నివాళులర్పించారు. నటుడు మిలటరీ ప్రసాద్ అధ్యక్షత వహించారు. జర్నలిజం, సాహిత్యం, సినిమా, విద్యా రంగాల్లో రామోజీరావు చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం 2016లో భారతదేశపు అత్తున్నత ద్వితీయ పురస్కారం 'పద్మవిభూషణ్' అందించి దేశం ఆయనను సముచితంగా గౌరవించిందని దిలీప్ రాజా చెప్పారు. హాలీవుడ్ స్థాయిలో నెలకొల్పిన రామోజీ ఫిలిమ్ సిటీని గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు కావడం తెలుగువారందరూ గర్వించదగిన అంశమన్నారు. క్రమశిక్షణ, వ్యాపార శైలిలో నూతన ఒరవడి, పట్టుదల లాంటి ఆయుధాలతో రామోజీరావు అభివృద్ధి అంచుల వరకు ఎదిగారనడంలో అతిశయోక్తి లేదని ఆయన కొనియాడారు. 1984లో శ్రీవారికి ప్రేమలేఖ, అనంతరం మయూరి, ప్రతిఘటన, మౌన పోరాటం, చిత్రం, మనసుమమత, నువ్వే కావాలి లాంటి ఎన్నో క్లాసిక్ ను రామోజీ నిర్మించారని గుర్తుచేశారు. ఆయన మరణం పట్ల 'మా- ఎపి’ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తుందన్నారు. ముందుగా రామోజీ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళలర్పించారు. కార్యక్రమంలో, నిర్మాత చదలవాడ హరిబాయి, సహాయ దర్శకుడు వెంకీ రావణ్, నటుడు వేమూరు విజయ భాస్కర్, ఇంటూరి విజయ భాస్కర్, మన్నె సత్యన్నారాయణ, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.