మళ్ళీ శంషాబాద్‌లో చిరుత కలకలం?

మళ్ళీ శంషాబాద్‌లో చిరుత కలకలం?
హైదరాబాద్ :జూన్ 24
శంషాబాద్‌లో చిరుత పులి కలకలం సృష్టించింది. ఘన్సీమియాగూడ శివారు లోఈరోజు ఉదయం చిరుత సంచారం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. 
రెండు రోజుల క్రితం పొలంలో కుక్కలపై చిరుత దాడి చేసి చంపేసింది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు రైతులు. చిరుతను బంధించాలని కోరుతున్నారు. సీసీ కెమెరాల్లో కనిపించిన చిరుత జాడల్ని కనిపెట్టా లని కోరుతున్నారు. 
గ్రామంలో వ్యవసాయంపై అదారపడే తాము పొలం వెళ్లాలంటే అరచేతిలో ప్రాణాల్ని పెట్టుకొని వెళ్తున్నామని, వెంటనే అధికారులు సకాలంలో స్పందించి చిరుతను పట్టుకోవాలని కోరుతు న్నారు. కాగా, నెల రోజుల క్రితం శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు సమీపంలో చిరుతతో పాటు రెండు పిల్లలు ఎయిర్‌ పోర్టు లోపలికి ప్రవేశించేందుకు ప్రహరీ దూకేందుకు ప్రయత్నించాయి. అయితే ఫెన్సింగ్‌ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్‌ పోర్ట్‌ కంట్రోల్‌ రూం అలారం మోగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే చిరుతను, దాని పిల్లల్ని బందించారు. ఆ సంఘటన మరువక ముందే మళ్ళీ చిరుత అనవాళ్లు గుర్తించడంతో స్థానికుల్లో భయాందోళన మొదలైంది.