వెండితెర వెలుగు రామానాయుడు

వెండితెర వెలుగు రామానాయుడు
—' మా-ఎపి' దిలీప్ రాజా
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్,తెనాలి: జూన్ 6: 
వెండితెరకు వెలుగులు నింపిన మహనీయుడు స్వర్గీయ రామానాయుడు అని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఆంధ్ర ప్రదేశ్ వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీప్ రాజా చెప్పారు. స్థానిక మా - ఎపి' కార్యాలయంలో గురువారం మూవీ మొఘల్, దాదా సాహెబ్ ఫాల్కేఅవార్డు గ)హీత, శతచిత్రాల నిర్మాత డాక్టర్ దగ్గుపాటి రామానాయుడు 88వ జయంతి వేడుకలు జరిగాయి. ప్రపంచ చలన చిత్ర చరిత్రలో అయిదు దశాబ్దాలుగా సినీపరిశ్రమ కు ఎనలేని చేసి 15 భాషల్లో 155 సినిమాలను నిర్మించిన ఏకైక వ్యక్తి రామానాయుడు అని దిలీప్ రాజా పేర్కొన్నారు. రామానాయుడు స్వీయ నిర్మాణ సంస్థ అయిన సురేష్ ప్రొడక్షన్ లో 24 మంది నూతన దర్శకులను 12 మంది టాప్ హీరోయిన్లను పరిచయం అయ్యారని ఆయన వివరించారు. భారత ప్రభుత్వం రామానాయుడు సేవకు గుర్తింపుగా 2012లో నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ద్వారా పద్మ భూషణ్ ద్వారా అందుకోవడమే కాకుండా రఘుపతి వెంకయ్య లాంటి ప్రతిష్టాత్మక అవార్డులు ఆయన సొంతమయ్యాయని తెలిపారు. రామానాయుడు నిర్మించిన సినిమాల్లో ఎన్టీఆర్, అక్కినేని,, శోభన్ బాబు లాంటి వారు హీరోలు గా ఎన్నో సూపర్ హిట్  సినిమాలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. రామానాయుడు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వర్ధమాన నటి టీనాచౌదరి, మా ఏపి సభ్యులు మిలటరీ ప్రసాద్, మన్నెసత్యనారాయణ, సహాయ దర్శకులు వెంకీ రావణ్, ఇంటూరి విజయ భాస్కర్,  మధుకర్  శ్రీకాంత్ తదితరు పాల్గొన్నారు.