విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విద్యార్థినికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విద్యార్థినికి పీహెచ్‌డీ
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ సైన్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ విభాగంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌ విభాగానికి  చెందిన టీ.నాగమల్లేశ్వరి అనే విద్యార్థినికి తమ యూనివర్సటీ పీహెచ్‌డీ పట్టా అందించిందని వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ డోపింగ్‌ ఇండ్యూస్డ్‌ మోడిఫికేషన్‌ ఇన్‌ ఎన్నీల్డ్‌ జింక్‌ ఆక్సైడ్‌ నానోస్ట్రక్చర్స్‌: ఏ మల్టిఫేసిటెడ్‌ స్టడీ ఆన్‌ స్ట్రక్చరల్, ఆప్టికల్, మ్యాగ్నటిక్‌ అండ్‌ మెకానికల్‌ ప్రాపర్టీస్‌’’ అనే అంశంపై విద్యార్థిని పరిశోధన చేసిందని తెలియజేశారు. ఈమెకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌  ఫిజిక్స్‌ విభాగంలోని ప్రొఫెసర్‌ జాలాది నిశ్చల్‌ కిరణ్‌ గైడ్‌గా వ్యవహరించారని పేర్కొన్నారు. ఈమె తన పరిశోధనలో భాగంగా మొత్తం 1 స్కోపస్‌ ఇండెక్స్, 3 ఎస్‌సీఐ ఇండెక్డ్స్‌ జర్నల్‌లో పేపర్స్‌ పబ్లిష్‌ చేశారని తెలియజేసారు. డాక్టరేట్‌ పొందిన  టీ.నాగమల్లేశ్వరిని విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపకులు అభినందించారు.