విద్యాశాఖ ప్రోత్సాహం గ్రీష్మశ్రీకు ఉంటుంది

విద్యాశాఖ ప్రోత్సాహం గ్రీష్మశ్రీకు ఉంటుంది
 - ఆర్జేడి బి. లింగేశ్వరరెడ్డి 
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెనాలి మన బాల నృత్య కళాకారిణి గ్రీష్మశ్రీకు విద్యాశాఖ  ప్రోత్సాహం వుంటుందని పాఠశాలల ఆర్జేడీ బి. లింగేశ్వరరెడ్డి చెప్పారు. స్థానిక అరవింద విద్యా కేంద్రంలో బుధ వారం అభినందన సభ జరిగింది. సమావేశానికి శ్రీ అరవింద డైరెక్టర్ కొండపనేని సంపూర్ణ అధ్యక్షత వహించారు. గవర్నర్ల సత్కారం పొందిన ఎనిమిది సంవత్సరాల గ్రీష్మ శ్రీ గుంటూరు జిల్లా విద్యార్థిని కావడం జిల్లాగే గర్వకారణం అని లింగేశ్వర రెడ్డి అన్నారు. ప్రతిభను ప్రోత్సహించడంతో విద్యాశాఖ ముందుంటుందని ఆయన పేర్కొన్నారు. కేవలం నాలుగో తరగతి చదువుతూ కూచిపూడి నృత్యంలో విశేష ప్రతిభ చూపిన గ్రీష్మశ్రీను ఆయన సత్కరించారు. సినీ దర్శకుడు దిలీప్ రాజూ మాట్లాడుతూ ప్రోత్సాహం వుంటే  గమ్యం చేరడం ఎంతమాత్రం కష్టం కాదని గ్రీష్మశ్రీ నిరూపించిందన్నారు. ప్రతిభకు ప్రోత్సాహం తోడయితే విజయం అంచున విద్యార్థులు అధిరోహించగలరని ఆయన తెలిపారు . కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు ఆర్. నిర్మల కుమారి, నందిపాటి శివకుమారి, పాఠశాల సెక్రటరీ వై. మోహనరావు, కె. సంధ్య పాల్గొనగా మండల విద్య శాఖాధికారులు ఎం.లక్ష్మీనారాయణ, జయంత్ బాబులు పర్యవేక్షించారు. రోటరీక్లబ్ తరపున ఈదర పూర్ణచంద్, సినీనటులు వేమూరి విజయభాస్కర్, మన్నె సత్యన్నారాయణ, వెంకీ రావణ్ లు గ్రీషశ్రీ ను సత్కరించారు. కార్య క్రమంలో నాట్య గురువు నిర్మలా రమేష్ ను దుశ్శలువాతో పాఠశాల యాజమాన్యం సత్కరించారు, అలాగే గ్రీష్మ తల్లి అరుణ కుమారి, తండ్రి సెవ్వ కృష్ణ రెడ్డిలను ఆర్జేడీ అభినందించి సత్కరించారు.