Skip to main content

దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదుద్దుతాం

*దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదుద్దుతాం*
- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
అమరావతి, జూన్ 20 :   సహజసిద్దమైన ప్రకృతి అందాలతో అలరారే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ది పరుస్తామని రాష్ట్ర  పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం  5.50 గంటల సమయంలో వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం  రెండో బ్లాక్ లో  రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రూ.2.31 కోట్ల అంచనా వ్యయంతో 10 టూరిజం బోట్లను  కొనుగోలు చేసే ఫైలుపై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 974 కిలోమీటర్ల సముద్రతీర ప్రాంతంతో మరియు  సహజ సిద్ధమైన ప్రకృతి అందాలతో అలరారే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పర్యాటక పరంగా ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. పర్యాటకం మరియు కళల పట్ల ప్రత్యేక శ్రద్ద ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మరియు పర్యావరణ హితమైన పర్యాటకాన్ని అభివృద్ది పర్చాలనే ఆలోచన ఉన్నటు వంటి  ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాన్ నేతృత్వంలో  రాబోయే ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్  రాష్ట్రాన్ని అద్బుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చుదిద్దుతామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని వనరులు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. ఉత్తరాంద్ర, తూర్పుగోదావరి మరియు రాయలసీమ ప్రాంతాల్లో ప్రకృతి శోభతో అలరారే విస్తారమైన అటవీ ప్రాంతంతో పాటు ఎన్నో ప్రముఖ దేవాలయాలు కూడా  రాష్ట్రంలో ఉన్నాయన్నారు.  రాష్ట్రంలో సహసిద్దంగా ఉన్న ఇటు వంటి వనరులను అన్నింటినీ సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్రంలో పర్యావరణ పర్యాటకం, ఆలయ పర్యాటకం, అడ్వెంచర్ పర్యాటకం అభివృద్ధితో పాటు  పర్యాటక బోట్ల సౌకర్యాన్ని కూడా పెద్ద ఎత్తున మెరుగుపరుస్తామన్నారు. 
అదే విధంగా రాష్ట్రంలో సినిమాల చిత్రీకరణకు ఎన్నో అందమైన లొకేషన్లు, ప్రాంతాలు ఉన్నాయని, సినీ రంగ పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన స్టూడియోల నిర్మాణానికి  రాష్ట్రం ఎంతో అనుగా ఉన్న నేపథ్యంలో  రాష్ట్రంలో స్టూడియోల నిర్మాణానికి, మౌలిక వసతుల మెరుగు సినీ రంగ  ప్రముఖులు, నిర్మాతలు రాష్ట్రానికి పెద్ద  ఎత్తున తరలిరావాలని ఆయన ఆహ్వానించారు. 
గత ప్రభుత్వ హయాంలో పర్యాట రంగం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి గురైందని,  పర్యాటకానికి విఘాతం కలిగించే విధంగా ప్రభుత్వ పాలసీ ఉండటం వల్ల దేశ విదేశాల నుండి రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్య పూర్తిస్థాయిలో తగ్గిపోయిందన్నారు. ప్రత్యేకించి విదే పర్యాటకుల సంఖ్య 63 శాతానికి పడిపోయిందన్నారు.  రాష్ట్రంలో పర్యాటక  రంగం అభివృద్దికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా పర్యాటక నిధులను సొంత ప్రయోజనాల కోసం వాడుకోవడం జరిగిందన్నారు. పర్యాటక కేంద్రాలుగా విరాజిల్లాల్సిన ప్రాంతాలను సొంత  ప్రయోజనాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పర్యాటక నిధులను దుర్వినియోగం చేయడం జరిగిందని ఆయన విమర్శించారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...